Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
ప్రకాశవంతమైన-మెరిసే చర్మం కొరకు బాతింగ్ టిప్స్
మీ చర్మం డ్రైగా మరియు డల్ గా కనబడుతోందా? మీ శరీరంలో మీద మొటిమలు మరియు మచ్చలు ఏర్పడుతున్నాయా?అయితే మీరు సరైన పద్దతిలో స్నానం చేయడం లేదు. కొన్ని సమయాల్లో చాలా సింపుల్ బాతింగ్ టిప్స్(స్నానం చేయడానికి చిట్కాలు)మీ చర్మం యొక్క క్వాలిటీని పెంచడానికి చాలా గొప్పగా సహాయపడుతాయి. డ్రై స్కిన్ ఉన్న వారు సరైన పద్దతిలో స్నానం చేయడం ఒక ఉత్తమమైన పద్దతి. అందుకే మీరు ప్రకాశించే చర్మం పొందడానికి సరైన బాతింగ్(స్నానం)టిప్స్ ఎంపిక చేసుకోవడం మంచిది.
ప్రతి ఒక్కరూ కాంతివంతమైన ప్రకాశించే మరియు ఆరోగ్యకరమైన చర్మం సౌందర్యం ఉండాలని కోరుకుంటారు. ఆరోగ్యకరమైన చర్మం పొందడానికి కొన్ని ఆవశ్యకతలున్నాయి. మీరు సరైన ఆహారంను తీసుకోవాలి మరియు రెగ్యులర్ గా స్నానం చేయాలి. ఎవరైనా మీకు స్నానం చేసే పద్దతులను చెప్పినప్పుడు మీకు తమాషాగానే అనిపించవచ్చు, కానీ అన్ని సమయాల్లో, మనం మన అందం గురించి ప్రాధమిక అంశాలు తప్పుగానే ఆచరిస్తుంటాం. అందమైన చర్మఛాయను పొందడానికి రెగ్యులర్ గా స్నానం చేయడం అనేది ఒక ప్రాధమిక అంశం. అందుకు మీరు కరెక్టైన పద్దతిని ఎంపిక చేసుకోవాలి.
అటువంటి చర్మఅందాన్ని పొందాలని మీరు కూడా కోరుకుంటున్నట్లైతే ఇక్కడ కొన్ని స్నానం చేసే పద్దతులను దశలు వారిగ వివరించడం జరిగింది. మీ బిజీ షెడ్యూల్లో ఈ చిట్కాలను అనుసరించడం కొంచెం కష్టమైనప్పటికీ ఇవి చాలా ఎఫెక్టివ్ గా ఫలితాన్నిస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకూ ఈ స్టెప్స్ ను గుర్తుంచుకోవడం చాలా అవసరం.

స్నానానికి ముందు శరీరానికి ఆయిల్ మర్ధన చేసుకోవాలి
మీ చర్మం కాంతివంతంగా కనబడకుండా పొడిగా ఉంటే, కొన్ని నూనెలతో ఈ సమస్యను నివారించుకోవచ్చు. కాబట్టి, ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను మీరు స్నానం చేయడానికి ముందు మీరు అప్లై చేయాలి . ఇది ప్రతి రోజూ సాధ్యం కాకపోతే, వారానికొకసారి చేయవచ్చు.

స్నానానికి గోరువెచ్చని నీరు ఉపయోగించాలి
వేడినీళ్ళ స్నానం చర్మానికి ఎప్పుడూ ఆరోగ్యకరం. వేడినీళ్ళు మరీ వేడిగా లేకుండా, గోరువెచ్చని నీరు స్నానం చేస్తే చర్మానికి చాలా మంచిది. వేడినీటితో స్నానం చర్మరంధ్రాలను మరియు మురికిని తొలగించడానికి సమర్ధవంతంగా పనిచేస్తుంది.

ప్రతి రోజూ సోపును ఉపయోగించేకూడదు
చర్మానికి ప్రతి రోజూ సోపును ఉపయోగించడం వల్ల అది మీ చర్మాన్ని మరింత డ్రైగా మార్చుతుంది. కాబట్టి, వ్యక్తిగత పరిశుభ్రత కోసం, సోపును పర్సనల్ హైజీన్ మరియు చంకల్లో సోపును ఉపయోగించి శుభ్రం చేసుకోవచ్చు. కానీ కాళ్ళు, చేతులు, మరియు ముఖానికి సోపును ఉపయోగించడం మానుకోండి.

వారానికొక సారి ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోవాలి
మీ ముఖంలాగే శరీరం మీద కూడా డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి. అందుకే మీరు ఎక్స్ ఫ్లోయేట్ స్ర్కబ్బర్ ను ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. అది మీకు ఒక నేచురల్ గ్లోను అంధిస్తుంది.

వారానికి ఒకసారి బ్యాక్(వీపు)ను స్ర్కబ్ చేసుకోవాలి
చాలా వరకూ మనందరు బ్యాక్ శుభ్రం చేసుకోవడానికి బద్దకస్తులుగా ఉంటారు. శరీరం అందంలో బ్యాక్ కూడా ఇక అందమైన పార్ట్ కాబట్టి, వారానికొకసారి వీపును స్ర్కబ్బర్ తో రుద్ది, శుభ్రం చేసుకోవాలి.

ఎక్కువ సమయం స్నానం చేయకూడదు
ఎక్కువ సమయం స్నానం చేయడం వల్ల ఇది నేచురల్ బాడీ ఆయిల్స్ ను గ్రహించి, చర్మంను డ్రైగా మార్చుతుంది . కాబట్టి, అరగంటకు మించి స్నానం చేయకూడదు. 10-15నిముషాల్లో స్నానం ముగించాలి .

నేచురల్ సోపులను ఉపయోగించాలి
ఆర్టిఫిషియల్ సోపుల్లో కెమికల్స్ ఉంటాయి, అవి మీ చర్మంను డ్రైగా మార్చుతాయి. కాబట్టి, మీ స్నానానికి నేచురల్ పదార్థాలు శెనగపిండి మరియు మిల్క్ క్రీమ్ వంటివి ఉపయోగించాలి .

టవల్ తో సున్నితంగా రుద్దుకోవాలి. కానీ గట్టిగా రుద్దుకోవాలి
స్నానం చేసిన తర్వాత చాలా మంది తమ శరీరాన్ని టవల్ తో ఎక్కువ ప్రెజర్ తో తేమను తుడుస్తుంటారు. అలా చేయకూడదు. మీ చర్మం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. కాబట్టి, గట్టిగా రుద్దకండి.

స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి
స్నానం చేసిన తర్వాత చర్మ యొక్క రంద్రాలు తెరుచుకుంటాయి. అందువల్ల మాయిశ్చరైజర్ చాలా తేలికగా చర్మంలోనికి చొచ్చుకుంటుంది. కాబట్టి, స్నానం చేసిన వెంటనే లోషన్ లేదా క్రీమ్ ను అప్లై చేసుకోవాలి.

ప్రతి రోజూ స్నానం చేయాలి
ప్రతి రోజూ స్నానం చేయడాన్ని మర్చిపోకూడదు. రెగ్యులర్ గా స్నానం చేయడం వల్ల చర్మం మీద మురికి తొలగిపోతుంది. మరియు నేచురల్ గ్లోను అంధిస్తుంది.



Click it and Unblock the Notifications