For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కమిలిన చర్మం తిరిగి మేని ఛాయపొందాలంటే సులభ చిట్కాలు

|

ప్రతీ స్త్రీ తన చర్మం నిగనిగలాడుతూ ఉండాలని కోరుకుంటుంది.అయితే కాలుష్యం,ఎండ మొదలైన వాటి బారిన పడి చర్మం కమిలిపోవడం,తెల్లని మచ్చలు రావడం,గరుకుగా తయారవడం, వంటివి జరగవచ్చు.

చర్మం కమిలిపోవడం (సన్ బర్న్): తీవ్రమైన ఎండలో పనిచేసేవారు ముఖ్యంగా ఈ సమస్యకు లోనవుతుంటారు. తరచుగా సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్ అవ్వడంతో చర్మం సున్నితత్వాన్ని కోల్పోతుంది. చర్మం పై పొర దెబ్బతిని చర్మంపై వాపు, నొప్పివస్తాయి. చర్మం పొరలుపొరలుగా చీలిపోయి పెద్ద పుండులా ఏర్పడే అవకాశం ఉంది. దీనికి సరైన చికిత్స తీసుకోవడం తప్పనిసరి.

వేసవిలో ఎండతాకిడి వల్ల చర్మం కమిలిపోవడం, నల్లబడటం ఎక్కువైపోతుంటుంది. స్వేదరంధ్రాలు దెబ్బతింటాయి. దీంతో చర్మం మరింత నల్లగా మారుతుంది. అందుకని బయటకు వెళ్లేముందు సన్‌ప్రొటెక్షన్ క్రీమ్ (ఎస్.పి.ఎఫ్) రాసుకోవాలి. పెరుగు, పుచ్చకాయగుజ్జులతో ఫేస్‌ప్యాక్‌లు వేసుకుంటే చల్లగానూ ఉంటుంది. చర్మం నిగారింపు పెరుగుతుంది. ఇలాంటి దుష్ప్రాబావాల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

కమిలిన చర్మం వదించుకోవడానికి 15 పరిష్కారాలు..!

యోగర్ట్(పెరుగు): చర్మ నల్లగా ప్రభావితం అయిన ప్రాంతంలో పెరుగును అప్లై చేయాలి. పది నిముషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కమిలిన చర్మం వదించుకోవడానికి 15 పరిష్కారాలు..!

దోసకాయ: కమినిన చర్మానికి కీర దోసకాయ బాగా పనిచేస్తుంది. కీరదోసకాయను స్లైస్ గా కట్ చేసి లేద పేస్ట్ చేసి ఎండవేడికి ప్రభావితం అయిన ప్రాంతంలో అప్లై చేయాలి. కీరదోస ముఖం మీద ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కమిలిన చర్మం వదించుకోవడానికి 15 పరిష్కారాలు..!

టొమాటో: టమోటో స్లైస్ లేదా టమోటో గుజ్జు ను సన్ బర్న్ కు చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఎండ వేడికి కమిలిన చర్మ మీద అప్లై చేసుకోవాలి. టమోటో లోని విత్తనాలతో సహా అప్లై చేయాలి. ఇది ముఖం మీద ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కమిలిన చర్మం వదించుకోవడానికి 15 పరిష్కారాలు..!

బొప్పాయి: బొప్పాయిని స్లైస్ గా కట్ చేసి, ఫ్రిజ్ లోపల పెట్టాలి. చల్లబడిన తర్వాత సన్ బర్న్ కు ప్రభావితం అయితే ప్రదేశంలో అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సన్ బర్న్ ఒక్కటి మాత్రమే తొలగిపోవడం కాదు, మొటిమలు, మచ్చలకు విరుద్దంగా పోరాడటానికి సహాయపడుతాయి.

కమిలిన చర్మం వదించుకోవడానికి 15 పరిష్కారాలు..!

శెనగపిండి: శెనగపిండికి పసుపు మరియు పాలు మీగడ ఒక చెంచా చేర్చి బాగా పేస్ట్ లా తయారు చేయాలి. ఎండవేడికి ప్రభావితం అయిన ప్రాంతంలో అప్లై చేయాలి. ఈ మిశ్రం బాగా ఎండిన తర్వాత కొద్దిగా నీళ్ళు చిలకరించి స్ర్కబ్ చేసిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కమిలిన చర్మం వదించుకోవడానికి 15 పరిష్కారాలు..!

తేనె: తేనెలో కొద్దిగా నిమ్మరసం (80:20) నిష్పత్తిలో నిమ్మ రసంతో తేనె కలపాలి. తర్వాత సన్ బర్న్ కు ఎండవేడికి ప్రభావితం అయిన ప్రాంతంలో అప్లై చేయాలి. ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కమిలిన చర్మం వదించుకోవడానికి 15 పరిష్కారాలు..!

కోకా బట్టర్(కోకా వెన్న): కోకా బట్టర్ ను తక్కువ పరిమాణంలో తీసుకొని ఎండకు ప్రభావితం అయిన ప్రాంతంలో నేరుగా రాసుకోవాలి.

కమిలిన చర్మం వదించుకోవడానికి 15 పరిష్కారాలు..!

కలబంద(అలోవెర): శరీరంలో సన్ బర్న్ గురిఅయిన ప్రదేశంలో అలోవెర జెల్ ను అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల ఇది సన్ బర్న్ ఒక్కటి మాత్రమే తొలగించడం కాదు, సన్ బర్న్ వల్ల కలిగే నొప్పి, దురద వంటి లక్షణాలను తొలగించడానికి సహాయపడుతుంది.

కమిలిన చర్మం వదించుకోవడానికి 15 పరిష్కారాలు..!

గుడ్డు తెల్లసొన: సన్ బర్న్ కు గురియైన చర్మం మీద నేరుగా గుడ్డులోని తెల్ల సొనను అప్లై చేయాలి. తర్వాత బాగా పొడిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కమిలిన చర్మం వదించుకోవడానికి 15 పరిష్కారాలు..!

ఆవాలు: వడదెబ్బ సన్ బర్న్ కు ఆవాలు మంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆవాలను పొడి చేసి సన్ బర్న్ కు ప్రభావితం అయిన ప్రదేశంలో ఆ పిండిని కొద్దిగా నీళ్ళు లేదా పాలు కలిపి అప్లై చేసి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కమిలిన చర్మం వదించుకోవడానికి 15 పరిష్కారాలు..!

స్ట్రాబెర్రీ: స్ట్రాబెరీలను బాగా మెత్తగా చిదిమి గుజ్జులా తయారు చేసుకొని, సన్ బర్న్ కు ప్రభావితం అయిన ప్రాంతంలో అప్లై చేయాలి. ఇది ముఖం మీద ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కమిలిన చర్మం వదించుకోవడానికి 15 పరిష్కారాలు..!

ఓట్ మీల్: ఓట్ మీల్స్ ను గుడ్డులోని తెల్ల సొనతో మిక్స్ చేసి చర్మం కమిలిన ప్రదేశంలో అప్లై చేసి, పొడి బారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కమిలిన చర్మం వదించుకోవడానికి 15 పరిష్కారాలు..!

పాలు: సన్ బర్న్ కు గురియైన ప్రదేశంలో పాలలో ముంచిన టవల్ ను కప్పి ఉంచడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు.

కమిలిన చర్మం వదించుకోవడానికి 15 పరిష్కారాలు..!

వెనిగర్: వెనిగర్ లో చిన్న తువ్వాళ్లు ను ముంచి లేదా నానబెట్టి సన్ బర్న్ గురియైన ప్రదేశంలో అప్లైచేయడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది.

కమిలిన చర్మం వదించుకోవడానికి 15 పరిష్కారాలు..!

పాలు మరియు తేనె: పాలు మరియ తేనె (50:50) నిష్పత్తిలో తీసుకొని బాగా మిక్స్ చేసి సన్ బర్న కు ఎఫెక్ట్ అయిన ప్రాంతంలో అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు.

English summary

Top 15 Home Remedies For Sunburn | కమిలిన చర్మం వదించుకోవడానికి 15 పరిష్కారాలు..!

Got a sunburn again? Tired of using those same chemicals that harm your skin? Then you must opt for some home remedies for sunburn. Here are some of the best natural ways to get rid of sunburn.
Desktop Bottom Promotion