For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శీతాకాలంలో మీ చర్మాన్ని రక్షించే విటమిన్ ఇ ఆహారాలు

|

వింటర్ సీజన్ లో, చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. చర్మాన్ని కాపాడగలిగే వాటిలో ‘విటమిన్ ఇ'కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకు మీరు వింటర్ సీజన్ లో అధికంగా విటమిన్ ఇ ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. మరియు విటమిన్ ఇ ఆహారాలున్న వాటితో ముఖం మరియు మెడకు ప్యాక్ లా వేసుకోవడం వల్ల చర్మ పగుళ్ల నుండి రక్షణ పొందవచ్చు. ఈ వింటర్ సీజన్ లో, మీ చర్మం అధికంగా పగుళ్ళకు గురి అవ్వడాన్ని మీరు గమనించే ఉంటారు. మన సామర్థ్యాన్ని బట్టి, వింటర్ సీజన్ లో మన చర్మానికి అవసరం అయ్యే జాగ్రత్తలన్నింటినీ తీసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వింటర్ లో పొడి చర్మంకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, పొడివారిన చర్మం చుట్టూ చర్మ ఛాయ(చర్మంరంగు) మారుతుంది.

వింటర్ సీజన్ లో చర్మ సంరక్షణ కోసం విటమిన్ ఇ ఆహారాలు నేరుగు అలాగే చర్మానికి అప్లై చేవచ్చు లేదా వాటిని పేస్ట్ రూపంలో కూడా వాడుకోవచ్చు. ఈ విటమిన్ ఇ ' రిచ్ ఫుడ్స్ ను వింటర్లో చర్మానికి అప్లై చేయడం వల్ల వీటిలో ఉండే కొన్ని ప్రత్యేకమైన నూనెలు, పొడిబారిన చర్మాన్ని, వింటర్లో ఏర్పడే దద్దుర్లను మరియు ఇతర చర్మం సమస్యలను కూడా చాలా సులభంగా నయం చేయడానికి సహాయపడుతుంది.

వింటర్ సీజన్ లో మీరు మీ చర్మ సంరక్షణ కోసం ఉపయోగించాల్సిన కొన్ని విటమిన్ ఇ ఆహారాలను బోల్డ్ స్కై ఒక పట్టికను తయారుచేయబడింది . ఈ ఆహార పదార్థాలను మీరు పగలు చర్మానికి అప్లై చేయవచ్చు లేదా రాత్రి సమయంలో నిద్రించే ముందుగా చర్మానికి అప్లై చేసి, మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవచ్చు. ఈ ‘విటమిన్ ఇ'ఆహారాలను మీరు చర్మానికి అప్లై చేసేముందు మీరు ముఖ్యంగా గుర్తించుకోవల్సిన విషయం, మేకప్ లేకుండా జాగ్రత్తపడాలి.

వింటర్లో మీ చర్మాన్ని రక్షించే కొన్ని విటమిన్ ఇ ఆహారాలు మీకోసం..

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

వింటర్ సీజన్ లో చర్మ సంరక్షణకు ఉపయోగించే ఒక ఉత్తమ విటమిన్ ఇ ఆహారం ఆలివ్ ఆయిల్ . ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకొని ముఖం, మెడ మీద సర్కులర్ మోషన్లో మర్ధన చేయాలి . ఒక గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి . ఇలా వారానికి ఒక సారి చేయాలి.

గుమ్మడి:

గుమ్మడి:

వింటర్ లో చర్మ సంరక్షణకు మరో విటమిన్ ఇ రిచ్ ఫుడ్ గుమ్మడిని ఉపయోగించవచ్చు. ఇది మొటిమలు, మచ్చలను తొలగించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. గుమ్మడి గుజ్జును తీసుకొని, ప్రతి రోజూ రాత్రి పడుకొనే ముందు ముఖానికి అప్లై చేయాలి.

అవొకాడో:

అవొకాడో:

వింటర్ లో అవొకాడో చాలా అద్భుతంగా ట్రీట్ చేస్తుంది. పచ్చి అవొకాడో గుజ్జును ముఖం మరియు మెడకు అలాగే అప్లై చేయవచ్చు. ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి .

ఆకు కూరలు :

ఆకు కూరలు :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ విటమిన్ సి, మరియు ఫైబర్ మరియు అధిక శాతంలో క్యాల్షియం ఉంటుంది. విటమిన్ ఇ అధికంగా ఉండటం వల్ల దీన్ని చర్మానికి కూడా ఉపయోగించవచ్చు. కొన్ని ఆకులను మెత్తగా రుబ్బి, ముఖానికి అప్లై చేయాలి. ముడుతలున్న ప్రదేశంలో అధికంగా అప్లై చేయాలి. తర్వాత మసాజ్ చేసి, ఆలివ్ ఆయిల్ రాసి, తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బాదం:

బాదం:

బాదం ‘విటమిన్ ఇ' చాలా ఫేమస్. ప్రతి యొక్క బాదాం గింజ నుండి 70-80mg కాల్షియం లభిస్తుంది. వింటర్లో చర్మానికి ఇది అద్భుత ఫలితాలను అంధిస్తుంది. బాదం చర్మ ఛాయను మెరుగుపరచడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.

బెర్రీస్:

బెర్రీస్:

మిక్స్డ్ బెర్రీస్ వింటర్ సీజన్ లో చాలా అద్బుతంగా సహాయపడుతాయి. పొడి చర్మానికి ఈ విటమిన్ ఇ రిచ్ ఫుడ్ అద్భుతంగా సహాయపడుతుంది. ఈ మిక్స్డ్ బెర్రీస్ ను ప్రతి రోజూ ఉదయం మీ ముఖానికి అప్లై చేసి, తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఆప్రికాట్:

ఆప్రికాట్:

బెస్ట్ విటమిన్ ఇ రిచ్ ఫుడ్ ఇది . వింటర్ సీజన్ లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆప్రికాట్స్ ను ఉపయోగించి ముఖానికి మర్ధన చేయాలి . ఇది పొడి చర్మాన్ని నివారిస్తుంది.

టమోటో:

టమోటో:

సన్ టాన్ నివారించడానికి ఇది ఒక అద్భుతమైన ఆహారం. చలికాలంలో సూర్య కిరణాలు చాలా కఠినంగా ఉంటాయి. దాంతో చర్మం నల్లబడటం జరుగుతుంది. ఇది నివారించాలంటే టమోటో గుజ్జును ముఖం, మెడ, కు అప్లై చేసి తర్వాత శుబ్రం చేసుకోవాలి.

బట్టర్:

బట్టర్:

బట్టర్ లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. మీ చర్మాన్ని చాలా తేమగా మరియు ప్రకాశవంతంగా మార్చుతుంది. ఒక స్పూన్ బటర్ ను మీ ముఖానికి అప్లై చేయడం వల్ల, అద్భుత మార్పను మీరు గమనించవచ్చు. దీన్ని వారంలో రెండు మూడు రోజులు అప్లై చేయాలి.

వీట్ :

వీట్ :

గోధుమపిండి లో కూడా విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది . ఇది వింటర్ సీజన్ లో చర్మ సంరక్షణకు చాలా మేలు చేస్తుంది . ఒక టేబుల్ స్పూన్ గోధుమపిండిలో నీరుమిక్స్ చేసి ముఖానికి ఫేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

 హెర్బ్స్ :

హెర్బ్స్ :

కొన్ని ప్రత్యేకమైన హెర్బ్స్ మీ చర్మానికి అవసరం అయ్యే ‘విటమిన్ ఇ'ను కలిగి ఉంటుంది. నెట్టెల్స్ వింటర్ రాషెస్ ను నివారించడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

బొప్పాయి:

బొప్పాయి:

బొప్పాయిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది . ఇది వింటర్ సీజన్ లో చాలా చర్మం సంరక్షణకు చాలా మంచిది. మెత్తగా గ్రైండ్ చేసి మీ ముఖానికి అప్లై చేయాలి. తర్వాత సర్కులర్ మోషన్ లో మర్దన చేసిన 10నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

పీనట్స్:

పీనట్స్:

రోస్ట్ చేసిన పీనట్స్ ను మెత్తగా పౌడర్ చేసి, అందులో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి, మర్ధన చేయాలి . తడి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. వింటర్ లో పగిలిన చర్మానికి చాలా మంచిది.

నట్మెగ్:

నట్మెగ్:

మీ పొడి చర్మానికి ఇది ఎలా ఉపయోగపడుతుందని ఆశ్చర్యపడుతున్నారు . నట్ మగ్ ను మెత్తగా పొడి చేసి అందులో కొద్దిగా పాలు మిక్స్ చేసి తర్వాత ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Vitamin E Rich Foods For Skin In Winter

During the winter season, skin care is ideally important. Vitamin E is one of the main ingredients which should be consistent in certain foods which you need to apply on your face and neck region in order to get rid of the chapped skin.
Desktop Bottom Promotion