Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
పురుషులకు మొటిమలు నివారణకు హోం మేడ్ ఫేస్ ప్యాక్
పురుషుల్లో మోటిమల సమస్యలు కోసం అనేక పర్యావరణ,జీవనశైలి మరియు జన్యు కారణాలు ఉన్నాయి. ముఖం మీద అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న నుదురు సులభంగా మోటిమలకు ప్రభావితమవుతుంది. జిడ్డు గల జుట్టు మరియు చుండ్రు మీ ముఖం మీద మోటిమల అభివృద్ధికి దారితీస్తుంది. శరీరం లోపల జరిగే హార్మోన్ల మార్పులు కూడా కొన్నిసార్లు మోటిమలకు కారణమవుతాయి. జీవితంలో హార్మోన్ల మార్పులు సంభవించే సమయంలో యువ మరియు కౌమార దశలు ఉంటాయి.
మీరు మొటిమల చికిత్సకు ఇంట్లో సాధారణ మరియు సమర్థవంతమైన ఫేస్ ప్యాక్లు లు తయారు చేసుకోవచ్చు. ఇంట్లో అందుబాటులో ఉండే తేనె,ఉప్పు,బొప్పాయి వంటి మొదలైన పదార్దాలతో తయారుచేసుకోవచ్చు. అటువంటి సాధారణ సహజ పదార్థాలను కలిపి చికిత్స మరియు నివారణ చర్యకు సహాయపడే ఫేస్ ప్యాక్లు రూపొందించవచ్చు. ఈ ఫేస్ ప్యాక్లు తేమగా మరియు మీ ముఖ చర్మం మరియు ముఖ మొటిమల చికిత్స లో సహాయం చేస్తాయి. హోమ్మేడ్ ఫేస్ ప్యాక్లు తయారికి పండ్లు అత్యధిక ప్రజాదరణ మరియు సమర్థవంతమైనవి.

1. ముల్తాన మిట్టీ ఫేస్ ప్యాక్
ఇది సమర్థవంతంగా భారతీయ సంస్కృతులలో మొటిమల చికిత్సకు ఉపయోగించే ఒక సంప్రదాయ ఫేస్ ప్యాక్ గా ఉంటుంది. సాధారణంగా దీనిని భూమి నుంచి తయారు చేస్తారు. మీకు సమీపంలో అనేక దుకాణాల్లో అందుబాటులో ఉంటుంది. దీనిలో మోటిమలు చికిత్సకు ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంది. ముల్తాన మిట్టీని పేస్ట్ చేయండి. దానిలో కొన్ని చుక్కల రోస్ వాటర్,చిటికెడు నిమ్మ కలిపి రిఫ్రెష్ ముఖం ప్యాక్ వేయండి.

2. గోధుమ పిండి
ఒక చిన్న గిన్నె లో 2 స్పూన్స్ గోధుమ పిండి మరియు ఒక కప్పు పెరుగు వేసి మీడియం మందపాటి పేస్ట్ గా చేయాలి. మీ ముఖం మీద సమానంగా రాసి 30-45 నిమిషాలు ఆగితే అది పొడిగా మారుతుంది. పూర్తి పొడిగా ఉన్నప్పుడు,నీటితో మీ చర్మంను వృత్తాకార మోషన్ లో స్క్రబ్ తో శుభ్రం చేయండి. కడిగిన తర్వాత మీ ముఖానికి మంచి మాయిశ్చరైజర్ గా ఉంటుంది. ఒక మంచి ప్రభావం కోసం ఒక వారంలో 2 సార్లు పునరావృతం చేయాలి.

3. పుదీనా ఫేస్ ప్యాక్
పుదీనా ముఖం ప్యాక్ పూర్తిగా మూలికా మరియు మీ చర్మంపై చల్లని ప్రభావంను కలిగిస్తుంది. ఒక గిన్నెలో కొన్ని పుదీనా ఆకులను వేసి మెత్తగా చేసి దానిలో 2-3 స్పూన్ల తేనెను కలపండి. మీ ముఖం మీద పేస్ట్ ను రాసి ఆరే వరకు ఉంచండి. ఆరిన ముఖాన్ని సాదా నీటితో వాష్ చేయండి. మీరు మంచి ఫలితాలను పొందడానికి ఒక వారంలో ఈ ప్రక్రియను వీలైనన్ని సార్లు చేయవచ్చు.

4. దోసకాయ ఫేస్ మాస్క్
దోసకాయ మోటిమలు,శరీరం నుండి వేడి తగ్గించటానికి మరియు వాపు మీద పోరాడటానికి ఆదర్శవంతమైన ముఖం ప్యాక్ గా ఉంటుంది. ఇది మోటిమలు మరియు వాటి రూపాన్ని తగ్గిస్తుంది. ఈ ప్రక్రియ చాలా సులభం. దోసకాయను చెక్కులు తీసి ముక్కలు కోసి రసంగా తయారుచేసి 30-40 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఇది తగినంత చల్లగా ఉన్నప్పుడు రసం తీసుకోని మీ ముఖానికి రాయండి. మచ్చలు తగ్గటానికి గుజ్జును కూడా ఉపయోగించవచ్చు.

5. బొప్పాయి పండు ప్యాక్
మీరు ప్యాక్ చేయడానికి ఒక పండు లేదా బహుళ పండ్లను వాడవచ్చు. మీ లభ్యత బట్టి అరటి, బొప్పాయి,అవెకాడో పండు,పుచ్చకాయ వంటి పండ్లను ఎంచుకోండి. మీ పండ్లు ఒకటి లేదా రెండు తీసుకోని మాష్ చేసి తేనె మరియు పెరుగు కలపండి. ఈ పేస్ట్ ను రాసి పొడిగా అయ్యాక కడగండి.



Click it and Unblock the Notifications