Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
లోషన్ కన్నా బెటర్ గా పనిచేసే 10 సన్ స్క్రీన్ ఆయిల్
మన భారతీయుల చర్మ ఛాయలో చాలా రంగులున్నాయి. ఒక వేళ, ఉష్ణమండల దేశంలో నివసించేవారైనా సరే అందంగా..ఫెయిర్ గా ఉండాలనుకుంటారు. అందువల్లే, మన ఇండియలో సన్ స్క్రీన్ లోషన్ మరియు ఫెయిర్ నెస్ క్రీములు బిజినేస్ బాగా జరుగుతుంది. భారత దేశంలో చాలా ప్రాంతాల్లో ఏడాది పొడవునా ప్రకాశవంతమైన సూర్యకాంతి(ఎండలు)ఎక్కువగా ఉంటాయి . కాబట్టి ఉష్ణమండల ప్రాతంలో ఎక్కువ ఉష్ణోగ్రత మరియు వేడి వల్ల మన చర్మం చాలా త్వరగా టానింగ్ (ఎండ తీవ్రతకు నల్లబడుతుంది)కు గురి అవ్వడం సహజం.
ఎండ తీవ్రతతో చర్మం ఇలా నల్లబారడాన్ని టానింగ్ అంటారు. ఇది చాలా సహజమైన ప్రక్రియ. సూర్యకాంతిలో ఉండే అల్ట్రావయొలెట్ కిరణాల వల్ల చర్మం నల్లబారడం సహజంగా జరిగేదే. ఎండలో తిరగడం వల్ల నల్లబారడాన్ని తగ్గించడం కోసం... సాధారణంగా సన్‌స్క్రీన్‌లు వాడుతుంటారు. సన్ స్క్రీన్ లోషన్ తో పాటు నేచురల్ సన్ స్క్రీన్ ఆయిల్స్ కూడా దొరుకుతాయి. కృత్రిమ సన్ స్క్రీన్ క్రీమ్ లతో పోల్చితే, నేచురల్ సన్ స్క్రీన్ నూనెలు సూర్య రశ్మి నుండి రక్షణ కల్పించడంలో చాల ప్రభావంతంగా రక్షణ కల్పించడానికి సహాయపడుతాయి. ఎండ తీవ్రతతో చర్మ నల్లబడకుండా చర్మాన్ని కాపాడేందుకు ఈ నూనెలో SPF కాపాడుతుంది. SPFప్రధానంగా ‘సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్'. కొన్ని నూనెలు సహజంగా SPF లేదా సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ను కలిగి ఉంటాయి.
ఈ నేచురల్ సన్ స్క్రీన్ ఆయిల్స్ వల్ల మీరు ఆశ్చర్యానికి లోనవుతారా. ఉదాహరణకు, మీకు సాధారణంగా ఉపయోగించే కొబ్బరి నూనెలో SPFఉందని మీకేమైనా ఐడియా ఉందా? కొబ్బరి నూనెలో మనకు తెలియకుండానే SPF ఉంది. ఈ నూనెతో పూర్తి బాడీ మసాజ్ ను చేయడం వల్ల మన చర్మాన్ని నల్లబరచకుండా రక్షణ కల్పిస్తుంది. చాలా వరకూ ఈ నేచురల్ సన్ స్క్రీన్ ఆయిల్స్ వల్ల చర్మానికి ితర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
సన్ డ్యామేజ్ నుండి మీ చర్మానికి రక్షణ కల్పించడానికి 10 నేచురల్ ఆయిల్స్ ఉన్నాయి. వాటిని పరిశీలించి మీ చర్మాన్ని సన్ టాన్ నుండి రక్షించుకోండి..

క్యారెట్ సీడ్ ఆయిల్: SPF40:
క్యారెట్ సీడ్ ఆయిల్ వెజిటేబుల్ ఆయిల్. SPF ఎక్కువగా ఉండే ఆయిల్ ఇది. అంతే కాదు, ఇందులో యాంటీయాక్సిడెంట్స్ మరియు యాంటీసెప్టిక్ లక్షణాలు కలిగి ఉన్నాయి.

రాస్బెరీ సీడ్ ఆయిల్: రాస్బెరీ సీడ్ ఆయిల్ ఓమేగా 3 మరియు ఓమేగా 6 ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉన్నటువంటి ముఖ్యమైన ఆయిల్. ఇది సన్ ప్రొటక్షన్ కలిగించడంతో పాటు, చర్మం మీద ఏర్పడ్డ చారలను(స్ట్రెచ్ మార్క్స్ ను)నిరోధిస్తుంది.

వీట్ జర్మ్ ఆయిల్: SPF 20: SPF కలిగిన బెస్ట్ నేచురల్ ఆయిల్స్ లో వీట్ జర్మ్ ఆయిల్ మూడవది. ఇది చర్మానికి విటమిన్ ఇ'ని అంధిస్తుంది. నేచురల్ యాంటీఆక్సిడెంట్స్ తో సెల్ డ్యామేజ్ ను అరికడుతుంది.

అవొకాడో ఆయిల్: SPF 15: మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉండేది అవొకాడో ఆయిల్లోనే. ఈ ఫ్యాట్స్ చర్మం పైపొర సన్ టాన్ కి గురికాకుండా రక్షణ కల్పిస్తుంది.

సోయాబీన్ ఆయిల్: SPF 10
సాధారణంగా సోయాబీన్ ఆయిల్ ను చైనా వంటకాల్లో ఉపయోగిస్తారు. అయితే చర్మానికి ఉపయోగించేటప్పుడు ఇది మాయిశ్చరైజర్ గా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే సన్ ప్రొటక్షన్ కలిగిస్తుంది.

కొబ్బరి నూనె: SPF8
వివిధ రకాలుగా ఉపయోగపడే నూనెల్లో కొబ్బరి నూనె ఒకటి. దీన్ని వంటలకు ఉపయోగించవచ్చు. మీ చర్మానికి మరియు కేశాలకు అప్లై చేయవచ్చు. కొబ్బరి నూనె చర్మం మరియు కేశఆలకు సన్ డ్యామేజ్ కలగకుండా సన్ ప్రొటక్షన్ కల్పిస్తుంది.

ఆలివ్ ఆయిల్: SPF 8
గుండె ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైన నూనె ఆలివ్ ఆయిల్. చర్మ విషయంలో కూడా కొంత వరకూ సన్ ప్రొటక్షన్ కలిగిస్తుంది మరియు వయస్సు మీద పడనియ్యకుండా చేసేందుకు ఉపయోగపడే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

మకాడమియా నట్ ఆయిల్: SPF 6
మకాడమియా కాయలు ఆస్ట్రేలియా ఖండం నుండి వచ్చినటువంటివి దాని నుండి నూనెను తయారు చేస్తారు. ఈ నూనెలో ఫాస్ఫరస్, పొటాషియం మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఇంకా సినామిక్ యాసిడ్ అనే సమ్మేళం కూడా కలిగి ఉంటుంది. ఇది SPF సరఫరాను ఎక్కువగా కలిగిస్తుంది.

బాదం ఆయిల్: SPF 5
బాదం ఆయిల్లో SPFపుష్కలంగా ఉంది, కాని ఇది చర్మానికి తగినంత పోషణ అంధిస్తుంది. బాదం ఆయిల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉండి, ఇది చర్మాన్ని చాలా మృదువుగా మరియు supple ఉంచుతుంది.

జోజోబ ఆయిల్ SPF 4
జోజోభ ఆయిల్లో చర్మానికి సంబంధించి చాలా ఔషధ గుణాలున్నాయి. ఇది పొడి చర్మానికి చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మైరిస్ట్రిక్ యాసిడ్ సన్ ప్రొటక్షన్ కలిగించడం చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications