For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్విమ్మింగ్ వల్ల ఏర్పడే చర్మ సమస్యలు

By Mallikarjuna
|

ప్రపంచంలో పిల్ల పెద్దలు స్విమ్మింగ్ చేయడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ముఖ్యంగా వేసవి వస్తే ఎప్పుడూ స్విమ్మింగ్ పూల్లోనే గడిపేయాలనిపిస్తుంది. ఇక పిల్లలకైతే చెప్పనవసరమే లేదు. ఎప్పుడూ స్విమ్మింగ్ పూల్లోనే జలకాలాడుతూ, వేడి నుండి ఉపయశమనం పొందుతూ, శరీరానికి చల్లగా విశ్రాంతి పొందుతారు. ఇంకా స్విమ్మింగ్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి . ప్రయోజనాలతో పాటు కొన్ని చర్మ సమస్యలు కూడా జతగానే ఉన్నాయన్న విసయాన్ని మీరు గుర్తించాలి.

ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్లో వాటర్ ప్యూరిఫికేషన్ కోసం క్లోరిన్ వాడుతుంటారు. ఈ క్లోరిన్ స్విమ్మింగ్ పూల్లో క్రిమిసంహారాలను నాశనం చేయడం కోసం వినియోగిస్తారన్న విషయం మనకు తెలుసు . పూల్లో నీటిని శుధ్దిచేయడం కోసం ఒక ప్రయోజనకారిగా కొన్ని వేల సంవత్సరాలను నుండి క్లోరిన్ ఉపయోగిస్తున్నారు.

స్విమ్మింగ్(ఈత)తో మీ పొట్టను తగ్గించుకోవడం ఎలా:క్లిక్ చేయండి

మన చర్మం చాలా సున్నితంగా మరియు నీరు గ్రహించే ధోరణి కలిగి ఉంటుంది. ఈ కారణంగా, అందువల్ల, నీటిలో ఏదైనా మిక్స్ చేసినా సరే అది నీటితో పాటు చర్మం గ్రహిస్తుంది. దాంతో చర్మ సమస్యలకు దారితీసింది.

Skin Problems From Swimming

గరిష్టంగా చర్మం సమస్యలు ఈత సమయంలో బహిర్గితం అవుతాయి, అందుచేత ఈత సమయంలో ఏర్పడే చర్మ సమస్యలు నివారించడానికి సమర్థవంతంగా వాటిని పరిష్కరించే మార్గాలను తెలుసుకొని ఉండాలి.

చర్మ సమస్యలు తగ్గించడానికి మరియు చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈత ద్వారా వచ్చే చర్మ సమస్యలను యొక్క జాబితా ఈక్రింది విధంగా తెలుసుకోండి.

స్విమ్మింగ్ వల్ల వచ్చే చర్మ సమస్యలు
స్కిన్ డీహైడ్రేషన్: తరచూ స్విమ్మింగ్ చేయడం వల్ల మీ చర్మం మరీ సున్నితంగా మారుతుంది మరియు చర్మం సమస్యలు అభివృద్ధికి ధోరణి అవుతుంది. దాంతో అటువంటి పరిస్థితిల్లో చర్మం డీహైడ్రేషన్ చెందడం వల్ల చర్మం యొక్క సహజ పిహెచ్ విలువను కోల్పోతుంది దాందో చర్మం పొడిగా, మరియు పొరలుగా ఊడివచ్చేలా జరుగుతుంది.

స్విమ్మర్స్ కోసం బెస్ట్ హెయిర్ కేర్ టిప్స్:క్లిక్ చేయండి


చర్మం దద్దుర్లు
స్విమ్మింగ్ కు, చర్మం సమస్యలకు సంబంధం కలిగి మరో సమస్య చర్మం దద్దుర్లు. రెగ్యులర్ గా స్విమ్ చేయడం వల్ల చర్మం దురద మరియు ఎర్రటి దద్దుర్లు చర్మ మీద ఏర్పడుతాయి. దాంతో ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన చర్మంకు అవసరం అయ్యే ద్రవాలు యొక్క సహజ సమతుల్యం తగ్గుతుంది. ఇంకా ఇది ఒక బాధాకరమైన బొబ్బలు ఏర్పడేందుకు కారణం అవుతుంది.

వయస్సైపోయిన సంకేతాలు తెలుపుతుంది
మీరు యవ్వనంగా ఉండి మీరు అకాల వృద్ధాప్య సూచనలు నివారించాలనుకుంటే ఈతకొట్టడం మానేయండి, లేదా మీరు స్విమ్మింగే చేసేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్ స్విమ్మింగ్ త పాటు, మీ వయస్సుకు సంబంధించి చర్మం సమస్యలు చర్మంలో సన్నని చారలు, నిర్జీవం మొదలగునవి, చర్మంలో ఫ్లూయిడ్స్ తగ్గడం వల్ల వచ్చేవే.

సన్ డ్యామేజ్ పెరుగుతుంది: రెగ్యులర్ గా స్విమ్మింగ్ చేయడం వల్ల , చర్మ సమస్యలు సన్ డ్యామేజ్ కు గురిచేస్తుంది. మీరు స్విమ్ చేసినప్పుడు, మీ శరీరం యొక్క సామర్థ్యం చర్మం సమస్యలతో పోరాడే సామర్థ్యం రోజురోజుకు తగ్గించేస్తుంది. సన్ డేమేజ్ గురియ్యేంతగా మరింత సున్నితంగా మార్చుతుంది. చర్మం సూర్య రశ్మికి ఎక్కువగా బహిర్గతం అవ్వడం వల్ల సన్ బర్న్ కు కారణం అవుతుంది.

స్విమ్మింగ్ వలన 5 ప్రధాన ప్రయోజనాలు!: క్లిక్ చేయండి

హాట్ షవర్ ను కంట్రోల్ చేయాలి
స్విమ్మింగ్ చేసిన తర్వాత వెంటనే వేడినీటి స్నానాలు చేయడం చర్మానికి అనారోగ్యకరం .ఇది స్విమ్మింగ్ రిలేటెడ్ చర్మం సమస్యలకు దారితీస్తుంది. వేడినీళ్ళ స్నానం మరియు ఆవిరి వల్ల కోర్లిన్ చర్మంలోకి వ్యాప్తి చెంది, పొడి చర్మం వంటి చర్మ సమస్యలు తీవ్రతను పెంచుతుంది.

పెరిగిన విష పదార్థాలు
మీరు స్విమ్ చేసిన ప్రతి సారి, మీ శరీరంలోనికి హానికరమైన టాక్సిన్స్ ప్రవేశిస్థాయి. అలాగే చర్మం సమస్యలను పెంచుతాయి. ఇవి తీవ్రతను పెంచుతాయి . దాంతో మీ చర్మంను మరింత పొడిగా మార్చుతుంది మరియు పొడిగాలికి చర్మం గురైనప్పుడు చర్మం పగుళ్ళకు దారితీస్తుంది.

స్విమ్మింగ్ వల్ల ఎదురయ్యే చర్మ సమస్యలను సమర్థవంతంగా అవగాహన చేసుకోవాలి అప్పుడు మరింత ఎఫెక్టివ్ గా ట్రీట్ చేయవచ్చు . దాంత మీరు స్విమ్మింగ్ చేసే ప్రతి సారి రక్షణ కల్పించుకోవచ్చు. మీరు స్విమ్ చేసేప్పుడు అందులో క్లోరిన్ కలపకుండా చూసుకోవాలి. లోక్లోరిన్ వాటర్ కలిగి ఉండటం వల్ల అనేక చర్మ సమస్యలను నివారించవచ్చు.

English summary

Skin Problems From Swimming

There are many people around the world who like to go for a swim every now and then to beat the heat or relax their body. Even though swimming has its own share of benefits, you should know that there are a few skin problems that are associated with it.
Desktop Bottom Promotion