పొడి చర్మం: హోం మేడ్ నేచురల్ ఫేస్ ప్యాక్

వింటర్ సీజన్ లో వాతావరణంలో మార్పులతో పాటు, చర్మం, జుట్టు మార్పులు చోటు చేసుకుంటాయి. వాతావరణంలోని కఠినమైన గాలులు, వాతావరణంలోని తేమ ప్రభావం, చర్మం, జుట్టు మీద ఎక్కువగా చూపెడుతాయి. అందులోనూ వింటర్ సీజన్ లో అనేక పార్టీలు, ఫంక్షన్స్ జరగడం కూడా ఎక్కువగా అనుకోకుండా మీకు ఏ పార్టీకో, లేదా ఏ ఫంక్షన్ కో పిలుపు వచ్చినప్పుడు, అనుకోకుండా మీరు తప్పని సరిగా వెళ్ళాళ్ళి వస్తే, ఆ సమయంలో మీరు బ్యూటీ పార్లర్ కు వెళ్ళే సమయం లేనప్పుడు, మీరు చింతించాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే వింటర్ సీజన్ లో మీ డ్రై స్కిన్ నివారణకు తక్షణ మార్గం, పది హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ ను చాలా సులభం తయారుచేయవచ్చు. ముఖ్యంగా చర్మం మరియు కేశ సంరక్షణ విషయంలో నేచురల్ ప్యాక్స్ చాలా ఉత్తమం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తాయి. ఇవి మీ చర్మంను సాప్ట్ గా మరియు మెరుస్తుంటుంది. ఆ ఫేస్ ప్యాక్స్ ఏంటో ఒక సారి చూద్దాం...

కీరదోస ఫేస్ ప్యాక్:

కీరదోస ఫేస్ ప్యాక్:

ఈ కీరదోసకాయ ఫేస్ ప్యాక్ చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది ఈ కీరదోస యొక్క రసాన్ని లేదా పేస్ట్ ను ముఖం లేదా మెడకు అప్లై చేసి బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . చర్మం చల్లగా మరియు తాజాగా మారుతుంది.

అరటి ఫేస్ ప్యాక్:

అరటి ఫేస్ ప్యాక్:

అరటి పండ్లులో విటమిన్ ఎ, విటమిన్ బి మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉండి, యాంటీఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. బాగా పండిన అరటి పండును మెత్తగా చేసి, అందులో కొద్దిగా తేనె చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ కాంతివంతంగా మారుతుంది . ఇందులో ఫైబర్ , మినిరల్స్, మెగ్నీషియం, మరియు పొటాషియం అధికంగా ఉండి, మన శరీరంలో రక్తప్రసరగా సరిగా జరిగేలా చేస్తుంది. రోగనిరోధకతను పెంచుతుంది.

పెరుగు మరియు రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్:

పెరుగు మరియు రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్:

రోజాపువ్వుల యొక్క రేకులు మీ ముఖంలో తాజాదనాన్ని నింపుతుంది. మరియు చర్మం ప్రకాశవంతంగా మార్చుతుంది . మీరు రోజ్ వాటర్ లో తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది మీ చర్మాన్ని తేమగా మరియు సాఫ్ట్ గా ఉంచుతుంది. అలాగే రోజా పువ్వుల యొక్క రేకులను పేస్ట్ చేసి, అందులో పెరుగు మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవచ్చు.

వాటర్ మెలోన్ ఫేస్ ప్యాక్:

వాటర్ మెలోన్ ఫేస్ ప్యాక్:

అటు చర్మానికి ఇటు శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ అధికంగా కలిగించే పండు పుచ్చకాయ. కాబట్టి పుచ్చకాయను మీ ముఖానికి మసాజ్ చేయడం వల్ల చర్మం టైట్ గా మరియు డిటాన్ కలిగి ఉంటుంది.

ఓట్ మీల్ ఫేస్ ప్యాక్:

ఓట్ మీల్ ఫేస్ ప్యాక్:

ఓట్ మీల్ ను రాత్రంతా నీటిలో నానబెట్టి, తర్వాత రోజు ఉదయం మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసి తర్వాత అందులో పుల్లని పెరుగు చేర్చి, ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. చర్మం రంగు మార్చడంలో అద్భుత మార్పు కనిపిస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా దీన్ని ఉపయోగించండి.

అవొకాడకో ఫేస్ ప్యాక్:

అవొకాడకో ఫేస్ ప్యాక్:

అవొకాడో పండు తినడానికి మాత్రమే కాదు. అవొకాడోలో బయోటిన్ పుష్కలంగా ఉన్నందు వల్ల, దీని ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల పొడిబారిన చర్మాన్ని, చిట్లిన కురులను, చిట్లిన గోళ్ళ సంరక్షణ బాగా ఉపయోగపడుతుంది. అవకాడో ఫేస్ మాస్క్ పొడిబారిన చర్మానకి చాలా ఫర్ ఫెక్ట్ గా పనిచేస్తుంది. ముఖంగా శీతాకాలంలో చర్మం పొడిబారి దురదగా ఉండటం వంటి లక్షణాలను అవకాడో ఫేస్ మాస్క్ పోగొడుతుంది. తాజాగా ఉన్న అవాకోడోను బాగా మెత్తగా చేసి దానికి ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి బాగా ముఖానికి అప్లై చేయాలి. ఈ ఫేషియల్ మాస్క్ చర్మానికి కావాలసిన మినరల్స్, విటమిన్స్, యాంటిఆక్సిడెంట్స్ అందించి చర్మాన్ని నునుపుగా మార్చుతుంది. శీతాకాలంలో చర్మం పొడిబారనీయకుండా చేస్తుంది.

శెనగపిండి ఫేస్ ప్యాక్:

శెనగపిండి ఫేస్ ప్యాక్:

శెనగపిండితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మ రంగు క్రమంగా పెరుగుతుంది. యవ్వనంగా మెరిసే చర్మాన్ని అందిస్తుంది. మంచి ఫలితాల కోసం శెనగపిండిలో మలై లేదా మజ్జిగను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ శతాబ్దాల కాలం నుండి ఉపయోగిస్తున్నారు.

ఎగ్ మరియు తేనె ఫేస్ ప్యాక్:

ఎగ్ మరియు తేనె ఫేస్ ప్యాక్:

గుడ్డులోని తెల్ల సొన ఆయిల్ స్కిన్ ఉన్నవారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎగ్ వైట్ తీసుకొని దానిలో కొద్దిగా తేనె మిక్స్ చేసి, దాన్ని ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం వల్ల మీ చర్మం మునపటి కంటే చాలా ఆరోగ్యంగా కనబడుటయే కాకుండా జిడ్డును వదిలించి చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతే కాదు ముఖ చర్మం వదులుగా లేకుండా టైట్ చేస్తుంది. చలికాలంలో దీన్ని వేసుకోవడం వల్ల చలినుండి, మంచు నుండి చర్మాన్ని కాపాడుతుంది.

అరటిపండు మరియు పెరుగు మాస్క్:

అరటిపండు మరియు పెరుగు మాస్క్:

చలికాలం, శీతాకాలం, వర్షాకాలంలో చర్మాన్ని రక్షించుకోవడం కొంచెం ఇబ్బదికరమైన విషయమే. సున్నితమైన చర్మ తత్వం కలవారు శీతాకాలంలో సున్నితమైనటువంటి బనానా ఫేషియల్ మాస్క్ వేసుకోవడం చాలా మంచిది.ఈ వేసవికాలంలో పెరుగును చర్మ రక్షణకు,అదేవిధంగా కేశసంరక్షణకు ఉపయోగించవచ్చు.ఈ పెరుగు చర్మానికి తాజాదన్నాన్ని కలిగించడమే కాకుండా డిటాన్ మరియు చర్మాన్నిసాఫ్ట్ గా ఉంచుతుంది.

శాండిల్ వుడ్ ఫేస్ ప్యాక్:

శాండిల్ వుడ్ ఫేస్ ప్యాక్:

జిడ్డు చర్మ తత్వం కలిగిన వారు చదనం లేదా మంచి గంధం పౌడరను నీళ్ళతో మిక్స్ చేసి, పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల ఒక అద్భుత మార్పును మీరు పొందవచ్చు. ఇది చర్మరంగును మార్చడే కాదు, చర్మాన్ని ఫ్రెష్ గా ఉంచుతుంది.

Story first published: Saturday, December 21, 2013, 14:30 [IST]
Desktop Bottom Promotion