Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పురుషులకు ప్రత్యేకమైన పింపుల్(మొటిమల)కు ట్రీట్మెంట్
సాధారణంగా మొటిమలు మచ్చలు ఎక్కువగా టీనేజ్ గర్ల్స్ కు, మహిళలకు బాధిస్తుంటాయి. ఈ మొటిమలు చర్మ సమస్య కంటే ఎక్కువగానే కనిపిస్తుంటాయి. టీనేజ్ గర్ల్స్ మహిళలకు మాత్రమే కాదు, పురుషుల్లో కూడా చర్మ సమస్యలతో పాటు మొటిమలు, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. మొటిమలు మరియు మచ్చల నివారణకు పురుషులు కూడా వివిధ రకాల క్రీములు మరియు ఇతర బ్యూటీ ట్రీట్మెంట్ ఉపయోగించి ఉంటారు. అయితే ఇవేవియూ వారికి మంచి ఫలితాలను ఇచ్చుండకపోవచ్చు. కాబట్టి పురుషుల్లో మొటిమలు మరియు మచ్చలు నివారించడానికి ఇక్కడ కొన్ని సమర్థవంతమైన రెమడీస్ లేదా చికిత్స పద్దతులు మీకోసం అందిస్తున్నాం. వీటని సక్రమంగా పాటించినట్లైతే తప్పకుండా మంచి ఫలితాలను పొందవచ్చు. మరి అవేంటో చూద్దాం...
1. క్లెన్సింగ్: మొటిమలు మరియు మచ్చలకు ఆయిల్ స్కిన్ ముఖ్యకారణం. కాబట్టి, మీ ముఖాన్ని తరచూ మంచి క్లెన్సర్ తో ఫేస్ వాష్ చేసుకోడం మంచిది. క్లెన్సింగ్ వల్ల ముఖంలో డెడ్ స్కిన్ తొలగించి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చర్మలో దాగిఉన్న దుమ్ము, ధూళి, కాలుష్యాన్ని తొలగించి, మొటిమలు, మచ్చలు లేకుండా క్లీన్ గా ఉంచుతంది. ఎక్కువగా ఎక్స్ ఫ్లోయిట్ చేయడం వల్ల చర్మం పెలుసు బారడం, లేదా పొడిబారడం వంటివి జరుగుతాయి. కాబట్టి ఎక్స్ఫోయిట్ వారానికి ఒక సారి చేస్తే సరిపోతుంది.
2. షేవింగ్ టెక్నిక్: ఎవరికైతే మొటిమలు సమస్యతో బాధపడుతుంటారో, వారు షేవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. షేవింగ్ కూడా ముఖంలో మచ్చలు ఏర్పడటానికి ఒక కారణం కావచ్చు. కాబట్టి మొటిమలు మచ్చలను పూర్తిగా నివారించాలనుకొన్నప్పుడు, షేవింగ్ కోసం ఎల్లప్పుడూ షార్ప్ గా ఉన్న, కొత్త బ్లేడ్ ను ఉపయోగించాలి. షేవ్ చేసే సమయంలో మొటిమల మీద ఎక్క ఒత్తిడిని కలిగించకూడదు. అలే చేస్తే ముందున్న దానికంటే ఇంకా అసహ్యంగా కనబడుతుంది.

3. ఐస్ క్యూబ్: పురుషులకు మొటిమలు మచ్చలు తొలగించుకోవడానికి ఇది మరొక మంచి హోం రెమెడీ. ఐస్ క్యూబ్స్ ను మొటిమల మీద సున్నితంగా రుద్దాలి. అంతే కాదు ముల్తానీ మట్టి మరియు నిమ్మరసం, సాండిల్ ఉడ్ పౌడర్ మూడింటిని మిక్స్ చేసి ఈ పేస్ట్ ను మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేసి, తడి ఆరిన తర్వాత ఐస్ క్యూబ్స్ తో రుద్దాలి. చల్లగా ఉండే ఐస్ క్యూబ్స్ రుద్దడం వల్ల మొటమలు నివారించబడుతాయి.
4. సాండిల్ వుడ్ పౌడర్: పురుషుల ముఖంలో మొటిమలు మరియు మచ్చలు పోగొట్టడానికి ఇదొక ట్రెడిషినల్ హోం రెమడీ. సాండిల్ వుడ్ పౌడర్ ను రోజ్ వాటర్ తో మిక్స్ చేసి మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. దాంతో మొటిమలు పగలి, పూర్తిగా నివారించబడుతుంది.
5. లెమన్ మసాజ్: లెమన్ నేచురల్ బ్లీచ్ మరియు మొటిమలను నివారించడంలో, మొటిమలు నుండి కార రక్తస్రావాన్ని నివారిణిగా ఉపయోగపడుతుంది. లెమన్ చాలా ప్రభావితమైన బ్యూటీ ప్రొడక్ట్ అని చెప్పవచ్చు. ఇది మొటిమలు మచ్చలు పూర్తిగి నివారిస్తుంది. నిమ్మతొక్కను మొటిమలున్న చర్మ మీదు సున్నితంగా మర్దన చేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేసి చల్లటినీటితో ముఖాన్ని శుభ్రం చేసుకొంటే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications