స్వచ్చమైన చర్మం సౌందర్యం పొండానికి ఫ్రూట్ ఫేస్ ప్యాక్

సాధారణంగా మనందరం ఒక స్పష్టమైన మరియు దోషరహిత చర్మం పొందడానికి ఇష్టపడుతుంటాము. అయితే కొన్ని లేదా ఇతర చర్మ సమస్యలు ముఖం యొక్క అందంను నాశనం చేస్తుంటాయి మరియు తరచుగా ముఖం మీద డార్క్ మచ్చలు ఏర్పడేలా చేస్తుంది. ఉదాహరణకు, మొటిమలు, పిగ్మెంటేషన్, సన్ టాన్, డార్క్ స్పాట్స్, కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్ మొదలగునవి చాలా సాధారణ చర్మ సమస్యలు. ఇవి చర్మం మీద మరకలకు కారం అవుతుంది.

మీరు ఒక స్పష్టమైన మరియు దోషరహిత చర్మం మెయింటైన్ చేయడానికి, మీరు తరచూ కొన్ని పద్ధతులను అనుసరిస్తుండాలి. ఉదాహరణకు : మీరు క్రీమ్స్ ను అప్లై చేయడం. ముఖ్యంగా ఫేషియల్ ఫేష్ వాష్ ఉపయోగించడం వల్ల ఒక స్వచ్చమైన చర్మఛాయను అంధిస్తుంది. అయితే, కొన్ని ఎటువంటి ఫలితాలను చూపించక, ముఖం మీద డార్క్ స్పాట్స్ ను అలాగే ఉంచుతాయి. అవి ముఖంలో ఎత్తికనిపిస్తూ, అందవిహీనంగా మార్చతాయి. కాబట్టి, మీరు ఎటువంటి మచ్చలు, మొటిమలు లేని క్లియర్ స్కిన్ కోరుకుంటున్నట్లైతే మీరు కొన్నివిలువై హోం రెమడీస్ ను ప్రయత్నించండి.

సాధారణంగా డెర్మటాలజిస్ట్ (చర్మ వైద్యుల)దగ్గరకు వెళ్ళినప్పుడు హెల్తీ డైట్ తీసుకోమని సూచిస్తుంటారు. మీ ప్రాథమిక అంశాలలో మీ రెగ్యులర్ డైట్ లో ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ చేర్చుకోవడం వల్ల క్లియర్ స్కిన్ పొందవచ్చు. అదేవిధంగా, ఓరల్ అప్లియన్స్ అంటే పండ్లుతో కూడా సహజంగానే ఒక క్లియర్ స్కిన్ పొందవచ్చు.

వివిధ రకాలైన పండ్లు మీ చర్మానికి ప్రయోజనాలు కలిగించే అనేకమైన పండ్లు మీకు అందుబాటులో మార్కెట్లో లభ్యం అవుతున్నాయి . కాబట్టి, వాటిని ఉపయోగించి మీరు ఒక స్పష్టమైన మరియు మెరిసేటి చర్మసౌందర్యాన్ని పొందడానికి కొన్ని ఫ్రూట్ ఫేస్ ప్యాక్ లను ప్రయత్నించండి. ఇవి హోం మేడ్ ఫేస్ ఫ్యాక్ మరియు సహజమైనవి కూడా. ఇవి అంత ఖర్చుతో కూడినవి కాదు మరియు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగించవు. చర్మ సంరక్షణకు వివిధ రకాల పండ్లను ఉపయోగించడం జరిగింది. బొప్పాయా నుండి అరటిపండ్ల వరకూ అన్నింటినీ మ్యాష్ చేసి ఇతర వంటగది వస్తువులు-తేనె, నిమ్మరసం, మరియు పెరుగు వంటి వాటితో మిక్స్ చేసి హోమేడ్ ఫేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు. కాబట్టి మీరు క్లియర్ స్కిన్ పొందడానికి కొన్ని హోం మేడ్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ ను ట్రై చేయండి...

క్లియర్ స్కిన్ పొందడానికి కొన్ని హోం మేడ్ ఫేస్ ప్యాక్స్

1. స్ట్రాబెర్రీ:

1. స్ట్రాబెర్రీ:

చర్మ సంరక్షణకు ఉపయోగించదగ్గ ఒక బెస్ట్ రెడ్ ఫ్రూట్ ఇది. ఇందులో ఉండే యాంటిఆక్సిడెంట్స్ కణాలు ఆక్సిజన్‌ను ఉపయోగించుకున్న తరవాత విసర్జించిన ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే హానిని రిపెయిర్ చేయటానికి ఉపయోగపడతాయి. ఇవి సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల కొలాజెన్ ఉతపత్తి పెంచవచ్చు. స్ట్రాబెర్రీ చర్మం మెరిసేలా చేస్దుంది. స్ట్రాబెరీ ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలను, మచ్చలను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అరకప్పు స్ట్రాబెరీలను మెత్తగా పేస్ట్ చేసి, అందులో పాలు లేదా పెరుగును మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేసి 10-15నిముషాలు అలాగే ఉంచి , తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల , ఇది చాలా ప్రభావవంతంగా మొటిమలను, మచ్చలను నివారిస్తుంది.

2. అరటి పండ్లు:

2. అరటి పండ్లు:

ముఖానికి రిఫ్రెషనస్ బనానా అరటిపండును చర్మ సంరక్షణ గ్రేట్ మాయిశ్చరైజర్ అని చెప్పవచ్చు. బనానా మాయిశ్చరైజర్ తో ముఖానికి రిఫ్రెషనస్ వస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది. అరటి పండుతో వేసుకొనే ఫేస్ ప్యాక్ ల వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. చర్మానికి కావల్సిన తేమను అందించడమే కాకుండా, ఇది సూర్యుని తాపాన్ని తగ్గిస్తుంది, సూర్యకిరణాలవల్ల కమిలిన చర్మాన్ని తిరిగి పూర్వ స్థితికి తీసుకొస్తుంది. బనానాతో పాటు కొన్ని ఇతర పదార్థాలు తీసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బాగా పండిన బానానాకు ఆలివ్ ఆయిల్, రోజ్ వాటర్, కోకో బాటర్ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకొని తర్వాత పాలు లేదా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే మెరిసే, తాజా చర్మం మీ సొంతం అవుతుంది.

3. వాటర్ మెలోన్:

3. వాటర్ మెలోన్:

జ్యూసీ వాటర్ మెలోన్ ఒక మంచి రెడ్ ఫ్రూట్. ఇది ఆరోగ్య పరంగానే కాదు, సౌందర్య పరంగా కూడా ఎక్కువ మేలు చేస్తుంది. పుచ్చకాయను ముక్కలుగా కట్ చేసి ముఖం మీద మసాజ్ చేయాలి. తడి ఆరిన తర్వాత మరో తాజా ముక్కను తీసుకొని మల్లీ మసాజ్ చేయాలి. ఇలా మూడు నాలుగు సార్లు చేసిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దాంతో చర్మం శుభ్రపడటమే కాదు కాంతివంతంగా మారుతుంది.

4. ఆపిల్:

4. ఆపిల్:

ముఖ చర్మంలో అన్ని రకాల సమస్యలను నివారించడంలో రెడ్ ఆపిల్ చాలా బెస్ట్. మీ ముఖంలో స్కార్స్ ఉన్నట్లైతే, ఆపిల్ ఫేస్ మాస్క్ తో చెక్ పెట్టవచ్చు. పొట్టుతో సహా ఆపిల్ ముక్కలను మెత్తగా పేస్ట్ చేసి, ఒక స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. తడి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

5. ఆరెంజ్:

5. ఆరెంజ్:

వృద్ధాప్య ప్రక్రియలో ఆరెంజ్ ఆరెంజ్ లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని బాగా ఉపయోగపడుతుంది. సి విటమిన్ చర్మానికి మంచి మెరుగును అందిస్తుంది. విటమిన్ ఇ, ఎ, సి : కొలాజెన్ ఉత్పత్తికి,మెయింటెన్ చేయటానికి సహాయపడే వీటిని తినే ఆహారం ద్వారా సులువుగా శరీరానికి అందించవచ్చు. ఆరెంజ్ ఫేస్ ప్యాక్ తో మొటిమలను నివారించవచ్చు.

6. బొప్పాయి:

6. బొప్పాయి:

బొప్పాయి ఫేస్ ప్యాక్ తో ముఖంలో నున్న మొటిమలను తొలగించి కాంతివంతంగా చేస్తుంది. మొటిమలు ఎక్కువగా ఉన్నట్లైతే ఈ ఫేస్ ప్యాక్ ను ప్రతి రోజూ ఒక వారం పాటు క్రమం తప్పకుండా వేసుకొన్నట్లైతే తప్పకుండా ఫలితం ఉంటుంది.విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. నిర్జీవమైన చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. బొప్పా యి గుజ్జు తో ఫేస్‌ ప్యాక్‌ కూడా వేసుకోవచ్చు. ప్రతిరోజూ ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే మంచిది. బొప్పాయిని మెత్తగా చేసి,అందులో పెరుగు లేదా తేనె మిక్స్ చేయాలి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని శుభ్రపరచడంతోపాటు చర్మాన్ని టైట్ చేస్తుంది. మొటిమలను పూర్తిగా నివారిస్తుంది.

7. చెర్రీస్:

7. చెర్రీస్:

ఎర్రగా ఉండే ఈ చిన్న చెర్రీ పండ్ల వల్ల చర్మ కాంతి రెట్టింపు అవుతుంది. ముఖంలో డార్క్ నెస్ ను తొలగితస్తుంది. చెర్రీఫ్రూట్ ఫేస్ ప్యాక్ మొటిమలతో వచ్చే మచ్చలను కూడా పూర్తిగా మాయం చేస్తుంది. ఒక గుప్పెడు చెర్రీపండ్లను మెత్తగా పేస్ట్ చేసి, అందులో రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అరగంట అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

8. టమోటో:

8. టమోటో:

టమోటో వల్ల చర్మానికి చాలా అధికంగానే ప్రయోజనాలున్నాయి. టమోటోను చేత్తోనే బాగా గుజ్జులా నలిపేసి దాన్ని అలాగే ముఖం మరయిు మెడ మీద అప్లై చేసుకోవాలి. ముఖం మీద టమోటో రసం ఎండిన తర్వాత పాలు లేదా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

9. ప్లమ్:

9. ప్లమ్:

ముదురు వర్ణంలో ఉండే ఈ రెడ్ ఫ్రూట్ ను స్కిన్ కేర్ కు నిరభ్యరంతంగా ఉపయోగించవచ్చు. ఈ రెడ్ ప్లమ్ ఫ్రూట్ ను రెండు లేదా మూడు తీసుకొని మిక్సీలో వేసి కొద్దిగా పాలు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఈ బ్యూటీ ట్రీట్మెంట్ ను వారానికొక సారి ఫాలో చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దాంతో ముఖంలో డార్క్ నెస్ మరియు మొటిమలు తొలగిపోతాయి

10. దానిమ్మ:

10. దానిమ్మ:

దానిమ్మ హోం మేడ్ ఫేస్ ప్యాక్ గా ఉపయోగించుకోవచ్చు. ఒక కప్పు దానిమ్మ గింజలను పేస్్ట చేసి 3/4కప్పు క్రీమ్ మిక్స్ చేసి ముఖం, మెడ కు అప్లై చేయాలి. ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత 20నిముషాలు అలాగే ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ఆయిల్ స్కిన్ తొలగిపోతుంది. చర్మం ప్రకాశవంతంగా క్లియర్ గా ఉంటుంది.

11. అవొకాడో:

11. అవొకాడో:

అవొకాడో పండు తినడానికి మాత్రమే కాదు. అవొకాడోలో బయోటిన్ పుష్కలంగా ఉన్నందు వల్ల, దీని ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల పొడిబారిన చర్మాన్ని, చిట్లిన కురులను, చిట్లిన గోళ్ళ సంరక్షణ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎప్పుడైతే ముఖానికి అప్లై చేస్తామో అప్పటి నుండి చర్మం తేమగా మారి కాంతి వంతంగా మారుతుంది.

12. కీరదోస:

12. కీరదోస:

ఏ సీజన్ లో అయినా సరే చర్మాన్ని కూల్ గా.. ఫ్రెష్ గా ఉంచడానికి తాజా వెజిటేబుల్స్ ను కూడా ఉపయోగించవచ్చు. తాజా కీరదోసకాయ ముక్కతో ముఖానికి మసాజ్ చేయడం వల్ల చర్మం శుభ్రపరచడంతోపాటు, కీరకాయను చక్రాల్లా కోసి కళ్ళ మీద పెట్టుకోవడం వల్ల కళ్ళు విశ్రాంతి పొందుతాయి, కళ్ళ మంటలను నుండి ఉపశమనం పొందేలా చేస్తాయి.

13. కివీ ఫ్రూట్:

13. కివీ ఫ్రూట్:

కివి ఇది ఒక సిట్రస్ ఫ్రూట్. ఇందులో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది సహజంగా చర్మ ఛాయను మార్చడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ కివి పండును తాజాగా తినవచ్చు. మరియు ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు, ముఖంలో రంద్రాలు తొలగిపోయి, ముఖ్యం బ్యూటిఫుల్ గా కనబడుతుంది.

14. నిమ్మ:

14. నిమ్మ:

చాలా రకాల ఫేస్ ప్యాక్ ల్లో ఈ నిమ్మరసాన్ని తప్పనిసరిగా ఉపయోగించి ఉంటారు. లెమన్ లో సిట్రస్ యాసిడ్ ఉండటం వల్ల చర్మాన్ని శుభ్రపరుస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. ముఖంలో జిడ్డును తొలగించి చర్మం తెల్లగా మార్చుతుంది. నిమ్మరసం మరియు తేనె రెండు మిక్స్ చేసి ముఖానికి పట్టించి జిడ్డు చర్మం నుండి బయటపడండి.

15. ద్రాక్ష:

15. ద్రాక్ష:

స్కిన్ కేర్ కు రెడ్ గ్రేప్ అద్భుతంగా పనిచేస్తుంది. రెడ్ గ్రేప్ జ్యూస్ ను టీజోన్ ప్రదేశంలో అప్లై చేయవచ్చు. దాంతో ముఖంలో జిడ్డు వెంటనే తొలగిపోతుంది. దాంతో ముఖంలో నల్లటి వలయాలు, చారాలను తొలగించుకొని వయస్సు పైబడకుండా కనబడేలా చేస్తుంది.

16. క్రాన్ బెర్రీస్:

16. క్రాన్ బెర్రీస్:

అన్ని రకాల చర్మ సమస్యలకు ఈ రెడ్ ఫ్రూట్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా ముఖంలో ప్యాచెస్ ఉన్నప్పుడు ఈ రెమడీ ఫర్ ఫెక్ట్ గా పనిచేస్తుంది. కాబట్టి తెల్లని ప్యాచెస్ నివారించుకోవడానికి ఈ రెడ్ ఫూట్ ఫేస్ ప్యాక్ ను వేసుకోండి. ఈ పండ్లతో తయారుచేసి గుజ్జును ప్యాక్ గా వేసుకోవడం కానీ లేదా రసంతో ముఖం శుభ్రం చేసుకోవడం కానీ చేయచ్చు.

17. రాస్పెబెర్రీస్:

17. రాస్పెబెర్రీస్:

ముఖంలో బ్లాక్ హెడ్స్ తొలగించడానికి అద్భుతంగా పనిచేసిది ఈ పండు. ఈ పండును ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం వల్ల, బ్లాక్ హెడ్స్ ను పూర్తిగా తొలగించుకోచ్చు. రాస్బెర్రీ పండును తీసుకొని దాంతో అలాగే తాజాగా ముఖం మీద మర్ధన చేయాలి. పదిహేను నిముషాల పాటు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా రబ్ చేసిన తర్వాత పాలలో ముంచిన కాటన్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి.

Story first published: Friday, November 8, 2013, 13:31 [IST]
Desktop Bottom Promotion