Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీది జిడ్డు చర్మమా..పొడి చర్మమా ఎలా తెలుసుకొనేది...?

సాధారణ చర్మతత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇటువంటి చ ర్మం ఉన్న వారిని అదష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి జిడ్డుచర్మతత్వమే కలిగి ఉంటుంది. ఈ జిడ్డు చర్మం వల్ల సమస్యలు ఎక్కువే . మెటిమలు ఎక్కువగా రావడం, ఎప్పుడూ జిడ్డుగా ఉండడం వల్ల ఎక్కువ సార్లు ముఖం కడుక్కోవాలసి ఉంటుంది. జిడ్డు చర్మ ఉన్నవారు ఎదుక్కొనే సాధారణమైన ఇబ్బందులు. జిడ్డు చర్మం ఉన్నవారు, ఇతర సమస్యలు ఉన్నవారు అందంగా కనబడానికి చిన్న పాటి జాగ్రత్తలు అనుసరిస్తే ప్రయోజనం ఉంటుంది.
1. జిడ్డు చర్మఃతత్వం ఉన్నవారు ఆపిల్ గుజ్జు మొహానికి పట్టించి అరగంట తర్వాత కడుక్కుంటే మొహానికి మంచి నిగారింపువస్తుంది.
2. ప్రతి రోజూ కొబ్బరి నీరు తాగుతూ, కొబ్బరి నీటితో ముఖాన్ని నిత్యం శుభ్రం చేసుకుంటున్నా మొటిమలు తగ్గుముఖం పడుతాయి...
3. టమాటా రసం చర్మానికి రాసుకుంటే స్వేద గ్రంధుల్లో పేరుకొన్న మురికి తొలగిపోయి చర్మం నిగనిగలాడుతుంది..
4. గుడ్డులో తెల్లసొన లేదా మజ్జిగ మొహానికి రుద్దుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.
5. కేరట్ రసం తరచు తాగడం వల్ల, లేదా క్యారెట్లు రోజూ పచ్చివే తినడం వల్ల మొహం కళకళలాడుతుంటుంది.
6. కొత్తిమీర రసాన్ని , నిమ్మరసంతో కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు మాడిపోతాయి.
7. రాత్రిపూట మంచిగంథాన్ని మొహానికి దట్టంగా పట్టించి తెల్లవారి లేవగానే కడిగేసుకోవాలి. ఇలా వారం రోజులు చేస్తే మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయి.
పొడిచర్మతత్వం ఉన్నవారు: వీరు ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించనవసరం లేదు. రోజుకు రెండు సార్లు ముఖాన్ని శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. ఆస్ట్రింజెంట్ లేదా చర్మానికి ఏదైనా క్రీమ్ రాయవచ్చు. ఉదయం వేళలలో మాయిశ్చరైజర్ రాయడం మంచిది. ఇది రోజంతా చర్మంలోని తేమను నిలిపి ఉంచుతుంది. పొడి చర్మం ఉన్న వారు ఆకర్షణీయంగా కనబడరు. చర్మం మెరుస్తూ, కాంతివంతగా ఉండకపోవడంతో ఇటువంటి మొహం ఉన్నవారు పేలవంగా కనిపిస్తారు. పొడి చర్మం ఉన్నవారు క్లోనింగ్ క్రీమ్ వాడడం మేలు.



Click it and Unblock the Notifications