Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చలికాలంలో అందాన్ని రెట్టింపుచేసే 5హోం మేడ్ ఫేస్ మాస్క్
అందంగా ఉండాలని ఆశపడని అమ్మాయిలు ఎవరుంటారు చెప్పండి? అందుకే మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సంరక్షణకు, సౌందర్య పోషణకు సంబంధించి రకరకాల జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. అయితే, మిగతా కాలాలతో పోలిస్తే చలికాలంలో చర్మ సంబంధిత సమస్యలు కాస్త ఎక్కువగానే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకే ఈ కాలంలో అదనపు సంరక్షణ చర్యలు కూడా తీసుకోవాలి. ఈ క్రమంలో చలికాలంలో అందాన్ని ఇనుమడింపచేసే ఫేస్ ప్యాక్స్ గురించి మీకోసం...
ఇంట్లో ఉండే సహజసిద్దమైన పదార్థాలను ఉపయోగించి శీతాకాలంలో సౌందర్యాన్ని సులభంగా సంరక్షించుకోవచ్చు...

1. అవకాడోతో: ఒక అవొకాడో కట్ చేసుకొని లోపల ఉండే గుజ్జుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఫోర్క్ సాయంతో దాన్ని మెత్తగా చేసి అందులో ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. సుగంధభరితమైన ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. 10-15నిముషాలు ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రపరచుకోవాలిజ ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మానికి పోషణ అందడమే కాకుండా సున్నితంగా కూడా తయారవుతుంది. అలాగే చలికాలంలో ఎదురయ్యే ‘పొడి చర్మ' అనే సమస్య కూడా సులువుగా చెక్ పెట్టవచ్చు.
2. తేనె రోజ్ వాటర్: తేనె, రోజ్ వాటర్ ని సమపాళ్లలో తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 10 నిముషాలు ఆరనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. తేనె చర్మానికి సహజసిద్దమైన మాయిశ్చరైజర్ గా పని చేసి తేమని అందిస్తే రోజ్ వాటర్ చర్మానికి మంచి టోనర్ గా ఉపయోగపడుతుంది. అలాగే శీతాకాలంలో వీచే చలిగాలుల వల్ల చర్మం పొడిబారకుండా కూడా సంరక్షిస్తుంది.
3. ఎగ్ వైట్: కోడి గుడ్డులోని తెల్లసొనను తీసుకుని దాన్ని బాగా గిలకొట్టి, ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంట పాటు ఆరనిచ్చి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ వల్ల చర్మం తాజాదనాన్ని సంతరించుకోవడమే కాకుండా ఆరోగ్యవంతంగా కూడా కనిపిస్తుంది. అలాగే చలిగాలుల నుంచి చర్మాన్ని కూడా చక్కగా సంరక్షిస్తుంది.
4. బంగాళదుంప, పెరుగుతో : ఒక బంగాళదుంపను ఉడికించుకుని ముక్కలుగా కోసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ముక్కల్ని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. అలా సిద్దం చేసుకున్న బంగాళదుంప గుజ్జు ఒక చెంచా తీసుకుని దానికి అరచెంచా పెరుగుతో జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
5. ఓట్స్: ఓట్స్, గుడ్డులోని పచ్చసొన, తేనె సమపాళ్లలో తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిసాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం సున్నితంగా మారడంతో పాటు, చాలా తాజాగా అనిపిస్తుంది.
ఇవండి చలిగాలుల నుంచి మీ చర్మాన్ని రక్షించి అందాన్ని ఇనుమడింపచేసే కొన్ని ప్యాక్స్. మీరు కూడా వీటిని ప్రయత్నించి చూడండి. మీ అందాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవచ్చు..



Click it and Unblock the Notifications