Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కాంతివంతమైన చర్మానికి ఆరెంజ్-లెమన్ ఫేస్ ప్యాక్
సహజంగా మన ఏ పండ్లు తిన్నా వాటి పై తొక్కను తీసి పడేస్తాము, అయితే చాలా మందికి తెలియని, విషయం ఏమిటంటే, చెత్త అనుకునే ఆ పై తొక్కలో కూడా మన చర్మాన్ని కాపాడే గుణం ఉంది, అది ఏమిటో తెలుసుకోవాలంటే ఇది చూడాల్సిందే..
ప్రస్తుత సమాజంలో తొందరపాటు తనంతో, సమయాన్ని వృదా చేసుకోకూడదు అనే తత్వంతో మన చర్మ సం రక్షణ కోసం మనం మార్కెట్లో దొరికే అనేక వాటిపై ఆదారపడతాము, సరిగ్గా గమనిస్తే మనం వాడేవాటిల్లో ఎన్నో మనం ఇంట్లో ఉపయోగించుకునే వస్తువులతోనే తయరు చేస్తారు, అలాంటప్పుడు, డబ్బులు ఖర్చుపెట్టి, ఆ రసాయనాల ప్రభావం వల్ల ఇబ్బందులు పడే కన్నా మీరే ఈ "ఫేస్ ప్యాక్స్"ని తయారు చేసుకోవచ్చు, అది ఎలా అంటే...ఇలా
మన మార్కెట్లో నారింజా, నిమ్మ పుష్కలంగా దొరుకుతాయి, అందులో సందేహమే లేదు, అయితే ఈ పండ్ల పై తొక్కలలోని "విటమిన్ C" మీ చర్మ సం రక్షణలో ఎంతగానో సహాయపడుతుంది.అయితే నేరుగా ఉపయోగించడం కన్నా ఈ తొక్కలను పొడిగా చేసి పౌడరు రూపంలో ఉపయోగించుకోవడం సులభము.

ఈ "ఫేస్ ప్యాక్" ని ఉపయోగించే ముందు చర్మాన్ని శుబ్రం చేసుకుంటే దానివల్ల మీ చర్మం లోని చనిపోయిన, అనవసరమైన కణాలు తొలగిపోతాయి.
ఈ నారింజ, నిమ్మ తొక్కల పొడి తయరు చేసుకోవడం ఎలా?
నారింజ, మరియు నిమ్మ తొక్కలని తీసి కొన్ని రోజులు ఎండపెట్టాలి, అవి గట్టిగా అయిన తరువాత మెత్తగా పౌడరు లాగా చేసి ఒక డబ్బాలో ఉంచాలి.అలా మీరు "ఫేస్ ప్యాక్" తయారు చేసుకునేటప్పుడు ఉపయోగించుకోవచ్చు"
ఉపయోగించుకోవడం ఎలా??
ఈ పొడిని, కొంచెం పెరుగు, నీటిలో కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మీ చర్మంలోని జిడ్డు తొలగిపోయి మిల మిల మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.
కొంచెం పెసర పిండి, నిమ్మ రసం కలిపి ముఖానికి పట్టిస్తే అందమైన చర్మం కలిగి, మృదువుగా మచ్చలు లేని చర్మం మీ సొంతం అవుతుంది.
ఈ పొడిని పసుపుతో కలిపి ఉపయోగించుకుంటే మొటిమల నుంచి, నల్లని మచ్చలనుంచి, చర్మం ముడతలు పడకుండా ఎంతగానో సహాయపడుతుంది.
ఈ పొడిని ఎక్కువగా చేసుకుని ఉంచుకోవడం మంచిది, ఇది పాడైపోతుందేమో అనే భయం అవసరం లేదు ఎందుకంటే ఇది పూర్తిగా ఎండిపొయిన పండ్ల తొక్కలతో తయారుచేసింది .
ఈ పై మిశ్రమం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, ఒక్కసారి ఉపయోగించి చూడండి.



Click it and Unblock the Notifications