Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ముఖంలో ముడతల పోగొట్టే 8 సులభ మార్గాలు
శరీరంలో ఎక్కడ ముడతలు కనిపించినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు కానీ, ముఖం మీద ముడుతలు ఏర్పడితే మాత్రం మానసికంగా ఆందోళన పడిపోతారు. ఇందులో ఆడవారు, మగవారు అనే తేడా లేదు. ఇంచుమించు ఈ విషయంలో ఇద్దరి భావాలు ఒకే విధంగా ఉంటాయి. ముఖం మీద ముడుతలు కనిపిస్తే వయసు మళ్ళిందని బెంగపడిపోతారు.
టివిలో, పేపర్ లో వచ్చే ప్రకటలను చూసి వందల రూపాయలు ఖర్చుచేస్తున్నారే తప్ప వాటివల్ల ఎంతవరకు ప్రయోజనం కలుగుతుందనేది మాత్రం ప్రశ్నగానే మిగిలి పోతోంది. అందుకే కృత్రిమంగా తయారు చేసే క్రీములపై ఆధారపడడం కంటే సహజసిద్ధంగా తయారయ్యే పండ్లు, నట్స్ తో కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు. మనం నిత్యం ఉపయోగించే పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. కేవలం శరీరానికి శక్తి నివ్వడమే కాక చర్మానికి మంచి కాంతి తేవడంలో ఇవి ఎంతగానో దోహదపడుతాయి.
డ్రై స్కిన్, విపరీతమైన ఒత్తిడి... విటమిన్ల లోపం... నిద్రలేమి... అధిక పొట్ట... వివిధ కారణాల వల్ల చిన్న వయసులోనే చర్మంపై ముడతలు వస్తాయి. ఇవి ముఖ వర్ఛస్సును పోగొట్టడమే కాదు... వయసుపైబడిన వారిలా కనిపించేలా చేస్తాయి. మరి ముఖంపై ముడతలను నివారించాలంటే ఏం చేయాలో చూద్దాం..

బొప్పాయి:
తాజా బొప్పాయి పండు గుజ్జును తీసుకుని ఐదు నిమిషాల పాటు ముఖానికి అప్లై చేయండి. అలా పదిహేను నిమిషాల పాటు ఉంచి తరువాత చల్లని నీటితో కడిగేయండి. మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయిని తినడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది.

ఆరెంజ్:
నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్ గా ఉంచే కొలాజిన్ ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది.

క్యారెట్ :
క్యారెట్ జ్యూస్ లో పాలు కలపండి. దీనికి బాదం పలుకుల పొడిని జత చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మృదువుగా మర్దనా చేయండి.

ఎగ్ :
కోడిగుడ్డులోని తెల్లసొనలో నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని కళ్లకు అంటకుండా ముఖానికి అప్లై చేయాలి. పది నుంచి పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయండి. దీని వల్ల చర్మం గట్టి పడి... ముడతలు మాయమవుతాయి.

బీట్ రూట్ :
బీట్ రూట్ రసం రెగ్యులర్ గా పరిగడుపున తీసుకోవడం వల్ల కూడా యవ్వనంగా కనిపించవచ్చు.

అరటి పండు
అరటి పండు గుజ్జును ముఖానికి అప్లై చేసి అది పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

క్యాబేజ్ రసం:
ముడతలు ఎక్కువగా ఉంటే కొంచెం క్యాబేజీ జ్యూస్ తీసుకుని దానికి టీ స్పూన్ తేనె జత చేసి ముఖానికి అప్లై చేయండి.

బాదం ఆయిల్ :
ప్రతి రోజూ బాదం నూనెతో ముఖానికి మర్దనా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications
