మిమ్మల్ని తెల్లగా మార్చే 20 నేచురల్ ఫేస్ ఫ్యాక్స్

అందంగా ఉండాలనే ఆతురతతో మహిళలు మార్కెట్లో వచ్చే ప్రతి బ్యూటీ ప్రొడక్ట్ కొంటుంటారు. అయితే ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. మన ఇండియన్ మహిళలు చాలా వరకూ ఛామన ఛాయను కలిగి ఉంటారు. ఛామన ఛాయను మరింత మెరుగుపరుచుకోవడానికి అనేక బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు . నల్ల ఉన్న ముఖం మరియు మెడ మీద డార్క్ నెస్ తగ్గించేందుకు కొన్ని ఎఫెక్టివ్ ఫేస్ ప్యాక్ లను ఉపయోగించడం వల్ల ఫెయిర్ నెస్ ను పొందవచ్చు.

శాశ్వత చర్మ సౌందర్యంను మెరుగుపరుచుకోవడాని, అందంగా కనబడటానికి ఈ నేచురల్ ఫేస్ ప్యాక్ ను చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ ల యొక్క గొప్పదనం ఏంటంటే ఎటువంటి చర్మ తత్వానికైనా ఉపయోగించవచ్చు. ఈ హేర్బల్ ఫేస్ ప్యాక్ లను ఉపయోగించడం వల్ల ముఖంలో ఫెయిర్ నెస్ వస్తుంది. అంతే కాదు మార్కెట్లో ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను కొనే అవసరం ఉండదు.

ఫెయిర్ నెస్ పొందడానికి మరియు యవ్వనంగా కనబడాలంటే నేచురల్ పద్దతులను మాత్రమే ఉపయోగించాలిని నిపుణుల అభిప్రాయం. కాబట్టి ఆ సహజ ఫేస్ ప్యాక్ పద్దతులను ఒక్కటిగా చేర్చి 20ఫేస్ ప్యాక్ లను మీకు అందిస్తోంది బోల్డ్ స్కై. ఈ ఫేస్ ప్యాక్ లను ఉపయోగించి మీ ఫెయిర్ నెస్ ను పెంచుకొని మరింత అందంగా కనబడటానికి ప్రయత్నించండి.

సాండిల్ వుడ్ ఫేస్ ప్యాక్:

సాండిల్ వుడ్ ఫేస్ ప్యాక్:

చర్మం తెల్లగా పొందడానికి మరియు దోషరహిత చర్మం పొందడానికి సాండిల్ వుడ్(గంధం)పేస్ట్ ను ఉపయోగిస్తారు. గంధం పొడిని బాదంతో చేర్చి పొడి చేసుకోవాలి . ఈ రెండింటి మిశ్రమంను పాలతో మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం నునుపుగా, సున్నితంగా, ప్రకాశవంతంగా మార్చుతుంది.

లోటస్ ఫేస్ ప్యాక్:

లోటస్ ఫేస్ ప్యాక్:

తాగా ఉండే తామరపువ్వుల నుండి రేకులను విడిగా తీసుకొని, వాటికి కొద్దిగా తేనె, పాలు చేర్చి, పేస్ట్ గాలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను వారానికి ఒక సారి ప్యాక్ వేసుకోవడం వల్ల మీ చర్మం తెల్లగా మరియు నేచురల్ గా మారుతుంది.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్:

ఆరెంజ్ ఫేస్ ప్యాక్:

సిట్రస్ పండ్లు చర్మం తెల్లగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి . ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి పొడి చేసి, ఆపొడికి కొద్దిగా పాలు మిక్స్ చేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు అప్లై చేయాలి. ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆపిల్ ఫేస్ ప్యాక్:

ఆపిల్ ఫేస్ ప్యాక్:

పది రోజుల్లో మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే, ఆపిల్ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఆపిల్ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి తేనె చేర్చి బాగా మిక్స్ చేసి ముఖం, మెడకు ప్యాక్ లా వేసుకొని 15నిముషాలు అలాగే వదిలేసి, ఎండిన తర్వాత రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. చర్మఛాయ మెరుగుపరచడంలో ఈ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

స్ట్రాబెర్రీ ఫేస్ ఫ్యాక్:

స్ట్రాబెర్రీ ఫేస్ ఫ్యాక్:

స్ట్రాబెరీను బాగా మెత్తగా చిదిమి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత ముఖంను రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.ఈ స్ట్రాబెరీ ఫేస్ ప్యాక్ చర్మఛాయను మెరుగుపరుస్తుంది. దాంతో మీరు అందంగా కనబడుతారు.

కీరకాయ ఫేస్ ప్యాక్:

కీరకాయ ఫేస్ ప్యాక్:

కీరకాయ రసంకీ తేనె మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంలో అద్భుతమైన మార్పు వస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో ఒకసారి ముఖం, మెడకు పట్టించడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.

తేనెతో ఫేస్ ప్యాక్ :

తేనెతో ఫేస్ ప్యాక్ :

చర్మఛాయను తెల్లగా మార్చడంలో స్వీట్ హానీ చాలా అద్భుతాలను చేస్తుంది. మీరు ఫెయిర్ గా మరియు యవ్వనంగా కనబడాలంటే కొద్దిగా నిమ్మరసంతో కలిపిన హనీ ఫేస్ ప్యాక్ ను వేసుకోవాలి. ముఖం, మెడకు పట్టించిన తర్వాత, పొడిగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

అలోవెరా:

అలోవెరా:

కలబంద, చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మ మీద నలుపును తగ్గిస్తుంది . ముఖం మీద ఏర్పడ్డ మచ్చలను తొలగిస్తుంది . తాజాగా ఉండే కలబంద కట్ చేసి దానిలోని జెల్ ను ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు ముఖం, మెడకు అప్లై చేయాలి.

పసుపు ఫేస్ ప్యాక్:

పసుపు ఫేస్ ప్యాక్:

ఒక అద్భుతమైన మార్పును మీరు కోరుకుంటున్నట్లైతే, ఈ పదార్థంను మీరు ట్రై చేయవచ్చు. పసుపు చర్మఛాయను మెరుగుపరుస్తుంది. పసుపు, పాలు, తేనె మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. చాలా అద్భుతమైన ఫెయిర్ నెస్ స్కిన్ పొందవచ్చు. ఇంకా పసుపు మొటిమలను తొలగించి ముఖంలో నలుపుదనం పోగొడుతుంది.

పాలతో ఫేస్ ప్యాక్:

పాలతో ఫేస్ ప్యాక్:

మీరు మిల్క్ వైట్ గా కనబడాలంటే, మీరు పాలను ఉపయోగించాల్సిందే. కాటన్ బాల్స్ ను పాలలో డిప్ చేసి, మీ ముఖంను శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి చర్మ ఛాయను పొందవచ్చు.

ఓట్ మీల్ ఫేస్ ప్యాక్:

ఓట్ మీల్ ఫేస్ ప్యాక్:

నేచురల్ గా ఫెయిర్ నెస్ స్కిన్ పొందడానికి ఒక మంచి మార్గం ఓట్ మీల్. ఓట్ మీల్ ను ఫేస్ ప్యాక్ గా ఉపయోగించడం వల్ల ముఖంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఓట్ మీల్ పౌడర్ లో కొద్దిగా పాలు మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్ లా వేయాలి. ఇలా క్రమంగా చేస్తుంటా చర్మం రంగులో తప్పకుండా మార్పు వస్తుంది.

బంగాళదుంప ఫేస్ ప్యాక్ :

బంగాళదుంప ఫేస్ ప్యాక్ :

బంగాళదుంపలో బ్లీచింగ్ ఏజెంట్స్ పుష్కలంగా ఉన్నందున, చర్మం ఛాయను మెరుగుపరుస్తుంది . నెలలో మూడు సార్లు బంగాళదుంపతో ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి మార్పు వస్తుంది. బంగాళదుంపను పేస్ట్ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ఫేస్ కు ప్యాక్ లా వేసుకోవాలి. ఎండిపోయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

టమోటో ఫేస్ ప్యాక్:

టమోటో ఫేస్ ప్యాక్:

ఈ ఎర్రటి టమోటోలో చర్మ రంగును మార్చే విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. టమోటో మెత్తగా పేస్ట్ చేసి దానికి కొద్దిగా పాలు, పసుపు చేర్చి ముఖ్యానికి ప్యాక్ లా వేసుకోవాలి. మంచి చర్మ ఛాయను పొందడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. ఈ ప్యాక్ ను వారంలో రెండు మూడు సార్లు వేసుకోవచ్చు.

బాదం ప్యాక్:

బాదం ప్యాక్:

గుప్పెడు బాదంను పేస్ట్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ముఖం, మెడ మీదాబాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది . అలాగే చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.

శెనగపిండి ఫేస్ ప్యాక్:

శెనగపిండి ఫేస్ ప్యాక్:

మరో గొప్ప హెర్బల్ రెమడీ శెనగపిండి. ఇది చర్మ ఛాయలో అద్భుతమైన మార్పును తీసుకొస్తుంది. శెనగిపండిని, పెరుగుతో మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా, నునుపుగా మారుతుంది.

అవొకాడో ఫేస్ ప్యాక్:

అవొకాడో ఫేస్ ప్యాక్:

గ్రీన్ కలర్ లో ఉన్న ఈ అవొకాడో పండును మెత్తగా పేస్ట్ చేసి కొద్దిగా పాలు చేర్చి పేస్ట్ లా చేయాలి. దీన్ని ముఖం, మెడకు పట్టించడం ద్వారా మంచి కలర్ పొందవచ్చు. ఈ ప్యాక్ ను వారంలో రెండు సార్లు వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

స్కిన్ బ్లీచింగ్ లో అద్భుతంగా పనిచేసే వాటిలో నిమ్మరసం ఒకటి. సిట్రస్ పండ్లు, కాయలు, చర్మ ఛాయను మెరుగుపరిచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి తాజా నిమ్మకాయను కట్ చేసి ముఖం మరియు మెడ మీద మసాజ్ చేసి 10నిముషాలు అలాగే వదిలేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . ఈ ఫేషియల్ నెలలో మూడు సార్లు చేయడం వల్ల చర్మ మెరిసేలా చేస్తుంది. నిమ్మరసాన్ని పొడి చర్మం కలవారు ఉపయోగించకూడదు.

ల్యావెండర్:

ల్యావెండర్:

చర్మ సంరక్షణలో ఒది ఒక మంచి మూలిక. మెటిమలను నివారించడంలో ల్యావెండర్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటా . మరియు చర్మంఛాయను బాగా మెరుగుపరుస్తుంది. కాబట్టి, ల్యావెండర్ హెర్బ్ ను గ్రైండ్ చేసి పాలు మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

ఫెయిర్ నెస్ స్కిన్ పొందడంలో ఉల్లిపాయ ఒక మంచి హెర్బల్ రెమడీ. ఎర్రగా ఉండే ఉల్లిపాయను గ్రైండ్ చేసి, ఈ పేస్ట్ ను ముఖం, మెడకు పట్టించాలి. నేచురల్ హోం రెమడి చర్మ ఛాయను మెరుగుపర్చడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

ముల్తాని మట్టి:

ముల్తాని మట్టి:

ఈ పౌడర్ ను ఫుల్లర్స్ ఎర్త్ అని అంటారు. రోజ్ వాటర్ లో ముల్తాని మట్టిని మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ప్యాక్ లా వేసుకోవాలి. ఇది పొడిబారే వరకూ ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

Desktop Bottom Promotion