Latest Updates
-
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.!
చర్మం కాంతివంతంగా మార్చుకోవడానికి కొన్ని బ్యూటీ టిప్స్
అందంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. ఇంకా అనారోగ్య సమస్యలుంటే కూడా అందాన్ని కోల్పోతారు. మన శరీరంలో వాతం, పిత్తం, కఫం అనే మూడు దోషాలుంటాయి. ఈ మూడు సమానంగా ఉంటేనే ఆరోగ్య సమస్యలు ఉండవు. ఇంకా అందంగా కనిపిస్తారు. అందుచేత పోషకాహార లోపంతోనూ అంద విహీనంగా ఉంటారని.. న్యూట్రీషన్లు అంటున్నారు.

అయినా కొన్ని బ్యూటీ టిప్స్ ద్వారా చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు. అవేంటంటే...?
1. బొప్పాయి గుజ్జు ఒక టేబుల్ స్పూన్, తేనె ఒక స్పూన్, నిమ్మరసం రెండు స్పూన్లు కలిపి పేస్ట్‌లా తయారయ్యాక ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతం అవుతుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది.

2. అలాగే కొత్తిమీర, పుదీనా ఆకులను సమానంగా తీసుకుని బాగా పేస్ట్‌లా చేసుకుని నిమ్మరసం చేర్చి ముఖానికి పట్టిస్తే.. జిడ్డు తొలగిపోతుంది. మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది.

3. ఇక బాదం, ఓట్స్ సరిపాళ్ళలో తీసుకుని బాగా పేస్ట్ చేసి ముఖానికి పట్టిస్తే..ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అయితే మొటిమలు, సెన్సెటివ్ చర్మం కలిగినవారు ఈ మిశ్రమాన్ని ఉపయోగించకూడదు.

4. పాల మీగడ లేదా పెరుగుతో తేనె కలిపి కంటికి మర్దన చేసుకుంటే.. కంటి కిందటి వలయాలకు చెక్ పెడతాయి. జుట్టు నెరసిన వారు అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్ తీసుకుంటూ వుండాలి. బాదం ఆయిల్ ఉపయోగించడం మంచిది. డ్రై హెయిర్ కలిగిన వారు హెన్నాతో పాటు ఆమ్లా, మందార ఆకుల్నికలిపిన హెన్నా రాసుకోవడం ఉత్తమం.

5. ప్రతిరోజూ చేయాల్సింది ఏమిటంటే?
* ప్రతిరోజూ 3 లీటర్ల నీరు తాగాలి. అప్పుడే శరీరంలోని మలినాలు వెలివేయబడతాయి.
* రోజూ తీసుకునే డైట్‌లో కేరట్ ఉండాలి. ఇవి మొటిమలను దూరం చేయడంతో పాటు కేశాలను సంరక్షిస్తాయి.

* ఆమ్లాను రోజూ తీసుకోవడం ద్వారా శరీర వేడి తగ్గుతుంది. జుట్టు నెరసిపోవడానికి చెక్ పెడుతుంది.
* రోజూ 3-4 బాదం పప్పులు తీసుకోవడం ద్వారా చర్మం కాంతివంతంగా తయారు కావడంతో పాటు జుట్టు నెరసిపోకుండా చేస్తుంది.



Click it and Unblock the Notifications