Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
పరవసించే ప్రేమికుల రోజున అదరేటి అదరాలు..

1. ప్రతి రోజు వెన్న, మీగడ, నెయ్యిలాంటివి రాస్తుంటే పెదవులు నిగనిగలాడుతుంటాయి. పెదవులు నల్లగా ఉంటే కాస్త మీగడలో నిమ్మరసం పిండి రాసుకుని పదినిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నలుపు తగ్గిపోతుంది.
2. రెండు టీ స్పూన్ల బొంబాయి రవ్వలో అర టీ స్పూన్ తేనె కలిపి పెదవులపై సున్నితంగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల పెదవులపై ఏర్పడిన మృతకణాలు తొలగడమే కాకుండా నలుపు తగ్గి క్రమేపీ గులాబీ రంగులోకి వస్తాయి.
3. అర టీ స్పూన్ వెన్నలో రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పడుకోబోయే ముందు పెదవులకు అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే పెదవులపై చిన్నచిన్న పగుళ్లు తగ్గి ఎంతో మృదువైన ఆకర్షణీయమైన పెదవులు తయారవుతాయి.
4. కొన్ని చుక్కల టొమాటో జ్యూస్ లో రెండు చుక్కల కొబ్బరినూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పడుకోబోయే ముందు పెదవులకి అప్లై చేయాలి. ఈ విధంగా వారంలో కనీసం మూడు సార్లయినా క్రమం తప్పకుండా చేస్తే పెదవులు పగడకాంతులతో మెరుస్తాయి.
5. పెదవులు ఎర్రగా కాకుండా, నల్లగా కాకుండా ఉన్నాయంటే పగడపు రంగు లిప్ స్టిక్ ఉపయోగించాలి. పచ్చి కొత్తిమీర రసం పెదవులకు రాసుకుని పడుకుంటే పెదవులు అందంగా ఉంటాయి.
6. రాత్రి పడుకునేటప్పుడు పెదవులకు గులాబి రసాన్ని రాసుకుని పడుకుంటే పెదవులు నిగారింపు సంతరించుకుంటాయి. గులాబి రేకుల్ని పాలతో నూరి రాసుకోవాలి. బొటన వేలితో పెదవుల చుట్టూ నొక్కుతూ మసాజ్ చేయడం వలన పెదవులుపై పగుళ్లు ఏర్పడవు.



Click it and Unblock the Notifications