Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శీతాలంలో చర్మానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు
శీతాకాలం వచ్చిందంటే చాలు చర్మం చాలా సమస్యలకు గురవుతుంది. చర్మ సంబంధ సమస్యలు బాధిస్తాయి. చలికాలంలో తేమ తగ్గిపోవడంతో చర్మం జీవం కోల్పోతుంది. చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. చర్మం ఆకర్షణ కోల్పోవడంతో దురద సమస్యలు మొదలవుతాయి. చర్మం నిర్జీవంగా మారడం పెరిగితే చర్మంపై ముడతలు వస్తాయి. ఇలాంటి సమయంలోనే చర్మాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు చర్మంపై తీవ్రప్రభావం చూపుతాయి. ఈకాలంలో ఎండలో బయటకు వెళ్లే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
* ఎస్‌పిఎఫ్ 15 నుంచి 30శాతం వరకున్న లోషన్‌ను వాడడం ఎంతో మేలు. ఎండలో బయటకు వెళ్లే ముందు లోషన్‌ను శరీరానికి పట్టించాలి. దీంతో ఎండబారి నుండి ఉపశమనం లభిస్తుంది. చలికాలంలో సీటీయం, క్లీన్సింగ్, టోనింగ్‌తో కూడిన మాయిశ్చరైజర్‌ను రోజూ రాసుకునే అలవాటు చేసుకోవాలి. క్లీన్సింగ్ దుమ్ము, చెమట దుర్వాసనలను దూరం చేస్తుంది. టోనర్ చర్మం పీహెచ్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. మాయిశ్చరైజర్ నిర్జీవమైన చర్మానికి కొత్త జీవం తెస్తుంది. వీటితో పాటుగా బాదం నూనెతో మసాజ్ చేసుకోవాలి. ఇందులో లావెండర్, రోజ్‌ఆయిల్ విటమిన్ ఆయిల్స్ అన్నింటినీ నాలుగుచుక్కలుగా కలిపి పెట్టుకోవాలి.

* స్నానం చేసిన తర్వాత వింటర్‌కేర్, బాడీ లోషన్ ఏదైనా శరీరంపై రాసుకోవాలి. ముఖంపై కోల్డ్‌క్రీమ్ లేదా ఆయిల్‌తో కూడిన క్రీమును రాసుకోవాలి. విటమిన్‌లతో కూడిన క్రీమ్‌ను వాడుకోవచ్చు. అది చర్మాన్ని సంరక్షిస్తుంది.
* ఇక చలికాలంలో వేధించే మరో సమస్య పాదాల పగుళ్లు, చేతులు పొడిబారడం, పాదాలకు నాణ్యమైన ఫుట్‌క్రీమ్‌ను వాడాలి. నెలకోసారి బ్యూటీపార్లర్‌కు వెళ్లి పెడిక్యూర్ చేయించుకోవడం తప్పనిసరి. పెడిక్యూర్‌తో కాలిగోళ్ల మృతకణాలు తొలగించుకోవచ్చు. పాదాలు మృదువుగా మారతాయి. పేరాఫిన్‌వ్యాక్స్‌తో ఇంట్లో కూడా మడమలకు చికిత్స చేసుకోవచ్చు. హాట్‌వ్యాక్స్‌ను మడమలపై అప్లయి చేసి 10, 15 నిమిషాల తర్వాత క్లింగ్ ఫిల్మ్‌తో తీసేయాలి. దీంతో మడమలు సాఫ్ట్‌గా మారతాయి.
* గ్లిజరిన్‌ను నిమ్మరసం, రోజ్‌వాటర్‌లో కలిసి ఉంచాలి. ఈ మిశ్రమాన్ని వారంలో రెండుసార్లు ముఖానికి రాసుకోవాలి. దీంతో ముఖం తేజోవంతమవుతుంది. ఇక పెదవుల సంరక్షణకు, పగుళ్ల నుంచి కాపాడుకోవడానికి లిప్‌బామ్ రాసుకోవాలి. గులాబీరేకలను పేస్ట్ చేసుకుని పెదాలకు రాసుకోవచ్చు. ఇలా చేస్తే పెదవులు నలుపుదనం తగ్గుతుంది. అందరూ వాడే మెహందీని చలికాలంలో వాడకపోవడమే మంచిది. మెహందీ జుట్టును నిర్జీవంగా మార్చివేస్తుంది. అత్యవసరమనుకుంటే మెహందీలో పెరుగు కలిపి తలకు పట్టించాలి. జుట్టుకు కండీషనర్ వాడాలి. హెయిర్ స్పా చేయించుకోవాలి.
* శీతాకాలంలో మేకప్ వేసుకునేటప్పుడు ముందు ముఖాన్ని కడుక్కుని ఆ తర్వాత మాయిశ్చరైజర్ అప్లయి చేసి 15నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత క్రీం బేస్డ్ ఫౌండేషన్ రాసుకోవాలి. పాన్‌కేకునే నీళ్లలో కలిపి ముఖంపై వేసుకుంటే మేకప్‌లో క్రాక్స్ రాకుండా ఉంటాయి.



Click it and Unblock the Notifications