Latest Updates
-
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
ఆహార పరంగా అందాన్ని మెరుగుపరుచుకోవడం ఎలా...?
ఒకరి చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. ఇంకొకరి చర్మం పేలవంగా కనిపిస్తుంది. ఏమిటీ తేడా? బహుశా చర్మం నిగనిగలాడేవారు ఖరీదైన సౌందర్యసాధనాలు వాడుతారేమో! అస్తమానం సౌందర్యశాలలను సందర్శిస్తారేమో! అనుకుంటారు. కాని అదంతా నిజం కాదు. చర్మం నిగారింపు పైపై పూతలతో రాదు. ఖరీదైన క్రీములతో వెలిగిపోదు.
కాలానుగుణంగా వాతావరణంలో జరిగే మార్పులను తట్టుకుంటూ చర్మం జీవకళతో నవనవలాడాలంటే మనం రోజూ తినే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే మనం తినే ఆహారం ద్వారానే చర్మానికి కావలసిన పోషణ లభిస్తుంది. ‘చర్మం పేలవంగా, ముడతలు పడ్డట్టుగా, ఉన్నదానికన్నా వయసు మీద పడినట్టుగా కనిపిస్తోందంటే ఆహారం పట్ల మనం సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నమాట'
ఆహారానికి తోడు వాతావరణంలో కాలుష్యం, ఎండలు మొదలైన వాటి బారిన పడి చర్మం కమిలిపోవడం, తెల్లని మచ్చలు రావడం, గరుకుగా తయారవడం, వంటివి జరగవచ్చు. ఇలాంటి దుష్ప్రాబావాలన్నింటి నుండి మీ చర్మాన్ని రక్షించుకోవాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తప్పక పాటించాలి.
ఆహర పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు-

పండ్లు: బొప్పాయి, అరటి, జామ, ఆపిల్ వంటిపండ్లను ఎక్కువగా తీసుకోవాలి.

నీళ్ళు: ఎక్కువ సార్లు మంచీనిరు తాగడం అలవాటు చేసుకోవాలి.

ఉసిరి: నిమ్మ,ఉసిరి లాంటి పుల్లటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.ఎందుకంటే వీటిలో ఉండే సి విటమిన్ మీ చర్మాన్ని కాపాడుతుంది.

సిట్రస్/ఆరెంజ్: ఒక చిన్న పాత్రలో నారింజ తొక్కలు వేసి అయిదు నిమిషాలు మరిగించి దించి ఆ తొక్కలను చర్మంపై రాసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.

తేనె: తేనెను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా తాజాగా ఉంటుంది.

బాదాం: నానబెట్టిన బాదం పొప్ప్ను ఉదయాన్నే తిసుకుంటే చర్మం పొడిబారదు.

కీరదోసకాయ: టీస్పూన్ కీరాజ్యూస్ లో కొంచెం నిమ్మరసం,చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

కోడిగుడ్డు: రోజూ ఒక గుడ్డును తీసుకుంటే చర్మానికి మంచిది.

జ్యూసులు: ఎక్కువగా పళ్ళరసాలను తాగితే చర్మానికి గ్లో వస్తుంది.

కలబంద: కలబందను కొన్ని రోజులపాటు చర్మానికి రాసుకుంటే ఫలితం కనబడుతుంది.

క్యారెట్: దీర్ఘకాలం చర్మం ముడతలు పడకుండా చూసే సుగుణం విటమిన్ ‘ఎ' కు ఉంది. మార్కెట్లో లభించే రకరకాల సౌందర్యసాధనాలను విటమిన్ ‘ఎ'ను ఉపయోగించి తయారుచేసినవే. తీసుకునే ఆహారంలో విటమిన్ ‘ఎ' ఎక్కువ ఉండేలా చూసుకుంటే సౌందర్యసాధనాల అవసరమే ఉండదు. వయసు పైబడటం సమస్యను ఎలాంటి ఆయుధం లేకుండా అడ్డుకున్నట్టే. క్యారట్, గుమ్మడికాయ, చిలగడదుంప, గింజధాన్యాలు, పాలు, గుడ్లలో విటమిన్ ‘ఎ' సమృద్ధిగా లభిస్తుంది.

కొబ్బరి నూనె: కొబ్బరి నూనెను చర్మమంతా వారానికి ఒకసారి మర్దనా చేసుకొవాలి.

చేపలు: ఆహారంలో తగు మోతాదులో కొవ్వు ఉండటం అవసరమే. అయితే అధికకొవ్వు లేదా శాచ్యురేటెడ్ ఫ్యాట్ వంటివి శరీరానికి హాని చేస్తాయి. అందుకని ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పైన దృష్టి పెట్టాలి. ఆవ, వేరుశనగ, ఆలివ్ నూనెల్లో, చేపల నుంచి లభించే ఒమేగా-3 కొవ్వుల్లో, వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ ద్వారా మంచి ఫ్యాట్ లభిస్తుంది.

సన్ ఫ్లవర్ సీడ్స్: లినోలిక్ ఫ్యాటీ యాసిడ్ అన్నది శరీరానికి అవసరమైన ఒక రకం పోషకం. ఆహారం ద్వారా దాన్ని తగినంతగా శరీరానికి అందేలా చూస్తే వృద్ధాప్యం త్వరగా దరిచేరే సమస్యే ఉండదు. చర్మం పొడిబారదు. చర్మంలోని అనారోగ్యం కలిగించే కణాలు తగ్గి మేలైన ఫలితాలు వస్తాయి. లినోలిక్ ఆమ్లం.. నట్స్, పప్పుధాన్యాలు, కోడిగుడ్లు లాంటి ఆహారపదార్థాల్లోనూ కుసుమ, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, సోయా, ఈవెనింగ్‌ప్రిమ్‌రోజ్ నూనెల్లోనూ, గోధుమలు, గుమ్మడిగింజల్లోనూ అధికంగా లభిస్తుంది.



Click it and Unblock the Notifications