Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
టమోటో టిప్స్ తో కోమలమైన చర్మం మీసొంతం

1. రెండు టేబుల్ స్పూన్ల టమోట రసం, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరంతో మిక్స్ చేసి ముఖం, మెడ మొత్తం రాసి మసాజ్ చేయాలి. అలా మసాజ్ చేసిన తర్వాత 15-20నిమిషాల పాటు అలాగే వదిలేసి కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ రాదు.
2. రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ టమోటో రసంలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ఈ మిశ్రమాన్ని సూర్యకిరణాలు పడే (ముఖం, మెడ..మొ)ప్రదేశంలో అప్లై చేసి, కొద్ది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేసినట్లైతే చర్మం స్మూత్ గా ఉంటుంది.
3. ఆయిల్ స్కిన్ కలవారు టమోటో..కీరకాయ రసంను సమబాగంలో తీసుకొని, ముఖానికి అప్లై చేసి 20నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేస్తే ఆయిల్ స్కిన్ నుండి బయటపడవచ్చు..
4. ఎక్కువ సి విటమిన్స్ కలిగిన టమోటలను ఉపయోగించడం వల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, చర్మంవ్యాదులు భారీ నుండి బయటపడవచ్చు. టమోటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటితో ముఖంపై స్క్రబ్ చేసినట్లైతే ముఖం కాంతి వంతంగా మెరుస్తుంది.
5. టమోటో జ్యూస్ లో కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల కమిలిన ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.



Click it and Unblock the Notifications