Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
ఫేషియల్ చేయించుకొన్నతర్వాత చర్మసంరక్షణ చిట్కాలు
సాధారణంగా మహిళలు తరచూ ఫేషియల్ చేసుకుంటుంటారు. ఫేషియల్ అంటే ముఖానికి మసాజ్ చేయడం. దీనివల్ల ముఖంలో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. ఫేషియల్ ను ప్రతి మూడు నెలకొకసారి చేయించుకోవాలి. ఇది చర్మానికి చాలా అవసరం. ముఖ చర్మానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వుండవు. ఫేషియల్ వల్ల వయస్సు పెరగడంవల్ల వచ్చే ముడతలు, లక్షణాలు చర్మానికి ఏర్పడవు. ఇంకా ముఖంలో డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది, చర్మాన్ని, చర్మ రంద్రాలను శుభ్రం చేస్తుంది. స్ర్కబ్బింగా ఉపయోగపడుతుంది. ముఖం ఎప్పుడూ ప్రకాశవంతంగా మెరుస్తుండాలంటే ఫేషియల్ తప్పని సరిగా చేయించుకోవాలి. ఫేషియల్ వల్ల మరో అదనపు ప్రయోజనం ఏంటంటే బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది.
ఫేషియల్ ను కెమికల్స్ బేస్డ్ ఫేషియల్ ను బ్యూటీ పార్లర్ లో కానీ లేదా హోం మేడ్ ఫేషియల్ ను ట్రై చేయవచ్చు. అయితే, ఫేషియల్‌కు ముందు తమ చర్మం ఏ రకానికి చెందినదన్నదీ తెలుసుకోవాలి. జిడ్డు చర్మమున్న వారికి హైడ్రోజన్ మసాజ్ వాటర్ బేస్డ్ మసాజ్ చేయాలి. అటువంటి చర్మానికి ఫ్రూట్ జెల్‌ను వాడతారు. పొడి చర్మానికి సాధారణ చర్మానికి, ఆయిల్ మసాజ్ చక్కగా ఉపయోగపడుతుంది. ఆయిల్ మసాజ్‌కు నువ్వుల నూనె, సోయానూనె, బాదంనూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్ వీట్ అయిల్స్‌ను ఉపయోగించవచ్చు.ఫేషియల్ చేయడానికి ముందుగా చర్మాన్ని శుభ్రపరచుకోవాలి. అందుకు నాణ్యత కలిగిన ఫేస్‌వాష్‌ను కానీ, క్ల్లెన్సింగ్ కానీ ఉపయోగించడం మంచిది. అలాగే ఫేషియల్ చేయించుకొన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫేషియల్ చేయించుకొన్న తర్వాత తీసుకోవల్సిన స్కిన్ కేర్ టిప్స్ ను ఇక్కడ కొన్ని ఇస్తున్నాం. వాటి పరిశీలించి, మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి.

1. సూర్యరశ్మిలో వెళ్ళడాన్ని నివారించాలి: ఫేషియల్ చేయించుకొన్న తర్వాత వెంటనే ఈ చిట్కాను పాటించడం చాలా ముఖ్యం. సూర్య కిరణాల్లోని ఆల్ట్రా వయొలెట్ కిరణాలు చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. మరియు చర్మం మీద కమిలినట్లు మచ్చలను ఏర్పరుస్తాయి.
2. నీళ్ళు ఎక్కువగా తాగాలి: ఫేషియల్ చేయించుకొన్న తర్వాత తప్పక పాటించాల్సిన మరో స్కిన్ కేర్ చిట్కా ఇది . అధికంగా నీళ్ళు తాగడం వల్ల చర్మ ఎల్లప్పుడు హైడ్రేషన్ లో ఉంచుతుంది మరియు చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. ఇది మీరు మర్చిపోకుండా రెగ్యులర్ గా ఫాలోచేయవల్సిన చిట్కా.
3. మేకప్ ను నివారించాలి: అలంకరణకు దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే, వాటి తాలూకు ఘాటైన రసాయనాల ప్రభావం చర్మంపై పడి, కళ తప్పుతుంది. మేకప్ వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోవడం, లేదా చర్మానికి డ్యామేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి, ఫేషియల్ తర్వాత మేకప్ ను అప్లై చేయకండి.
4. సన్ బెడ్: ఫేషియల్ చేయించుకొన్న తర్వాత 28 వరకూ సూర్యరశ్మిలో గడపడాన్ని నివారించాలి. ఉదయం, సాయంత్రపు వేళ సూర్యరశ్మిలో బీచ్ లో పడుకోవడం వల్ల చర్మానికి హాని జరుగుతుంది. సాధారణ నీటితో మీ ముఖంను శుభ్రం చేసుకోవడం వల్ల అదనపు ఆయిల్ మరియు మురికిని ముఖం నుండి తొలగించుకోవచ్చు.
5. ఫేస్ వాష్ ను స్కిప్ చేయాలి: ఫేషియల్ చేయించుకొన్న తర్వాత, 24గంటల సేపు ఎటువంటి ఫేస్ వాష్ ను ముఖానికి వాడకూడదు. ఫేష్ వాష్ క్రీములు, సబ్బుల్లో కెమికల్స్ చర్మానికి హాని కలిగించవచ్చు.
6. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి: చర్మ సంరక్షణలో ఈ చిట్కాను మీ దినచర్యలో అలవాటు చేసుకోవాలి. చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల, చర్మం హైడ్రేషన్ లో ఉంటుంది. చర్మం తేమగా మరియు శుభ్రంగా ఉంటుంది. ఫేషియల్ చేయించుకొన్న తర్వాత 3-4గంటల తర్వాత ముఖంను చల్లటి నీటితో శుభ్రం చేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ మీద ఏర్పడే అదనపు నూనెను, మురికి తొలగిస్తుంది మరియు చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
ఈ చిట్కాలను ఫేషియల్ చేయించుకొన్న తర్వాత తప్పనిసరిగా పాటించాలి. అందమైన, ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని పొందాలంటే అధికంగా నీరు తాగుతూ, చెడు అలవాట్లు (సిగరెట్ మరియు మద్యం)వంటి అలవాట్లను దూరం చేసుకోవాలి. సూర్యరశ్మి నుండి చర్మానికి రక్షణ కల్పించాలి. అందుకోసం చర్మానికి తరచూ సన్ స్క్రీన్ లోషన్ తప్పక అప్లై చేయాలి. చర్మ సంరక్షణలో ఫేషియల్ రెండు లేద మూడు నెలలకొకసారి చేయించుకోవడం చాలా అవసరం.



Click it and Unblock the Notifications