Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
వింటర్లో కూరగాయలు ఉపయోగించి చర్మసంరక్షణ
వింటర్(శీతాకాలంలో మరింత చర్మ సంరక్షణ మరియు పోషణ అవసరం. అందువల్ల, ఇక్కడ మనం కూరగాయలను ఉపయోగించి కొన్ని స్కిన్ కేర్ టిప్స్ చూడవచ్చు. ఇవి చాలా సులభంగా వింటర్లో మనకు అందుబాటులో ఉంటాయి. వింటర్ వెజిటేబుల్స్ బీన్స్, క్యాబేజ్, మొలకలు, లెట్యూస్, ఆకుకూరలు, క్యారెట్, ఉల్లిపా, పచ్చిబఠానీ మరియు ఆస్పరాగస్. ఈ వెజిటేబుల్స్ లో విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ సమృద్ధిగా ఉంటాయి . ఇవి మీ పెరడులో చాలా సులభంగా పెరగగలవు మరియు రెగ్యులర్ గా వాటిని మీరు తినవచ్చు.
ఈ కూరగాయల వల్ల ఆరోగ్యప్రయోజనాలే కాకుండా, ఈ వింటర్ వెజిటేబుల్స్ వల్ల చర్మ సంరక్షణ చిట్కాలు కూడా అనేకం ఉన్నాయి . చర్మ సంరక్షణ కోసం శీతాకాలంలో ఈ కూరగాయలను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. వీటిని తయారుచేయడానికి కూడా చాలా మార్గాలున్నాయి. ఈ వింటర్ వెజిటేబుల్స్ ను పచ్చివే అలాగే తినవచ్చే లేదా ఇతర రూపంలో తయారుచేసి తినవచ్చు. లేదా బాహ్యంగా వీటిని చర్మానికి స్ర్కబ్ లేదా పేస్ట్ లా ఉపయోగించుకోవచ్చు.
శీతాకాలంలో కూరగాయలు ఉపయోగించి చర్మం సంరక్షణ పద్దతులను క్రింది విధంగా ఉన్నాయి. వాటిని క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకోవచ్చు.

1. ఆస్పరాగస్: -
ఆస్పరాగస్ ఒక వింటర్ ప్లాంట్ ఇది, ఆకులు, కాండం మరియు రూట్ ను వైదపరంగా వియోగించబడుతున్నాయి. . ఆస్పరాగస్ లో అనేక చర్మం మరియు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి . వీటిలో ప్రక్షాళ గుణాలు కలిగి ఉన్నాయి . అందువల్ల దీన్ని నేరుగా మీ చర్మానికి అప్లై చేస్తుంటారు. వింటర్ లో మీ చర్మం పొడిబారి ప్యాచ్ లలాగా కనబడుతుంటే, ఆ డ్రై ప్యాచ్ లను తొలగించడానికి ఆప్పరాగస్ ను ఉపయగించవచ్చు. అలాగే, మొటిమల సమస్య కూడా ఆస్పరాగస్ ఉపయోగించవచ్చు. కానీ, ఇది ఉపయోగించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి . ఇది ఇరిటేషన్ కు కారణం కావచ్చు మరియు మీ చర్మ తత్వానికి సూట్ కాకపోవచ్చు. అందువల్ల, ముందు కొద్దిగా మీ చర్మం మీద రుద్ది, ఏదైనా ఇరిటేషన్ లేదా దద్దుర్లు(రాషెస్) ఉన్నాయేమో గమనించాలి.

2. క్యారెట్ -
క్యారెట్లు చాలా ఆరోగ్యం . అవి కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు వీటిలో అవసరమైయ్యే విటమిన్లు అధికం. అదేవిధంగా, క్యారెట్స్ చర్మానికి ఉపయోగకరం మరియు ప్రయోజనకరం. క్యారెట్ లోని విటమిన్ ఎ సూర్యుని నుండి వెలువడే కఠినమైన యూవీ కిరణాల నుండి రక్షణ కల్పిస్తుంది . అదేవిధంగా , చిన్న వయస్సులోని పెద్దవారిలా కనబడం, వృద్ధాప్యం , చర్మం రంగును మోటిమలు మరియు చెదురుమదురుగా చర్మాన్ని నిరోధిస్తుంది . క్యారెట్లను ఫేస్ ప్యాక్ గా ఉపయోగించవచ్చు . అలాగే, క్యారెట్ జ్యూస్ ను త్రాగడం వల్ల లేదా క్యారెట్లు తినడం వల్ల చర్మానికి ఈ స్కిన్ కేర్ వెజిటేబుల్ తీసుకోవడం చాలా మంచి పద్దతి.

3.మొలకలు -
ఈ ఫిట్ నెస్ ఫుడ్ మీకు ఎక్కువ ఎనర్జీని అంధిస్తుంది మరియు ఇది చర్మానికి చాలా ఉపయోగకరం. బరువు తగ్గడం కోసం మరియు చర్మ సంరక్షణకు మరియు శరీరం ఫిట్ గా ఉంచుకోవడం కోసం అనేక ఆహార నిపుణులు మొలకలు తీసుకోమని సిఫారస్ చేస్తున్నారు. మొలకలు తీసుకోవడం వల్ల ముఖం శుభ్రం చేస్తుంది మరియుదుమ్ముధూళిని తొలగిస్తుంది మరియు జిడ్డును కూడా తొలగిస్తుంది. మొలకల ఫలితంగా చర్మంలో తయారైన మోటిమలు నివారించటానికి మొలకలు బాగా సహాయపడుతాయి. మొలకలు ముఖంలో వృద్ధాప్యం చిహ్నాలైన ముడుతలు, ఫేషియల్ లైన్స్ మరియు డార్క్ సర్కిల్స్ ను నిరోధించడానికి సహాయపడుతుంది. అందువలన, చర్మ సంరక్షణ కోసం వింటర్ వెజిటేబుల్స్ తో పాటు, మొలకలను కూడా మీ డైట్ లో తీసుకోండి.

4. లెట్యూస్:
లెట్యూస్ ను మనం ‘సలాడ్ పట్టా' అనవచ్చు . ఎందుకంటే వీటిని ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తుంటారు .ఇంకా సాడ్విచ్ మరియు బర్గర్సో లో ఉపయోగిస్తుంటారు . ఈగ్రీన్ లీఫీ వింటర్ వెజిటేబుల్ తో అనేక స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి . లెట్యుస్ లో విటమిన్ ఎ అధికంగా ఉంది, అందువల్ల , చర్మాన్ని మాయిశ్చరైజింగ్, తాజాగా ఉంచుతుంది. అలాగే ఇందులో పొటాషియం కంటెంట్ కూడా పుష్కలం. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది. .లెట్యూస్ ను క్రమంగా తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలన్నింటిని తొలగిస్తుంది. దాంతో మన శరీరం మరియు చర్మం ఆరోగ్యంగా మారుతుంది.

5.గ్రీన్ లీఫ్స్:
" పొపాయ్ - సెయిలర్ మాన్ " యొక్క ఇష్టమైన ఆహారం. ఇది మనకు ఒక సూపర్ మెన్ సమానమైన శక్తిని అంధిస్తుంది . ఈ ఎనర్జీతో పాటు, బూస్టింగ్ బెనిఫిట్స్, మరియు చర్మానికి మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన చర్మం మరియు ప్రకాశించే చర్మానికి ఆకుకూరలు అనేక విటమిన్లు మరియు మినిరల్స్ తో నిండి ఉంది. ఇంకా ఆకుకూరలు మొటిమలకు మరియు డ్యామేజ్ స్కిన్ బాగు చేయడానికి మరియు సూర్యకిరణాల నుండి చర్మానికి రక్షణ కల్పించడానికి సహాయపడుతుంది. అందుకే చర్మ సంరక్షణకు ఆకుకూరలను ఉపయోగించడం ఒక మంచి పద్దతి.
ఇంకా అనేక వింటర్ వెజిటేబుల్స్ ను ఇంతకు ముందేమీకు పరిచయం చేశాం. ప్రతి వెజిటేబుల్లోనూ చర్మానికి అవసరం అయ్యే ఒకటి లేదా చాలా ఇతర బెనిఫిట్స్ ఉన్నాయి . అందువల్ల ఈ వింటర్ వెజిటేబుల్స్ ను ఉపయోగించి ఆరోగ్యంగా జీవించండి.



Click it and Unblock the Notifications