For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిర్జీవమైన చర్మానికి నిగారింపునిచ్చే హోం రెమెడీస్

|

రోజంతా పనిచేసి అలసిపోయినప్పుడు, మీ ముఖం చూడటానికి చాలా డల్ (నిర్జీవం)గా ఉంటుంది. మరియు ముఖంలో తాజాదనం మొత్తం తగ్గిపోయినట్లు కనిపిస్తుంది. మీకు సరైన నిద్రలేకపోయినా మీర ముఖం చూడటానికి డల్ అలసటగా మరియు చర్మంలో కాంతి తగ్గిపోతుంది.

అలసిన చర్మానికి కారణాలు అనేకం. అనేక చర్మం సమస్యలు, ముడుతలు, డార్క్ స్పాట్స్ మొదలగునవి. అలసట చెందిన మీ చర్మానికి విశ్రాంతి కలిగించి, చర్మాన్ని బ్రైట్ గా మరియు ప్రకాశవంతంగా మరియు తాజాగా మార్చుకోవాలి. అలసిన చర్మాన్ని ప్రకాశవంతం గా మార్చుకోవడానికి అనేక మార్గాలున్నాయి.

ఇంట్లో పనులు, ఉద్యోగాలతో అలసిపోయిన మహిళలు అందం విషయంలో అశ్రద్ధ వహిస్తారు. బ్యూటీపార్లర్లకి వెళ్లేంత తీరిక లేకుంటే ఇంట్లోనే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.

 కీరదోసకాయ:

కీరదోసకాయ:

ఉదయం నుంచి సాయంత్రం వరకు కనులు విశ్రాంతి లేకుండా చూసిచూసి అలసిపోతాయి. వాటిని రోజూ పట్టించుకోకుండా వదిలేస్తే కళ్లలోని మెరుపు కూడా కనుమరు గవుతుంది. కనుక ఇంటికి రాగానే ఒక కీరానో, బంగాళాదుంపనో పలుచగా కోసి కళ్లపై పెట్టుకుని ఒక పదినిమిషాలు పడుకోండి చాలు. కళ్లలోని అలసట కనిపించకుండా పోతుంది.

తురిమిన క్యారెట్

తురిమిన క్యారెట్

తురిమిన క్యారెట్ టీ స్పూన్, ఛీజ్ టీ స్పూన్ కలిపి గుజ్జులా చేయాలి. ఇందులో కొద్దిగా బాదం నూనె, తేనె కలిపి ముఖానికి మసాజ్ చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ మృతకణాలను తొలగించి, చర్మకాంతిని మెరుగుపరుస్తుంది.

ఐసుముక్కలతో

ఐసుముక్కలతో

ఉదయం లేచిన తరువాత వీలైతే ఐసుముక్కలతో ముఖాన్ని సున్నితంగా రుద్దుకోవాలి.

గులాబీరేకులను

గులాబీరేకులను

కొన్ని గులాబీరేకులను పేస్ట్ చేసి, అందులో టీ స్పూన్ అరటిపండు గుజ్జు, అర టీ స్పూన్ అలొవెరా రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌ లా వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచుగా చేస్తుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.

క్రీముని

క్రీముని

ముఖం కడుక్కున్న పదిహేను నిమిషాల తరువాతే ఏదైనా క్రీముని రాసుకోండి.

 అరటిపండుని

అరటిపండుని

ముఖం తెల్లగా, మెడ నల్లగా ఉండడం ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య. మెడకి పండిన అరటిపండుని ముద్దగా చేసి రాసుకుని, పదిహేను నిమిషాల తరువాత కడిగేసుకోండి.

అవకాడో గుజ్జు

అవకాడో గుజ్జు

ఒక పాత్రలో రెండు టేబుల్‌ స్పూన్లు పండిన అవకాడో గుజ్జు, టీ స్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకొని పదినిమిషాల తర్వాత కడిగేయాలి. మురికిని, మృతకణాలను తొలగించడంలో ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది.

పచ్చిపాలని

పచ్చిపాలని

సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక నీళ్లలో పచ్చిపాలని కలిపి స్నానం చేస్తే పొడిచర్మం సమస్య తగ్గుతుంది. చర్మం కాంతులీనుతుంది.

గుడ్డు

గుడ్డు

చేతులు కూడా నల్లబడిపోయి ఉంటాయి. వాటికి ప్రతిరాత్రీ గుడ్డులోని తెల్లసొన, టేబుల్‌స్పూన్‌ తేనె, స్పూన్‌ ఓట్స్‌పొడి కలిపి ముద్దగా చేసి చేతులకి రాసుకుని పదిహేను నిమిషాలు ఉంచండి. పైనున్న నలుపుదనమంతా పోతుంది.

 కాళ్ళు కొంచం ఎత్తు లో

కాళ్ళు కొంచం ఎత్తు లో

గులాబి రంగుకోసం కాళ్ళు కొంచం ఎత్తు లో ఉన్నాట్లు పడుకోవాలి ... ఇలా చేయడం వలన మెడకు , ముఖానికి, తలకి రక్తం సరఫరా ఎక్కువై గులాబీ రంగు ఛాయా ముఖంపై వెలుగుతుంది. వారానికి మూడు రోజులు చేస్తే సరిపోతుంది.

పెరుగు

పెరుగు

రెండు చెంచాల పెరుగులో నాలుగు చుక్కల నిమ్మరసం, కొద్దిగా తేనె, అరటిపండు గుజ్జు కలిపి పూతలా వేయాలి. పావుగంటయ్యాక చల్లటి నీటితో కడిగేసుకొంటే మేని కాంతివంతమవుతుంది.

తులసి ఆకు

తులసి ఆకు

తులసి ఆకులను ఎండబెట్టి పొడిచేసి గులాబీనీళ్లు, పుదీనా ముద్ద కలిపి చేతులకు రాసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది.

జామపండు

జామపండు

బాగా మగ్గిన జామపండుని మెత్తని గుజ్జుగా చేసుకుని దానికి రెండు చెంచాల బొప్పాయి గుజ్జు, చెంచా తేనె కలిపి ముఖానికి పూతలా వేయాలి. ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేసుకొంటే చర్మానికి తగిన తేమ అంది మోము కాంతివంతంగా మెరిసిపోతుంది.

అనాసపండు

అనాసపండు

రెండు చెంచాల అనాసపండు రసంలో రెండు చుక్కల ఆలివ్‌నూనె, చెంచా గంధం పొడి కలుపుకుని ముఖానికి పూతలా వేసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకొంటే మోము కాంతివంతంగా తయారవుతుంది.

పుచ్చకాయ

పుచ్చకాయ

పుచ్చకాయ రసం, కమలా పండు రసం, దోసకాయ గుజ్జు.. ఇలా వేటితోనైనా ముఖానికి మసాజ్ చేసుకోవచ్చు. ఇవి చర్మానికి కాంతిని తెస్తాయి. అయితే జిడ్డు చర్మానికి పుల్లటి పండ్లను వాడితే మంచిది. అదేవిధంగా సాధారణ, పొడి చర్మానికి దోస, అరటి వంటి తీయని పండ్లను వాడాలి.

English summary

15 Ways to Brighten Tired Skin..!

15 Ways to Brighten Tired Skin..! Feeling tired is one thing, but looking tired is the pits! Keep reading to get the lowdown on how to brighten tired skin!
Story first published: Wednesday, October 21, 2015, 11:54 [IST]
Desktop Bottom Promotion