For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిగారింపైన చర్మం కోసం బొప్పాయితో ఫేషియల్ ఇలా

|

కళ్లు చెదిరే అందం సొంతం కావాలని ఏ అమ్మాయి కోరుకోదు చెప్పండి? అందుకేగా తరచూ పార్లర్స్ కు వెళ్లి ఫేషియల్స్ అవీ చేయించుకునేది అంటారా! నిజమే కానీ అవేవీ అవసరం లేకుండా బొప్పాయితో ఇంట్లోనే స్వయంగా మిమ్మల్ని మీరే అందంగా మెరిసిపోయేలా చేసుకోవచ్చంటే నమ్ముతారా? అదెలా అనేగా మీ సందేహం... అదెలాగో తెలుసుకుందాం రండి...

బొప్పాయి జ్యూస్: వండర్ ఫుల్ బెనిఫిట్స్ :క్లిక్ చేయండి

ఆహా...!అనిపించే అందం సొంతం కావాలంటే పార్లర్ కి పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ఇంట్లో లభించే పదార్థాలు లేదా పండ్లను ఉపయోగించి కూడా అందంగా మెరిసిపోవచ్చు. అందుకు చక్కటి ఉదాహరణే బొప్పాయితో చేసుకొనే ఫేషియల్.బొప్పాయిలో విటమిన్ ఎ మరియు పెపైన్ అనే ప్రోటీనులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తాయి. మొటిమలను నివారించి చర్మంలో నిగారింపు తీసుకొస్తాయి. బొప్పాయి ఫేస్ ప్యాక్ వల్ల వృద్దాప్య లక్షణాలు తొలగిపోతాయి. చర్మంకు కావల్సినంత తేమను అందిస్తాయి. ఇన్ని ప్రయోజనాలున్న బొప్పాయితో ఫేషియల్ చేసుకుంటే చర్మంకు మరింత నిగారింపును సొంతం చేసుకోవచ్చు.

దీనికి కావల్సినవి: బాగా మగ్గిన (పండిన)బొప్పాయి పండు.

తయారుచేయు విధానం: సహజంగా బాగా పండిన బొప్పాయిని ఎంపిక చేసుకోవాలి. అంటే ప్రత్యేకంగా మిక్సీలో వేసి మెత్తగా చేయాల్సిన అవసరం లేకుండా పట్టుకుంటే మెత్తని ముద్దలా అయిపోయేంతగా మగ్గాలి. అలాంటి బొప్పాయిని తీసుకుని తొక్క తీసేసి, మెత్తని ముద్దలా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఫేసియల్ చేసుకునే విధానం:

1. మనం గిన్నెలో తీసుకున్న మెత్తని గుజ్జుతో గుండ్రంగా మర్దన చేస్తూ ముఖమంతా రాసుకోవాలి. ఇలా దాదాపు 20 నుండి 30నిముషాల వరకూ సున్నితంగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

2. బొప్పాయి గుజ్జులో పచ్చిపాలను వేసి బాగా మిక్స్ చేసి ముకాని పట్టించాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తెల్లగా మారుతుంది.

3. బొప్పాయి గుజ్జులో గుడ్డు తెల్లసొన వేసి ఫేస్ మాస్క్ లా వేసుకొని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే, చర్మం బిగుతుగా తయారవుతుంది. ఫిట్ గా కనిపిస్తుంది.

4. బొప్పాయి గుజ్జులో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి ప్యాల్ లా వేసుకొని, 15నిముషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మానికి మంచి నిగారింపు వస్తుంది.

5. బొప్పాయి గుజ్జులో ఓట్ మీల్ పౌడర్ వేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత రుద్ది కడగితే, స్క్రబ్బింగాల పనిచేస్తుంది, డెడ్స్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.

6. బొప్పాయి గుజ్జులో నిమ్మరసం లేదా ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి 15-20నిముషాల తర్వాత కడిగితే చర్మానికి మంచి నిగారింపు వస్తుంది.

ఫలితం: ఇలా చేయడం వల్ల గోల్డెన్ ఫేషియల్ చేసుకున్నంత ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ముఖం మీద ఉండే ట్యాన్ కూడా తగ్గుముఖం పడుతుంది. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయడం వల్ల చక్కటి ప్రకాశవంతమైన చర్మం మన సొంతమవుతుంది.

 Beauty benefits of Papaya

జాగ్రత్తలుం ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న బొప్పాయి పండ్లలో చాలా వరకూ కృత్రిమంగా పండినవే ఎక్కువ ఉంటున్నాయి. ఫేషియల్ కోసం ఎంచుకొనే బొప్పాయి సహజంగా పండినదై ఉండాలి. సహజసిద్దంగా పండినదైతే బొప్పాయిపై తొక్క కాస్త ఎరుపు రంగుకు దగ్గరగా ఉంటుంది. అలా కాకుండా ఆరెంజ్ కలర్ లో ఉంటే అది కృత్రిమంగా పండిందని అర్ధం. ఇలా కృత్రిమంగా పండిన పండుతో ఫేషియల్ చేసుకుంటే పైన తొక్క తీసేసి లోపల ఎర్రగా ఉండే గుజ్జుతో మసాజ్ చేసుకోవాలి.

బొప్పాయితో ఇంట్లోనే సులువుగా ఎలా ఫేషియల్ చేసుకోవచ్చు తెలుసుకున్నారుగా...ఈ సారి మీరు కూడా దీన్ని ప్రయత్నించి చూడండి..చక్కటి ఫలితం పొందుతారు.

Desktop Bottom Promotion