For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అవోకాడోతో అద్భుతమైన ..ఆశ్చర్యకరమైన చర్మ సౌందర్యం...

|

అవోకాడో అనేది తినేటటువంటి పండు. ఇది పండు మాత్రమే కాదు ఇందులో ఆరోగ్యానికి, సౌందర్యానికి ఉపయోగపడే ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. మోనోశాచ్యురేటెడ్ కొవ్వు పదార్థాలున్నాయి. అవోకాడోను ముఖానికి అప్లై చేస్తే ఆశ్చర్యకరమైన సౌందర్య ప్రయోజనాలను మీరు చూడవచ్చు. అవొకాడోను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మంలోని వృద్ధాప్య గుర్తులను తగ్గిస్తుంది. పొడి చర్మాన్ని పోగొట్టి చర్మ తేమగా ఉండేలా చేస్తుంది. ముఖాన్ని చాలా సున్నితంగా మార్చేస్తుంది.

అవొకాడో మీద జరిపిన అనేక పరిశోధనల ప్రకారం, వృద్ధాప్య ఛాయలను పొగొట్టే, వృద్ధాప్యం నివారించడానికి ఇది ఒక అద్భుతమైన ఉత్తమమైన స్కిన్ కేర్ ఫ్రూట్ అని తేల్చారు. ఇందులో బహు ప్రయోజనాలు కలిగించే పెద్ద మొత్తంలో స్టెరొలిన్స్(ఒక ప్రోటిన్) ఇందులో కనుగొన్నారు. ఈ స్టెరొలిన్ వృద్ధాప్య మచ్చలు తగ్గిస్తుంది. ముడతలు నిరోధిస్తుంది, ముదురు రంగు మచ్చలు మాయం చేస్తుంది. మచ్చలు మరియు స్కిన్ డ్యామేజ్ లను పోగొడుతుంది. కాబట్టి మీ ముఖంలో ఖచ్చితమైన చర్మ సౌందర్యాన్ని పొందడానికి, ప్రకాశించ చర్మసౌందర్యాన్ని సొంత చేసుకోవడానికి ఈ అవొకాడోను ముఖానికి పట్టించండి అవొకాడో ఆయిల్ ల్లో స్టెరొలిన్స్ అత్యధిక శాతంలో కలిగి ఉంది.

చాలా అవోకాడో ఫేస్ ప్యాక్స్ మాయిశ్చరైజింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందుకే అవోకాడోతో తయారు చేసిన లిప్ బామ్ ను వింటర్ లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీన్ని పెదాలకు రాయడం వల్ల పెదాలు సున్నితంగా, తడిగా, గులాబి వర్ణంలోకి మారుతాయి. ప్రస్తుతం వింటర్ సీజనే కాబట్టి కొన్ని రకాల ఫేస్ ప్యాక్స్, ఫేస్ స్ర్కబ్ లను, కొన్ని రకాల క్రీములను మీరు ప్రయత్నించడం వల్ల మీ ముఖం ప్రకాశవంతంగా ఆకర్షణీయంగా మారుతుంది.

ఇక్కడ కొన్ని అవొకాడో స్కిన్ కేర్ ప్యాక్స్, మాస్కులు, స్ర్కబ్ లు, క్రీములు మరియు ఎక్స్ ఫ్లోయిట్స్ వంటి చర్మ సంరక్షణ ప్రయోజనాలను ఈ అవోకాడో ద్వారా పొందవచ్చు. అదెలాగో చూడ్డండి...

అద్భుతమైన చర్మ సౌందర్యానికి అవోకాడో...

అవోకాడో ఫేస్ ప్యాక్: ఇది చాలా సింపుల్ ఫేస్ ప్యాక్. ఒక మిక్సింగ్ బౌల్లో అవొకాడో గుజ్జు, ఉప్పు, పంచదార మరియు పాలు వేసి, మీరు కావాలనుకొంటే కొద్దిగా తేనె కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ముఖాన్ని శుభ్రం చేసుకొంటే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

అద్భుతమైన చర్మ సౌందర్యానికి అవోకాడో...

అవోకాడ్ -సాల్ట్ స్ర్కబ్: ఈ రెండింటి మిశ్రమంతో ముఖానికి స్ర్కబ్బింగ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిస్తుంది. ముఖాన్ని శుభ్రపరుస్తుంది. నల్ల మచ్చలను పోగొడుతుంది. ఉడికించిన అవొకాడోను చిదిమి అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి స్ర్కబ్ చేసి పది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

అద్భుతమైన చర్మ సౌందర్యానికి అవోకాడో...

అవోకాడో-బొప్పాయి ఫేస్ ప్యాక్: చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేసే మరో అద్భుతమైనటువంటి ఫేస్ ప్యాక్ ఇది. బాగా పండిన బొప్పాయిని గుజ్జులా తయారు చేసుకొని అందులో ఉడికించిన అవోకాడో గుజ్జును, తేనె కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి, పది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి.

అద్భుతమైన చర్మ సౌందర్యానికి అవోకాడో...

అవోకాడో స్టోన్ మసాజ్: ఇంట్లో మీరు స్పా ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారా?అయితే ఈ అవొకాడో స్టోన్ మసాజ్ ను ప్రయత్నించండి. అవోకాడో గుజ్జును ముఖానికి పట్టించి స్పాస్టోన్ తో బాగా మర్ధన చేస్తే, ముఖ కణాలకు రక్త ప్రసరణ బాగా జరిగి చర్మాన్ని శుభ్రం చేసి, కాంతి వంతంగా మార్చుతుంది.

అద్భుతమైన చర్మ సౌందర్యానికి అవోకాడో...

అవోకాడో -కోకోనట్ క్రీమ్: వింటర్ సీజన్ లో మీ చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గానూ, చర్మం టైట్ గా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కోకోనట్ ఆయిల్ టానింగ్ తో పోరాడుతుంది మరియు పొడి చర్మ సమస్యలైన చర్మం దురద మరియు పొడిబారడం వంటి సమస్యలనుండి ఉపశమనం పొందేలా చేస్తుంది.

అద్భుతమైన చర్మ సౌందర్యానికి అవోకాడో...

అవోకాడో ఆయిల్: అవోకాడో ఆయిల్ తో ఫేషియల్ మసాజ్ చేయడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు చేకూరతాయి. ఇది చర్మంలోని ముడుతలను పోగొట్లి, మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇంకా ఈ అవోకాడో ఆయిల్ ను పెదాలకు రాయడం వల్ల పెదాలు పింక్ కలర్ లో మృదువుగా మారుతాయి.

అద్భుతమైన చర్మ సౌందర్యానికి అవోకాడో...

అవోకాడో జ్యూస్: చర్మానికి వెజిటేబుల్ జ్యూస్ బెనిఫిట్స్. మీరు అవోకాడో జ్యూసుని ఒక గ్లాసు తాగిన కూడా చర్మానికి మంచి గ్లో వస్తుంది. ముడుతలు దరిచేరకుండా అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది.

English summary

Amazing Uses Of Avocado For Skin | అద్భుతమైన చర్మ సౌందర్యానికి అవోకాడో...

Avocado is one fruit that has many beauty benefits. If applied to the face, avocado can show very good skin benefits. Applying avocado reduces signs of skin ageing, heals dry skin, softens the skin and also prevents it from drying.
Story first published: Friday, January 11, 2013, 16:25 [IST]
Desktop Bottom Promotion