For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముల్తానీ మట్టి యొక్క బ్యూటీ బెనిఫిట్స్

By Mallikarjuna
|

ముల్తాని మట్టి లేదా ఫుల్లర్స్ ఎర్త్ నేచురల్ గా లభించేటటువంటివి వీటిని మనం ‘బిటోనైట్' అని పిలుస్తాము. చర్మానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చర్మంలోని మలినాలను తొలగించడంలో ముల్తానిమట్టి అద్భుతంగా సహాయపడుతుంది. ఈ ముల్తానీ మట్టిని మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న బ్యూటీ వస్తువు కాదు, ఎందుకంటే ఈ వస్తువును రోమన్ కాలం నుండి ఒక అద్భుతమైన బ్యూటీ ప్రొడక్ట్ గా ఒక మంచి క్లీనింగ్ ఏజెంట్ గా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ముల్తానీ మట్టి బాగా పాపులర్ అయింది. బ్యూటీపార్లర్ లోనే కాదు, ఇంట్లో కూడా ఉపయోగించే ఈ బ్యూటీ ప్రొడక్ట్ చర్మంలో మలినాలనుతొలగించడానికి మాత్రమే కాదు, ఇతర చర్మ సమస్యలు, మొటిమలు, మచ్చలు, ముఖంగా ప్యాచ్ లను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

సాధారణంగా మట్టిని రకరకాల సౌందర్య చికిత్సల్లో వాడటం కొందరికి మాత్రమే తెలుసు. ముల్తానీ మట్టి అనేది కొత్తదేమీ కాదు. పాత సౌందర్యసాధనమే. సహజమైన ఫేస్‌ ప్యాక్‌ కావటం వల్ల ముల్తానీ మట్టి చేసే గమ్మత్తులు చాలా వున్నాయి. దీనివల్ల చర్మం నునుపు తేలి, మృదువుగా మారుతుంది. చర్మంపై మచ్చల్లాంటివి తగ్గి.. మంచి రంగు రావాలంటే.. ఈ క్లేలకు అదనంగా మరికొన్ని పదార్థాలు (పెరుగు, క్రీమ్, నిమ్మరసం, రోజ్ వాటర్)కలిపి చికిత్స తీసుకోవాలి. దీనివల్ల, చర్మం యొక్క రంగు మెరుగుపడుతుంది. జిడ్డు సమస్య అదుపులో ఉంటుంది. ముడతలు మాయమవుతాయి. ఇది చాలా చౌకనటువంటి బ్యూటీ ప్రొడక్ట్స్ . అందుకే ఎక్కువ మంది దీన్ని ఉపయోగిస్తుంటారు. ముల్తానీ మట్టి యొక్క ఇతర బ్యూటీ ప్రయోజనాలేంటో ఒక సారి చూద్దాం...

Beauty Benefits Of Multani Mitti

1. క్లెన్సర్: ఫులర్స్ ఎర్త్ (ముల్తానీ మట్టిలో) అధికంగా మెగ్నీషియం క్లోరైడ్ ఉంటుంది . మెగ్నీషియం క్లోరైడ్ లో మొటిమలను నివారించే సామర్థ్యం కలిగి ఉంటుంది. అంతే కాదు, మెగ్నీషియం క్లోరైడ్ లో చర్మం రంధ్రాల్లోని మొత్తం బ్యాక్టీరియాను, దుమ్ము, ధూళిని తొలగించి మంచి క్లెన్సర్ గా సహాయపడుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, మరియు రియాక్షన్స్ లేకుండా అన్ని రకాల చర్మ తత్వాలను శుభ్రం చేయడంలో, శుద్దిచేయడంలో అనేక ప్రయోజనాలను కలిగి ఉంది.

2. ఆయిల్ స్కిన్ లేదా జిడ్డు చర్మం: చెంచా ముల్తానీమట్టి, పావుచెంచా నిమ్మరసం, అరచెంచా తేనె, పావుచెంచా పుదీనా పొడి చొప్పున తీసుకుని అన్నింటినీ బాగా కలిపి ముఖానికి రాసుకుంటే చర్మంలో ఎంతో మార్పు ఉంటుంది. చైనా క్లే ఒకటిన్నర చెంచా, గ్రీన్‌ టీ డికాక్షన్‌ చెంచా, కమలాఫలం తొక్కల పొడి, తేనె అరచెంచా చొప్పున తీసుకుని వీటన్నింటినీ రోజ్‌వాటర్‌తో మిశ్రమంలా చేసుకుని ముఖానికి పట్టించాలి. పది, పదిహేను నిమిషాలయ్యాక కడిగేయాలి. చర్మం మరీ జిడ్డుగా ఉంటే.. ఐదు రోజులకోసారి వేసుకోవచ్చు. జిడ్డు తక్కువగా ఉంటే.. నెలకు మూడుసార్లు రాసుకోవచ్చు. చర్మంలో మొటిమలు, జిడ్డు తగ్గడమే కాదు.. అందంగానూ మారుతుంది.

3. స్క్రబ్బర్: ముల్తానీ మట్టి ఎక్స్ ఫ్లోయేట్ లేదా స్ర్కబ్బర్ గా ఉపయోగించవచ్చు. స్ర్కబ్బర్ గా ఇది ముఖం, ముక్కమీద ఉన్న బ్లాక్ మరియు వైట్ హెడ్స్ ను నివారిస్తుంది . ముల్తానీ మట్టిని ఫేస్ ప్యాక్ లలో విరివిగా ఉపయోగించవచ్చు మరియు డెడ్ స్కిన్, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ తొలగించడానికి ఫేస్ ప్యాక్ లలో ఉపయోగించవచ్చు. ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మరియు దీన్ని చర్మం యొక్క నిర్మాణం మరియు చర్మం నాణ్యతగా ఉండటానికి బాగా సహాయపడుతుంది. ముల్తానీ మట్టిలో స్ర్కబ్, ఫేస్ ప్యాక్స్, క్లెన్సర్ బెనిఫిట్స్ ఉన్నాయి. చర్మానికి తగినంత తేను అంధిస్తుంది .

4. చర్మం యొక్క రంగు: సూర్యరశ్మి కారణంగా కమిలిన చర్మాన్ని నివారిస్తుంది. అది కూడా దీన్ని తరచూ అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముల్తానీ మట్టితో తయారుచేసిన అనేక యాంటీ టాన్ సోప్స్, ఫేస్ వాష్ లు, మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ముఖచర్మం రంగు తేలేందుకు కూడా ముల్తానీ మట్టి పని చేస్తుంది. 2 పెద్ద చెంచాల ముల్తానీ మట్టిలో అంతే పన్నీరు, 1/4 చిన్న చెంచా గ్లిజరిన్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుని 10 నిముషాలు వుంచుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో రెండుసార్లు ఈ ప్యాక్‌ను వాడుకుంటే, నల్లని చర్మంలో చాలా వరకూ మార్పు కలుగుతుంది.

5. చర్మం యొక్క నిర్మాణం:

ముల్తానీ మట్టి చర్మం యొక్క నిర్మాణంను మెరుగుపరుస్తుంది. ఇది అసాధారణమైన ప్యాచ్ లను నిర్మూలిస్తుంది. చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది . చర్మం మరింత ప్రకాశవంతగా కనిపిస్తుంది . స్కిన్ టోన్ మరియు టెక్చర్ కోసం ముల్తానీ మట్టిని రెగ్యులర్ గా ఉపయోగించవచ్చు . దీన్ని అన్ని రకాల చర్మ తత్వాలకు ఉపయోగించవచ్చు. పొడి చర్మం మరియు నిర్జీవమైన చర్మతత్వం కలిగిన వారు, వింటర్ లో ముల్తానీ మట్టిని నివారించాలి .

English summary

Beauty Benefits Of Multani Mitti

Multani Mitti also known as Fuller’s Earth has cosmetic benefits for the skin. Fuller’s Earth is a skin purifier and cleanser. Fuller’s Earth has Magnesium Chloride content which helps to reduce acne and blemishes from the skin.
Desktop Bottom Promotion