For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్లాక్ హెడ్స్ ను నివారించే వండర్ ఫుల్ హోం రెమెడీస్

|

బ్లాక్ హెడ్స్ అంటే ఏమిటి?బ్లాక్ హెడ్స్ అతి చిన్నవిగా కనిపిస్తూ ముఖం మీద ఇబ్బంది కలిగించే సెబమ్ నుండి విడుదలయ్యేటటువంటి అతి చిన్న బ్లాక్డ్ ఫోలిసెల్స్. చర్మమీద ఏర్పడే సెబమ్ కాలుష్యం మరియు గాలిలోని ఆక్సిడేషన్ వల్ల అవి నల్లగా మారుతాయి. అవే బ్లాక్ హెడ్స్ గా రూపాంతరం చెందుతాయి. ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ముక్కు మీద, ముక్కుకు ఇరువైపులా అతి సూక్మంగా మొటిమల రూపంలో ఏర్పడి నల్లగా మారుతాయి.

ముఖాన్ని అందవిహీనంగా మార్చేవాటిలో బ్లాక్‌హెడ్స్ ప్రధానమైనవి. సెబాషియస్ అనే గ్రంథి నూనె పదార్థాన్ని(సెబమ్) అధికంగా విడుదల చేయడం వల్ల ఇవి ఏర్పడతాయి. చర్మానికి రంగునిచ్చే పిగ్మెంట్ ఎక్కువైనా ఈ సమస్య వస్తుంది. వెంటనే తగిన చికిత్స తీసుకుంటే వీటిని నివారించుకోవడమే కాకుండా అందాన్ని కాపాడుకోవచ్చు.

బ్లాక్ హెడ్స్ కు వివిధ రకాల కారణాలు :
* చర్మంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి వీలుగా సెబాషియస్ గ్రంథి నూనె పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఈ నూనె ఉత్పత్తి ఎక్కువైనప్పడు దానికి చర్మంలోని మలిన పదార్థాలు కూడా తోడయ్యి బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌గా ఏర్పడతాయి.
* చర్మంలో బ్లాక్‌హెడ్స్ ఏర్పడడానికి దుమ్ముకూడా ఒక కారణం. చర్మంలో పేరుకున్న దుమ్ము కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనికి నూనెకూడా జత కావడంతో బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి. .
* బ్లాక్‌హెడ్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ గిల్లకూడదు. దీనివల్ల పరిస్థితి మరింత విషమిస్తుంది. గిల్లడం వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా చర్మంలోపలికి చొచ్చుకుపోయి మరింత హాని చేస్తుంది.

అలా జరకుండా ఉండాలంటే కొన్ని హోం రెమెడీస్ చాలా సింపుల్ గా మరియు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ హోం రెమెడీసి సాధ్యం అయినంత వరకూ మనకు ఇంట్లోనే అందుబాటులో ఉంటాయి. మరి అవేంటో, వాటిని ఏవిధంగా ఉపయోగించాలో చూద్దాం...

బంగాళదుంప:

బంగాళదుంప:

బంగాళదుంప తురుము లేదా పేస్ట్ మొటిమల నివారణకు మాత్రమే కాదు, ఇది ముక్కుమీద ఏర్పడ్డ బ్లాక్ హెడ్స్ ను నివారించడంలో కూడా గొప్పగా సహాయపడుతుంది. బంగాళదుంపను ముక్కలుగా కట్ చేసి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో మర్దన చేయాలి. తర్వాత రఫ్ టవల్ తో తుడవాలి.

తేనె:

తేనె:

బ్లాక్ హెడ్స్ ను తొలగించడానికి తేనె సహాయపడుతుంది. కొద్దిగా తేనె తీసుకొని సన్నని మంట మీద వేడి చేయాలి. ఈ గోరువెచ్చని తేనెకు కొద్దిగా పంచదార జోడించి మిక్స్ చేసి ముక్కు మీద బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 15నిముషాల తర్వాత శుభ్రంగా తుడిచి తర్వాత మంచి నీటితో కడుక్కోవాలి.

దాల్చిన చెక్క మరియు తేనె:

దాల్చిన చెక్క మరియు తేనె:

బ్లాక్ హెడ్స్ నివారించడంలో ఈ రెండింటి కాంబినేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. చర్మాన్ని స్వచ్చంగా మార్చుతుంది.

టమోటో గుజ్జు:

టమోటో గుజ్జు:

తాజా టమోటోను పేస్ట్ చేసి అది ముఖానికి మాస్క్ లా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ దూరం అవుతాయి. అంతే కాదు, ఆయిల్ స్కిన్ కూడా నివారిస్తుంది.

కార్న్ స్టార్చ్:

కార్న్ స్టార్చ్:

కార్న్ స్టార్చ్ కు కొద్దిగా నీరు మిక్స్ చేసి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. 25నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ఇది చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది.

ముఖానికి ఆవిరి పట్టడం:

ముఖానికి ఆవిరి పట్టడం:

ముఖంలో బ్లాక్ హెడ్స్ నివారించడానికి నేచురల్ హోం రెమెడీస్ లావెండర్, నిమ్మతొక్క మరియు పుదీన వంటి హెర్బ్ ను ఉపయోగించవచ్చు. ఈ వస్తువులు మీ చర్మాన్ని రిఫ్రెష్ చేస్తాయి మరియు బ్లాక్ హెడ్స్ ను నివారిస్తాయి.

పాలు:

పాలు:

స్వచ్చమైన పాలతోటి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత ఒక శుభ్రమైన క్లాత్ ను పాలలో డిప్ చేసి, ఆ క్లాత్ తో ముఖం శుభ్రంగా తుడవాలి.

కలబంద:

కలబంద:

బ్లాక్ హెడ్స్ కు ఒక బెస్ట్ హోం రెమెడీ అలోవెర. ఆలోవెర తీసుకొని ముక్కు మీద 15 నిముషాలు మర్దన చేయాలి. అలోవెరాతో మర్దన చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

పుదీనా పేస్ట్ :

పుదీనా పేస్ట్ :

బ్లాక్ హెడ్స్ ను నివారించడంలో టూత్ పేస్ట్ సహాయపడుతుంది. మీరు నిద్రించడానికి ముందు పుదీనా పేస్ట్ ను అప్లై చేసి, తడి ఆరిన తర్వాత పైనుండి క్రిందికి తొలగించాలి.

స్వీట్ స్ర్కబ్ :

స్వీట్ స్ర్కబ్ :

ఎక్స్ ఫ్లోయేట్ చేయడం వల్ల చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. కాబట్టి ఇటువంటి నాస్టీ బ్లాక్ హెడ్స్ ను తొలగించడానికి పంచదార గ్రేట్ గా సహాయపడుతుంది. పంచదారతో ముఖం మీద మర్దన చేయాలి.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మకాయ నేచురల్ బ్లీచ్. ఇది క్లీనింగ్ లా పనిచేస్తుంది. కాబట్టి మీరు నేచురల్ బ్లీచ్ కోసం నిమ్మకాయను ఉపయోగించవచ్చు . లేదా నిమ్మ తొక్కతో బ్లాక్ హెడ్స్ ఉన్న చోటో స్ర్కబ్ చేయడం వల్ల కూడా తొలగించుకోవచ్చు. బ్లాక్ హెడ్స్ ఉన్నచోట నిమ్మరసంతో పాటు తేనె, పంచదార లేదా గుడ్డు వంటివి కూడా మిక్స్ చేసి స్ర్కబ్ చేయవచ్చు.

ఎగ్ వైట్:

ఎగ్ వైట్:

గుడ్డు: బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో గుడ్డు కూడా ఒక మంచి పదార్థం. గుడ్డులోని తెల్ల సొనకు తేనె లేదా నిమ్మరసం కలిపి ఈ ప్యాక్ ను బ్లాక్ హెడ్స్ ఉన్న చోటో అప్లై చేసి ఇరవైనిముషాల తర్వాత స్ర్కబ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

శెనగపిండి:

శెనగపిండి:

శెనగిపిండికి పాలు మరియు నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి . ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ బ్లాక్ హెడ్స్ ను నేచురల్ గా తొలగిస్తుంది.

పెరుగు:

పెరుగు:

ఒక చెంచా పెరుగులో ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

ఈ వంటగది వస్తువును చర్మ మరియు కేశ సంరక్షణలో సాధారణంగా ఉపయోగిస్తుంటారు. బేకింగ్ సోడాను చేత్తో తీసుకొని ముక్క మీద అలా మసాజ్ చేయడం వల్ల కూడా బ్లాక్ మెడ్స్ తొలగిపోతాయి.

పసుపు మరియు పుదీనా జ్యూస్:

పసుపు మరియు పుదీనా జ్యూస్:

ఒక చెంచా పసుపుకు, కొద్దిగా పుదీనా రసం మిక్స్ చేసి బాగా పేస్ట్ లా చేసుకొని బ్లాక్ హెడ్స్ ఉన్నప్రదేశంలో మరియు ముఖం మొత్తం అప్లై చేయాలి. తడి ఆరిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి.

స్ట్రాబెర్రీ లీవ్స్:

స్ట్రాబెర్రీ లీవ్స్:

బ్లాక్ హెడ్స్ ను నివారించడంలో స్ట్రాబెర్రీ గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ స్ట్రాబెర్రీ ఆకులో ఉండే ఆల్కలినిటి చర్మరంధ్రాల వాపును తగ్గించి చర్మాన్ని శుబ్రం చేస్తుంది.

తాజా మెంతి ఆకులు:

తాజా మెంతి ఆకులు:

ఒక గుప్పెడు మెంతి ఆకులను తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి మరియు ముక్కు మీద అప్లై చేయాలి. తడి ఆరిన తర్వాత పాలతో శుభ్రం చేసుకోవాలి.

ఓట్ మీల్:

ఓట్ మీల్:

చర్మాన్ని శుభ్రపరుచుటల ఓట్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఓట్స్ ను మిక్సీలో వేసి మిక్స్ చేసి ఆ పొడితో ముక్కు మీద రుద్దడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

బ్లాక్ బీన్ పేస్ట్ :

బ్లాక్ బీన్ పేస్ట్ :

చాలా మందికి ఈ విషయం తెలియదు. కానీ, బ్లాక్ బీన్స్ ను మెత్తగా పేస్ట్ చేసి, దీన్ని ముక్కు మీద అప్లై చేస్తే, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

English summary

20 Homely Ways To Get Rid Of Blackheads

Do you resent looking at your face in the mirror cause of those nasty blackheads? If, yes, then we have some ways you can try out to get rid of the blackheads on your nose. These home remedies are simple and not that difficult. The best part of it all is they are available in your kitchen. All you need is time to go ahead with the procedure.
Story first published: Monday, December 8, 2014, 13:29 [IST]
Desktop Bottom Promotion