జిడ్డు మరియు సున్నిత చర్మానికి ఫేషియల్ ఆయిల్స్

మీరు జిడ్డు చర్మంతో అలసిపోయారా? అయితే, ఆయిల్ స్కిన్ ను నివారించ సమయం వచ్చింది. ఆయిల్ స్కిన్ లేకుండా ఒక క్లియర్ స్కిన్ పొందాంలే తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందే. జిడ్డు చర్మం కలిగి వారు, ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల మీ చర్మం మరింత ఆయిలీగా మారుతుందని అటువంటి ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉపయోగించకూడదని మీరు వినే ఉంటారు. కానీ, ఈ రోజు కొందరు బ్యూటీషియన్ నిపుణుల ప్రకారం, ఆయిల్ చర్మానికి ట్రీట్ చేయడానికి ఫేషియల్ ఆయిల్ ఉపయోగిస్తే సమస్య శాశ్వతంగా నివారించవచ్చు అని అంటున్నారు.

అటువంటి ఫేషియల్ ఆయిల్ కొన్ని మీకోసం ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఎవరైతే సెన్సిటివ్ స్కిన్ కలిగి ఉన్నారో వారు కూడా ఈ ఫేషియల్ ఆయిల్స్ ను ఉపయోగించవచ్చు. ఈ ఫేషియల్ ఆయల్స్ చర్మ సమస్యలను నివారిస్తాయి . మీ సున్నిత చర్మానికి సరైన, మన్నికైన ఆయిల్ ను ఉపయోగించడం వల్ల మీ చర్మానికి తగినంత తేమను అంధించడంతో పాటు, మొటిమలు లేని చర్మాన్ని ఇవ్వడంతో పాటు సెబమ్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ ను కొన్ని మొక్కలు, వేర్లు మరియు పువ్వులనుండి సేకరించబడినది. ఈ ఆయిల్స్ చర్మాన్నికి సున్నితత్వాన్ని మరియు మొటిమలు మచ్చలు లేని చర్మ తత్వాన్ని అంధిస్తుంది . మీకు ఆయిల్ స్కిన్ ఉన్నా, లేకున్నా ఇది చర్మానికి అద్భుతంగా పనిచేసి, మంచి ప్రయోజనాలను అంధిస్తుంది. ఆయిల్ స్కిన్ ఉన్నవారు ఈ నేచురల్ ఆయిల్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మంలోని చాలా తేలికగా శోషింపబడి చర్మ రంద్రాల నుండి శుభ్రం చేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

మీ సెన్సిటివ్ స్కిన్ కు అప్లై చేయాడికి అటుంటి నేచురల్ ఫేషియల్ ఆయిల్స్ కొన్ని మీకోసం...

జోజోభా ఆయిల్ :

జోజోభా ఆయిల్ :

ఆయిల్ మరియు సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారికి ఒక బెస్ట్ ఫేషియల్ ఆయిల్ జోజోబా ఆయిల్. అందుకు మీరు చేయాల్సిందల్లా, ఒక చుక్క జోజోబా ఆయిల్ తీసుకొని అందులో చిన్న కాటన్ బాల్ ను డిప్ చేసి మీ ముఖం మీద సర్కులర్ మోషల్ లో మసాజ్ చేయాలి. మంచి ఫలితాలను పొందడానికి ఈ పద్దతిని వారానికి ఒకసారి అనుసరించాలి.

సన్ ఫ్లవర్ ఆయిల్:

సన్ ఫ్లవర్ ఆయిల్:

సున్నిత చర్మానికి సన్ ఫవర్ ఆయిల్ చాలా మంచిది. సన్ ఫ్లవర్ ఆయిల్ ఆయిల్ గ్రంధులను ఉత్పత్తిని తగ్గిస్తుంది. సన్ ఫ్లవర్ ఆయిల్లోని ఎమోలియండ్ లక్షణాలు ఆయిల్ గ్రంధులను నివారిస్తుంది మరియు ఇది చర్మాన్ని ఎల్లప్పుడు తేమగా ఉండేలా చేస్తుంది. కాబట్టి, మూడు రోజులకొకసారి సన్ ఫ్లవర్ ఆయిల్ తో ముఖానికి మసాజ్ చేయాలి.

బాధం ఆయిల్:

బాధం ఆయిల్:

ఆయిల్ మరియు జిడ్డు చర్మానికి ఒక బెస్ట్ ఆయిల్ బాదం ఆయిల్. బాదం ఆయిల్ జుట్టు మాత్రమే మేలు చేస్తుందని చాలా మంరది నమ్ముతారు. కానీ, చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది . అందుకు మీరు చేయాల్సిందల్లా రెండు మూడు చుక్కల బాదం నూనెను చేతులో వేసుకొని మీ ముఖానికి మసాజ్ చేసి పది నిముషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

రోజ్మెరీ ఆయిల్:

రోజ్మెరీ ఆయిల్:

జిడ్డు చర్మం మరియు సున్నిత చర్మ తత్వం కలిగిన వారు, ఒక ఉత్తమ ఫేషియల్ ఆయిల్ రోజ్మెరీ ఆయిల్. ఇది చర్మానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎటువంటి చర్మ తత్వానికైన అద్భుతంగా పనిచేసే ఈ ఆయిల్ ధర కూడా కాస్త ఎక్కువే.

జీడిపప్పు ఆయిల్:

జీడిపప్పు ఆయిల్:

సున్నిత మరియు జిడ్డు చర్మానికి జీడిపప్పు ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది. రెండు చెంచాలా నూనెను గోరువెచ్చగా చేసి, తర్వాత అందులో నిమ్మరసం జోడించి తరవ్ాత ముఖం మీద మెడ మీద మసాజ్ చేయాలి. మంచి ఫలితాలను పొందడానికి ఈ ఫేషియల్ ఆయిల్ ను నెలకొక సారి అప్లై చేయాలి.

క్యాస్ట్రో ఆయిల్:

క్యాస్ట్రో ఆయిల్:

క్యాస్ట్రో ఆయిల్ స్టొమక్ అప్ సెట్ కు మాత్రమే కాదు, ఇది ఆయిల్ స్కిన్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది . ఒక చెంచా ఆముదంనూనెలో కొద్దిగా ఉప్పు జోడించి తర్వాత ముఖం మరియు మెడకు మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆయిల్ స్కిన్ శాస్వతంగా తొలగించుకోవచ్చు.

ల్యావెండర్ ఆయిల్:

ల్యావెండర్ ఆయిల్:

ఆ తాజా లావెండ్ ఆియల్ సున్నితమైన మరియు జిడ్డు చర్మానికి చాలా ఫర్ ఫెక్ట్ ఆయిల్ . మీకు మొటిమలు, మచ్చలు సమస్య ఉన్నప్పడు, ఈ ఆయిల్ ను మీ ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

వెజిటేబుల్ ఆయిల్:

వెజిటేబుల్ ఆయిల్:

చర్మ సమస్యను నివారించడానికి వెజిటేబుల్ ఆయిల్, చాలా ఉత్తమం. అందుకు ఒక చెంచా వెజిటేబుల్ ఆయిల్ ను తీసుకొని అందులో ఒక చెంచా నీరు జోడించి బాగా మిక్స్ చేసి, దాన్ని ముఖం మరియు మెడకు పట్టించి ఒక గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

సున్నిత చర్మానికి కొబ్బరి నూనె ఒక ఉత్త ఫేషియల్ ఆయిల్ . ఒక చెంచా తాజా కోకోనట్ ఆయల్ ను తీసుకొని మీ ముఖానికి అప్లై చేయాలి. ఇలావారానికి ఒకసారి చేయడం వల్ల చర్మ సమస్యలను నివారిస్తుంది.

రోజ్ ఆయిల్:

రోజ్ ఆయిల్:

జిడ్డు చర్మం మరియు సున్నిత చర్మానికి రోజ్ ఆయిల్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఇది కాస్త ఖరీదైనది, కానీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చర్మాన్ని చాలా సున్నితంగా, సాఫ్ట్ గా మార్చుతుంది. అనుకూల ఫలితాలను పొందాలంటే, ఈ ఫేషియల్ ఆయిల్ ను రెండు వారాలకొకసారి ఉపయోగించాలి.

Desktop Bottom Promotion