For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేమికుల రోజున బుగ్గల్లో గులాబీ మెరుపులు ఇలా...!?

|

ప్రేముకుల వారం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రేపే(14.02.13)ప్రేమికుల రోజు. మరీ మీ ప్రేయసిన, ప్రియులని ఇంప్రెస్ చేయడానికి ప్రిపేర్ అయ్యారా. ముఖ్యంగా ఎర్రగులాబీలు, డజన్లలో చాక్లెట్స్ మరియు టన్నుల్లో ప్రేమను పొందాడానికి సిద్దం అయ్యారా...? మనందరకీ తెలుసు ఎర్రగులాబీలు ఎంత ఫేమస్సో. గులాబీల్లో గుభాళించే పరిమళం, మనస్సును ఆకట్టుకొనే గులాబీ రంగులు ఏ స్త్రీనైనా టేప్ట్ చేయాల్సిందే. క్షణాల్లో మనసు మార్చేస్తుంది అంత పవర్ ఉంది గులాబీల్లో...చాలా మంది మహిళలు ఏదో ఒక సందర్భంలో ఈ గులాబీ జ్ఞాపకాల్ని తమ మెమరీలో దాచేసుంటారు...

గులాబీలు మనస్సును ఆహ్లాద పరచడమే కాదు, చర్మాన్ని గులాబీల్లా మెరిసేలా చేసే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. రోజ్ మరియు రోజ్ వాటర్ లో స్కిన్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. ఇది యాంటీఇన్ల్ఫమేటరీగా పనిచేసి ముఖంలో ముడుతలను, సూర్యరశ్మి నుండి డ్యామేజ్ అయిన (కమిలిన )చర్మానికి మాయిశ్చరైజర్ గా బాగా సహాయపడుతుంది.

చాలా మంది మహిళలు తమ అందాన్ని రెటింపు చేసుకోవడానికి, ముఖం కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసే ఉంటారు. రోజ్ వాటర్ ఒక్కటి ముఖానికి పట్టించడం వల్ల ముఖం మెరుపు సంతరించుకోవదు. రోజ్ వాటర్ తో పాటు కొన్ని హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ లను అప్లై చేయడం వల్ల ముఖంలో గులాబీ మెరుపులు ప్రకాశిస్తాయి. మరి ఆ హోమ్ మేడ్ రోజ్ ఫేస్ ప్యాక్స్ ఏంటో చూద్దాం...

Homemade Rose Face Packs For Rosy Cheeks

1. నానబెట్టిన గులాబీ రేకులు: తాజా గులాబీ పువ్వుల రేకులను నీటిలో ఒక గంట పాటు నానబెట్టాలి. తర్వాత బయటకు తీసి మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ కు పెరుగు, నిమ్మరసం మరియు తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు పట్టించాలి. అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ఆయిల్ స్కిన్ మరియు డ్రై స్కిన్ రెండింటికి చాలా బాగా సహాయపడుతుంది.

2. రోజ్ మరియు ఓట్స్ ఫేస్ ప్యాక్: తాజా గులాబీ పువ్వుల రేకులను నీటిలో ఒక గంట పాటు నానబెట్టాలి. తర్వాత బయటకు తీసి మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి. అందులోనే ఒట్స్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. లేదా పేస్ట్ చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ముఖ చర్మాన్ని శుభ్రం చేయడానికి, మాయిశ్చరైజింగ్ గా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడానికి ముందు ముఖాన్ని ముంచినీళ్ళ లేదాపాలతో శుభ్రం చేసుకోవాలి. తర్వాత రోజ్ వాటర్ తో ముఖాన్ని తుడవాలి. తర్వాత ప్యాక్ ను ముఖానికి మెడకు వేసి, అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

3. గులాబీ, శెనగపిండి మరియు పెరుగు ఫేస్ ప్యాక్: మరో సింపుల్, ఎఫెక్టివ్ హోమ్ మేడ్ రోజ్ ఫేస్ ప్యాక్ ఇది. గులాబీ రేకులను పేస్ట్ చేసి అందులో శెనగపిండి, పెరుగు వేసి మెత్తగా పేస్ట్ చేసి, కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇది ఎండిన తర్వాత పాలు మరియు చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే ముఖం తాజాగా కాంతివంతంగా నేచురల్ గా మారుతుంది.

4. గులాబీ-సాండిల్ వుడ్ పౌడర్ ఫేస్ ప్యాక్: ముఖంలో మచ్చలు, మొటిమలు, జిడ్డు ఉన్నప్పుడు ఈ హోమ్ మేడ్ రోజ్ ఫేస్ ప్యాక్ బాగా నిచేస్తుంది. గులాబీ రేకులను మెత్తగా పేస్ట్ చేసి అందులో సాండిల్ ఉడ్ పౌడర్ మిక్స్ చేసి, రోజ్, తేనె కూడా కొద్దిగా కలుపుకొని బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పట్టించి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మొటమలు వాటి తాలూకు మచ్చలు మరియు జిడ్డు చర్మాన్ని తొలగించడానికి బాగా సహాయపడుతుంది.

ఈ రోజ్ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ లను ఉపయోగించి, ఈ ప్రేమికుల రోజున మీ బుగ్గుల్లో గులాబీ మెరుపులతో..ప్రకాశవంతంగా మెరిసిపోండి...హాపీ వాలెంటైన్స్ డే.....

English summary

Homemade Rose Face Packs For Rosy Cheeks | గులాబీ పవర్ ఏంటో మీకు తెలుసా...?

Valentine's week has started. It is time to get bundles of roses, dozens of chocolates & loads of love for and from your partner. Today, 7th February is celebrated as rose day. We all love to get roses. The essence and colour of roses can tempt any woman and melt her in seconds. However, there are many women who keep roses as memories in their diaries.
Desktop Bottom Promotion