For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో చర్మానికి చల్లదనం, కాంతివంతం చేసే ఫేస్ ప్యాక్స్

|

వేసవిలో వేడి చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. చర్మం కమిలిపోవడం..స్నానం చేసిన గంటకే తాజాదనం తగ్గి శరీరం వడిలిపోయినట్లు అవడం..లాంటి సమస్యలు ఓన్నో అలాంటి వాటిని అదుపులో ఉంచి చర్మం తాజాదంన సంతరించుకునేలా చేయాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చందనం: గంధం పొడిని పాలతో కలిపి వారానికి మూడు సార్లు ముఖానికి రాసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అదే జిడ్డు చర్మతత్వం ఉన్న వాళ్ళు గులాబీనీటిలో కలిపి వాడుకోవచ్చు. గంధం నూనెను రెండు చుక్కలు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే శరీరం పరిమిళ భరితం అవుతుంది.

ప్రతి సీజన్ లో చర్మానికి రక్షణ కల్పించడం చాలా ముఖ్యం, వేసివి కాలం రాబోతోంది. ఈ వేసవికాలంలో చర్మం మీద డైరెక్ట్ uv కిరణాలు, మరియు దుమ్మ ధూళి వల్ల చర్మానికి హాని కలుగుతుంది. అంతే కాదు వేసవిలో ఎండల వల్ల వచ్చే చమటతో కూడా చర్మం పాడవుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా చర్మం మీద తగినంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కూలింగ్ వస్తువులతో తాజా ఫేస్ ప్యాక్స్ వల్ల వేసవి టాన్ మరియు ఇతర చర్మ సమస్యల నుండి బయట పడటానికి సహాయపడుతుంది. మరి చర్మానికి చల్లదనాన్ని కల్పించి సూర్యుని తాపం నుండి రక్షణ పొందడానికి అనేక ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి.

పుచ్చకాయ:

పుచ్చకాయ:

దీన్ని ప్రతి రోజూ తింటే శరీరం చల్లగా ఉంటుంది. ఇందులో పీచుపదార్థం ఎక్కువ కాబట్టి శరీరంలోని మిలినాల్నీ వెలుపలికి వచ్చేస్తాయి. పుచ్చకాయను పెద్ద ముక్కలా తరిగి దాన్ని తేకెలో ముంచి ముఖానికి రాసుకుని రెండు నిమిషాలు మర్దన చేస్తే సరిపోతుంది. చర్మం తాజాగా మారుతుంది. అలాగే పుచ్చకాయ పలుచని ముక్కల్లా కోసి ముఖంపై అద్ది కొద్దిగా వేడిగా ఉన్న వస్త్రాన్ని కప్పి ఉంచాలి. రెండు నిమిషాలయ్యాక తీసేస్తే చర్మం సహజ కాంతిని సంతరించుకుంటుంది.

కీరదోస:

కీరదోస:

దీన్ని ప్రతి రోజూ తింటే శరీరానికి పీచు పుష్కలంగా అందుతుంది. సల్ఫర్, పొటాసియం, బాకంప్లెక్స్ విటమిన్లు ఇందులో పుష్కలం. కీరతో కళ్లనే కాదు చర్మాన్నీ మెరిపంచవచ్చు. కీరదోసను తురిమి ముఖానికి అద్దినట్లు చేయాలి. మపదినిషాలయ్యాక తీసేయాలి. దీని వల్ల మరింత మేలు జరగాలంటే కొద్దిగా తేనె కూడా కలిపి పూతలా వేసుకోవచ్చు. కీరదోస రసాన్ని సున్ని పిండిలో కలిపి నలుగు పెట్టుకుంటే చర్మం అందంగా తయారవుతుంది.

తాటి ముంజలు:

తాటి ముంజలు:

ఈ కాలంలో విరివిగా లభించే వీటివల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు. దాహార్తిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాదు..అందానికీ ఎంతో మేలుచేస్తాయివి. కాలిన గాయాలకు, మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యల్ని నివారించడానికి తాటిముంజల్లోని నీరు దివ్వౌషధంలా పనిచేస్తాయి. వీటిని తరచూ తినడమే కాదు పూత రూపంలోనూ వేసుకోవచ్చే లేత తాటిముంజుల్ని తీసుకుని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

బొప్పాయితో ఫేస్ ప్యాక్:

బొప్పాయితో ఫేస్ ప్యాక్:

బొప్పాయి గుజ్జులో అర టీ స్పూన్ ఓట్స్ పొడి, అర టీ స్పూన్ తేనె, అయిదారు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి పట్టించి అరగంట పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపైన జిడ్డు తగ్గి చర్మం కోమలంగా ఉంటుంది.

నిమ్మకాయ-పెరుగు:

నిమ్మకాయ-పెరుగు:

రెండు టేబుస్పూన్ల పెరుగులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, శనగపిండి కలిపి, ముఖం, మొడ, చేతులకు కూడా అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితోశుభ్రం చేసుకొంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంటుంది.

టమాటోతో ఫేస్ ప్యాక్:

టమాటోతో ఫేస్ ప్యాక్:

టొమాటోని మెత్తగా పేస్ట్ చేసుకుని అందులో టీ స్పూన్ ఓట్స్ పొడి, టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పెసరపిండి, టీ స్పూన్ పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి ప్యాక్‌ లా వేసుకుని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపైన ఉన్న జిడ్డు, నల్లమచ్చలు తగ్గి చర్మం మెరుస్తూ ఉంటుంది.

క్యారెట్ తో ఫేస్ ఫ్యాక్:

క్యారెట్ తో ఫేస్ ఫ్యాక్:

క్యారట్‌ ను ఉడకబెట్టుకుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దానిలో నాలుగు టీ స్పూన్ల తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ఆయిలీ స్కిన్ వారికే కాక నార్మల్ స్కిన్ వారికి కూడా పనిచేస్తుంది. క్యారట్ ఫేస్ ప్యాక్‌ ని సమయం దొరికినప్పుడల్లా ముఖానికి అప్లై చేస్తే

కొబ్బరి బోండం:

కొబ్బరి బోండం:

చర్మాన్ని, శిరోజాలను మెరిపించే సుగుణం ఈ నీటి సొంతం. ఈ కాలంలో ప్రతిరోజూ కొబ్బరినీటిలో ముంచిన దూదిని ముఖానికి రాసుకోవచ్చు. ఈ తర్వాత రెండు రెండు మూడు నిమిషాలు నెమ్మదిగా మర్తన చేస్తే నల్లగా మారిన చక్మం నిగారింపును సంతరించుకుని అందంగా తయారవుతుంది. అలాగే ముదురిన కొబ్బరి నుంచి తీసిన పాలతో చర్మాన్ని మర్దన చేసుకోవాలి. కాసేపయ్యాక కడిగేస్తే, చర్మం చాలా సున్నితంగా, కోమలంగా తయారవుతుంది.

సబ్జా గింజలు:

సబ్జా గింజలు:

శరీరానికి చల్లదనం అందించే ఈ గింజల వల్ల కలిగే మేలు అంతాఇంతా కాదు. కానీ చాలామందికి వీటినెలా ఉపయోగించాలో తెలియదు. ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల గింజల్ని వేసి నానబెట్టాలి. నాలుగైదు గంటలకు అవి నాని మెత్తగా మారి ఉబ్బుతాయి. ఆ గింజల్ని మరో గ్లాసు నీటిలో వేసుకుని కొద్దిగా పంచదార లేదా తేనె కలిపి తాగితే శరీరానికి ఎంతో చలువ. అలాగే ఈ గింజల్ని తేనెతో కలపి గుజ్జులా చేసి ముఖానికి రాసుకుని రెండు నిమిషాలు మర్దన చేయాలి. పదినిమిషాలై కొద్దిగా ఆరినట్లు అయ్యాక కడిగేసుకుంటే సరిపోతుంది. చర్మం అందంగా తయారవుతుంది.

తేనె:

తేనె:

తేనెను ఎగ్ వైట్ తో కానీ లేదా ఇతర స్కిన్ కేర్ వస్తువులతో కానీ, మిక్స్ చేసినప్పుడు, తేనెలో అనేక స్కిన్ కేర్ బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి. ఇది చర్మానికి మాయిశ్చరైజర్ గా మరియు డార్క్ పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది మరియు చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. దీన్ని మీ హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ లో చేర్చుకొని ఈ సమ్మర్ సీజన్ లో ఉపయోగించండి.

English summary

Homemade face packs for the summer

The skin, due to exposure to the harsh sun becomes dry and dehydrated. Here are face packs that can be made at home...
Story first published: Saturday, April 26, 2014, 11:44 [IST]
Desktop Bottom Promotion