For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ కి బెస్ట్ శనగపిండి ఫేస్ ప్యాక్స్

By Nutheti
|

అమ్మల కాలం నుంచి అందానికి మెరుగులద్దడంలో, మేని ఛాయ మెరిపించడంలో, చర్మ సంరక్షణలో శనగపిండి పాత్ర అమోఘం. ఎలాంటి చర్మ సమస్యలకైనా చిటికెలో స్వస్తి చెప్పే గుణం సహజమైన శనగపిండిలో ఉంది. నిర్జీవంగా ఉన్న చర్మానికి, యాక్నే, పింపుల్స్, నల్లగా మారిన చర్మానికి, అవాంఛిత రోమాలు తొలగించడానికి.. ఇలా రకరకాలు శనగపిండి ఉపయోగపడుతుంది.

READ MORE: చర్మ సౌందర్యానికి రంగు రంగుల సోపుల కంటే సహజమైన శెనగపిండే మేలు...

బ్యూటీ, స్పా ట్రీట్మెంట్స్ లో శనగపిండిని ఉపయోగిస్తారు. ఖర్చు లేకుండా.. ప్రతి ఇంట్లో దొరికే ఈ శనగపిండితో ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తే.. బ్యూటీ పార్లర్స్, క్రీములు అవసరం లేకుండానే.. అందమైన చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ మైక్రోబైయల్ గుణాలు చర్మానికి మంచి చేస్తాయి. అలాగే చర్మంపై ఉండే దుమ్ము, ధూళితో పాటు మృతకణాలను తొలగిస్తాయి.

అంతేకాదు ఎలాంటి చర్మతత్వం కలిగి ఉన్నవాళ్లైనా.. శగనపిండిని ఉపయోగించవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జిడ్డు చర్మం, పొడి చర్మం ఏ చర్మానికి ఎలాంటి శనగపిండి ప్యాక్స్ మంచి ఫలితాన్నిస్తాయో చూద్దాం.

జిడ్డు చర్మానికి - శనగపిండి, పెరుగు

జిడ్డు చర్మానికి - శనగపిండి, పెరుగు

జిడ్డు చర్మానికి ఇంట్లోనే తయారుచేసుకునే శనగపిండి ప్యాక్ చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఇది చర్మంలో ఉండే జిడ్డుని తొలగిస్తుంది. ముందుగా కొంచెం శనగపిండి తీసుకుని దానికి రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత కడిగేసుకోవాలి.

జిడ్డు చర్మానికి ప్యాక్ - 2

జిడ్డు చర్మానికి ప్యాక్ - 2

శనగపిండికి పాలు, లేదా పెరుగు కలిపి అప్లై చేసుకున్నా జిడ్డు చర్మం నుంచి బయటపడవచ్చు. కొద్దిగా శనగపిండి తీసుకుని దానికి పెరుగు లేదా పాలు కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకున 20నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పొడి చర్మానికి

పొడి చర్మానికి

అన్ని రకాల చర్మ తత్వాలకు శనగపిండి బాగా పనిచేస్తుంది. ఇది క్లెన్సింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. కొద్దిగా శనగపిండి తీసుకుని దానికి కొద్దిగా పాలు, కొంచెం తేనె, చిటికెడు పసుపు కలపాలి. వీటన్నింటి మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ ప్యాక్ ని రెగ్యులర్ గా ఫేస్ కి అప్లై చేయడం వల్ల చర్మంలో మాయిశ్చరైజర్ లెవెల్స్ తగ్గిపోకుండా కాపాడుతుంది. దీనివల్ల పొడిచర్మం నుంచి బయటవచ్చు.

మొటిమలకు శనగపిండి ప్యాక్

మొటిమలకు శనగపిండి ప్యాక్

మొటిమలు బాధపెడుతున్నాయంటే మీ చర్మం చాలా సున్నితమైనదని అర్థం. కాబట్టి క్రీములు వాడటం కంటే హోం రెమిడీస్ ట్రై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. సహజ చిట్కాలతోనే మొటిమలు తగ్గించుకునే మార్గాలు ప్రయత్నించాలి.

మొటిమలకు ప్యాక్ 1

మొటిమలకు ప్యాక్ 1

గోరువెచ్చగా ఉన్న తేనెను శనగపిండిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా ముఖానికి అప్లై చేస్తూ ఉండాలి. తేనెలో ఉండే యాంటీ మైక్రోబైయల్ గుణాలు పింపుల్స్ తగ్గించడానికి సహాయపడుతుంది.

మొటిమలు ప్యాక్ 2

మొటిమలు ప్యాక్ 2

శనగపిండి, గంధం, పసుపు తీసుకుని రోజ్ వాటర్ తో పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే మొటిమలు తగ్గుముఖం పడతాయి.

మచ్చలకు

మచ్చలకు

శనగపిండి, దోసకార రసంతో ప్యాక్ తయారు చేసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల మచ్చలు తగ్గిపోయి.. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

చర్మ కాంతికి

చర్మ కాంతికి

చర్మం సహజమెరుపు సంతరించుకోవాలంటే ఈ ప్యాక్ ట్రై చేయండి. నాలుగు బాదం పలుకులను పౌడర్ లా చేసుకోవాలి. అరటీ స్పూన్ శనగపిండి, అరటీస్పూన్ నిమ్మరసం, అరటీస్పూన్ పాలు తీసుకుని అన్నింటిని పేస్ట్ లా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 30 నిమిషాలపాటు ఆరనివ్వాలి. తర్వాత కడిగేసుకుంటే బ్లీచింగ్ లా పనిచేస్తుంది.

డ్రై స్కిన్ మెరిసిపోవాలంటే

డ్రై స్కిన్ మెరిసిపోవాలంటే

శనగపిండి, నిమ్మరసం, పాలు, తేనె కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా అప్లై చేసుకోవడం వల్ల.. డ్రై స్కిన్ నిగనిగలాడుతుంది.

జిడ్డు చర్మం మెరవాలంటే

జిడ్డు చర్మం మెరవాలంటే

శనగపిండి, గంధం పొడి, నిమ్మరసం, తేనె కలిపి ప్యాక్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జిడ్డు చర్మం ఉన్నవాళ్లు అప్లై చేసుకుంటూ ఉండటం వల్ల.. చర్మం కొత్త నిగారింపు సంతరించుకుంటుంది.

ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు

ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు

శనగపిండి, కొంచెం నీళ్లు కలిపి ముఖంపై అవాంఛిత రోమాలు ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. బాగా ఆరిన తర్వాత రుద్దుతూ కడిగేసుకోవాలి. మెంతిపొడి కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమంతో అవాంఛిత రోమాలు ఈజీగా తొలగిపోతాయి.

నల్లగా ఉన్న మోచేతులు, మెడకు

నల్లగా ఉన్న మోచేతులు, మెడకు

నల్లగా ఉన్న మోచేతులు, మోకాళ్లు, మెడ భాగాలలో చమురుతో మసాజ్ చేసుకోవాలి. తర్వాత శనగపిండి, పసుపు, నిమ్మరసం, పెరుగు కలిపి తయారు చేసుకున్న మిశ్రమాన్ని అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల నలుపు తగ్గిపోతుంది.

చర్మంపై పిగ్మెంటేషన్ తొలగించడానికి

చర్మంపై పిగ్మెంటేషన్ తొలగించడానికి

1/4 కప్ నీళ్లు, 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా కలిపి పక్కనపెట్టుకోవాలి. మరో కప్పు తీసుకుని 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకుని మిక్స్ చేయాలి. దీనికి ముందుగా కలిపి పెట్టుకుని బేకింగ్ సోడా పేస్ట్ ని కూడా కలపాలి. ముఖానికి ముందుగా రోజ్ వాటర్ తో తుడుచుకుని ఈ ప్యాక్ అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే పిగ్మెంటేషన్ తొలగిపోతుంది.

ముడతల చర్మానికి శనగపిండి ప్యాక్

ముడతల చర్మానికి శనగపిండి ప్యాక్

ఒక గిన్నెలో కోడిగుడ్డు తెల్లసొన, టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, టేబుల్ స్పూన్ శనగపిండి కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి. పూర్తీగా ఆరిపోయిన తర్వాత గుండ్రంగా రుద్దుగా ప్యాక్ తొలగించి.. చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల చర్మంపై ముడతలు తగ్గిపోతాయి.

టమోటా, శనగపిండి ప్యాక్

టమోటా, శనగపిండి ప్యాక్

టమోటాని మిక్సీలో వేసి జ్యూస్ తీయాలి. ఈ జ్యూస్ కి టేబుల్ స్పూన్ శనగపిండి కలిపి పేస్ట్ తయారు చేసి.. ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత కడిగేసుకుంటే ఇన్స్టంట్ గ్లో మీ సొంతమవుతుంది.

English summary

15 Homemade Besan Face Packs For All Skin Types: Besan Face packs are best for skin problems

Besan or gram’s flour is an age old super hit granny’s recipe to fight out a number of skin problems like dull lifeless skin, acne, pimples, dark skin, blemish buster and for removal of unwanted hair. It is inexpensive and is easily available in everyone’s kitchen!!
Desktop Bottom Promotion