Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇండియన్ స్కిన్ కు అలోవెరతో ఫర్ఫెక్ట్ ఫేస్ ప్యాక్
అలోవెర(కలబంద)ఒక బెస్ట్ నేచురల్ పదర్థం. ఇది చర్మ సౌందర్యంను మెరుగుపరచడంలో చాలా గ్రేట్ గా పనిచేస్తుంది. మీ చర్మం మరింత సాప్ట్ గా మరియు ప్రకాశవంతంగా మార్చుకోవడంతో పాటు మరియు ఎలాంటి మొటిమలు మచ్చలు లేకుండా చేసుకోవడానికి కలబందను ఉపయోగించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
చర్మ సంరక్షణలో కలబందను ఉపయోగించడం వల్ల చర్మంలోని మచ్చలు, రాషెష్ మరియు మొటిమలు వంటి చర్మ సమస్యలను చాలా ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు. ఎందుకంటే ఈ కలబంద మొక్కలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది ఎలాంటి చర్మ తత్వానికైనా చికిత్సను అందిస్తుంది. అంతే కాదు, హోం మేడ్ అలోవెరా ప్యాక్ డ్రై స్కిన్ నివారిస్తుంది. దాంతో చర్మ రంద్రాలను మాయం చేస్తుంది.
అలోవెరా జ్యూస్ ఎక్కువ న్యూట్రీషియన్స్ ను కలిగి ఉంటుంది . అందుకే ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది . ఈ న్యూట్రీషియన్స్ చర్మంను కాంతివంతంగా మార్చుతుంది, చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. అన్ని సమయాల్లో చర్మంను ఫ్రెష్ గా ఉంచుతుంది . కాబట్టి ఎలాంటి చర్మ తత్వం కలిగిన వారికైన సరే అలోవెరా జ్యూస్ ను ఉపయోగించుకోవచ్చు. మరి ఈ కలబంద రసంతో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం...

1. కాంతివంతమైన చర్మ సౌందర్యానికి :
తేనె, పసుపు, పాలు మరియు అలోవెర వేసి మొత్తంను మిక్స్ చేయాలి . ఇది హోం మేడ్ అలోవెర ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం ద్వారా ఈ ఫ్యాక్ చర్మానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

2. సన్ టాన్ తొలగిస్తుంది:
సన్ టాన్ త్వరగా నివారించడం చాలా ఎక్కువ సమయం పడుతుంది. అయితే అలోవెరా జెల్ ఉపయోగించి సన్ టాన్ నుండి త్వరగా ఉపశమనం కలిగించుకోవచ్చు. అలోవెరా జెల్, టమోటో జ్యూస్, మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం ద్వారా సన్ టాన్ నివారించుకోవచ్చు . ఇది చర్మయొక్క ఛాయను మెరుగుపరుస్తుంది.

3. పిగ్మెంటేషన్ :
ఏజ్ స్పాట్స్, మొటిమల యొక్క మచ్చలు, పిగ్మెంటేషన్ మార్క్స్, బర్న్స్, మరియు గాయలై మార్క్స్ ను అలోవెరా జెల్ మరియు రోజ్ వాటర్ తో ట్రీట్ చేయవచ్చు . దీన్ని ప్యాక్ గా వేసుకొని , మంచి నీటితో కడిగేసుకోవాలి.

4. డిటాక్స్ ప్యాక్:
ముఖం డిటాక్సిఫై చేసుకోవాలంటే, ఇది చర్మానికి ఒక ఫర్ఫెక్ట్ రేడియంట్ గ్లోను అందిస్తుంది . అలోవెరా జెల్, మ్యాంగో జ్యూస్, నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలావారానికి ఒక సారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

5. మొటిమలను నివారిస్తుంది:
కలబంద మరియు తేనె రెండు మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఈ రెండింటి కాంబినేషన్ ఆయిల్ స్కిన్ నుండి చాలా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

6. సున్నితమైన చర్మానికి:
సున్నితమైన చర్మం కలిగిన వారు , కలబంద ఒక ఉత్తమ హోం రెమెడీ. హోం మేడ్ అలోవెర ఫేస్ ప్యాక్ కోసం కీరదోసకాయ రసంలో కలబంద మరియు రోజ్ వాటర్ మిక్స్ చేసి దీన్ని ఫేస్ ప్యాక్ గా లేదా ఫేస్ వాష్ గా ఉపయోగించుకోవచ్చు.

7. డ్రై స్కిన్:
కలబంద డ్రై స్కిన్ నివారించడంలో కూడా చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకు నిమ్మరసం, ఖర్జూరం మరియు కలబంద మిక్స్ చేసి ఫేస్ కు ప్యాక్ లా వేసుకోవాలి. ఈ ప్యాక్ ను వారానికి రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

8. డెడ్ స్కిన్ నివారిస్తుంది:
డెడ్ స్కిన్ నివారించడంలో కలబందం చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకు కీరదోసకాయ మరియు ఓట్ మీల్ పొడిని కలబంద రసంలో మిక్స్ చేసి ఈ మిశ్రామన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మంలోని మ్రుతకణాలను తొలగిస్తుంది దాంతో చర్మం కాంతివంతంగా మారుతుంది.

9. మాయిశ్చరైజ్ మరియు
డ్రై స్కిన్ కు అలోవెర ఫేస్ ప్యాక్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. బాదం పౌడర్ లో కలబంద రసాన్ని మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డ్రై స్కిన్ తొలగి చర్మం తేమగా కాంతివంతంగా ఉంటుంది.

10. డ్రై అండ్ కాంబినేషన్ స్కిన్ :
ఒక బౌల్లో కలబంద, షీ బటర్ మరియు ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 15నిముషాల తర్వాత తడి వస్త్రంతో శుభ్రం చేసి తర్వాత నీళ్ళు పోసి కడిగేయాలి.



Click it and Unblock the Notifications