Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
చిన్నవయస్సులోనే ముఖంపై ముడతలు...

ఎన్నో రకాల అనారోగ్యాలకు ఒత్తిడి ప్రధాన కారనమని ఇప్పటికే అధ్యయనాలు తేల్చాయి. ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్నే కాదు..శారీరక అందాన్నీ దెబ్బతీస్తుంది. అదే పనిగా ఒత్తిడికి గురయ్యే వారి చర్మం త్వరగా పొడిబారి ముడతలు బాధిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే..సాధ్యమైనంతవరకు ఒత్తిడికి దూరంగా ఉండండి. మీకంటూ మీరు సులభమైన పద్దతులను కల్పించుకోవాలి. ధ్యానం, యోగా..వంటివన్నీ ఒత్తిడిని తగ్గిస్తాయి.
శరీర బరువును అదుపులో ఉంచుకోవడం మంచిదే. అయితే అది అతి కాకూడదు. అలాంటి వారిలో ఈ ముడతలు ఎక్కువగా కనిపిస్తాయి. చర్మానికి ఆధారంగా నిలిచే కొవ్వుకణాలు బరువు తగ్గడం వల్ల తగ్గిపోతాయి. దాంతో చర్మం సాగినట్టు కనిపిస్తుంది. ముడతలూ మొదలవుతాయి. దీన్ని అదుపులో ఉంచాలంటే..చర్మ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసే రకరకాల ముఖ వ్యాయామాలను ప్రయత్నించాలి. వీటిని ఇంట్లోనే ఆచరించుకోవచ్చు కాబట్టి..చేయడం సులభం.
ముఖ్యంగా శరీరంలో విటమిన్ ‘ఇ’ లోపం కూడా ముడతల్ని పెంచుతాయి. ఇది టాబ్లెట్ రూపంలో అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎలా తీసుకోవాలో అడిగి తెలుసుకుని వాడాలి. అలాగే రాత్రిళ్లు..ముఖానికి విటమిన్ ఇ నూనె రాసుకుంటే చర్మం మృదువుగా మారి మెరుస్తుంది. మందులేని విటమిన్ ఇ క్యాప్ప్సూల్ ను చిన్న కప్పులోకి తీసుకోవాలి. ఇందులో రెండు టీస్పూన్ల పెరుగు, తేనె, నిమ్మరసం, అరచెంచా చొప్పున తీసుకుని బాగా కలిపి..దూదితో ముఖమంతా రుద్దుకోవాలి. పదినిమిషాలయ్యాక కడిగేసుకుంటే చాలు. ఎంతో మార్పు కనిపిస్తుంది. చర్మం తేటగానూ మారుతుంది.



Click it and Unblock the Notifications