For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రైడల్ బ్యూటీలో తులసిని చేర్చుకోవడానికి 5 ముఖ్య కారణాలు

By Super
|

ఒకనాడు తెల్లారితే కౌసల్యా సుప్రజా రామ..అన్న సుప్రభాతంతో పాటు మహిళలు తులసి కోట చుట్టూ తిరగటం మనం చూసే వాళ్ళం. కానీ మారుతున్న జనరేషన్లో దీని ప్రాధాన్యం తెలియకుండా పోయిందంటే అతిశయొక్తి కాదేమో. కాని తులసికి ఉన్న ఔషద గుణాలు దేనికీ ఉండవనే చెప్పవచ్చు. అందుకే మన సంస్కృతిలో ప్రతి ఇంట్లో తులసి కోట ఉండేది. అది ఈ మధ్య కనుమరుగవుతోంది. తులసి మన ఆరోగ్యానికి ఏమి ఇస్తుందో తెలుసుకుందామా..

తులసి ఆకు సర్వరోగ నివారిణి. తులసి ఆకులు రుచికి చేదుగా, వగరుగా ఉన్నప్పటికీ అగ్నిప్రదీపకం. గుండెకు బలాన్నిస్తుంది. అంతేకాదు ఇది చాల సుగంధభరితమైనది. తన చుట్టూ ఉన్న గాలిని శుద్ధిపరుస్తుంది.

సూర్యోదయానికి ముందే దీని సేవనం ప్రయోజనకరం అని శాస్త్రాలు చెబుతున్నాయి. మన పెద్దలు కుడా చెఫ్తుంటారు. తులసిలో శ్రీతులసి, కృష్ణతులసి అనే రెండు రకాలున్నాయి. ఈ రెండింటిలోనూ సమానమైన ఔషధ గుణాలున్నాయి. తులసి ఆకులు, వేర్లు, విత్తనాలు అన్నింటిలోనూ ఒక్కో ఔషధ గుణం ఉన్నది. దీని ఆకులలో ఉన్న సుగంధం క్రిమికీటకాలను, రోగాణువులను అరికడుతుంది.

ఉదాయాన్నే నాలుగు తులసి ఆకుల్ని నోట్లో వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అంటారు. ఆరాదానకు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా తులసి ఎంతగానో ఉపయోగపడుతుంది. శిరోజ , చర్మ , సౌందర్యానికి తులసి ఎంతగానో ఉపయోగపడుతుంది... ఒక్కసారి చదవండి......

తులసిలోని సౌందర్య గుణగణాలు

తులసిలోని సౌందర్య గుణగణాలు

చర్మ సంరక్షణ: ముఖం ఫై ఏర్పడిన నల్లని మచ్చలను నివారించడంలో తులసి మంచి ఒషధంలా పనిచేస్తుంది. తులసి రసానికి , నిమ్మ రసం చేర్చి ముఖానికి పట్టించి ఇరవయ్ నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే కొన్నాళ్ళకు మచ్చలు పూర్తిగా తగ్గుతుంది. చర్మం కాంతివంతముగా ఉంటుంది. తులసి , పుదీనా ఆకులను కలిపి తీసిన రసాన్ని ముఖానికి పట్టించాలి. ఇది మొఖంలోని మోటిమాలను చక్కగా నివారిస్తింది.

తులసిలోని సౌందర్య గుణగణాలు

తులసిలోని సౌందర్య గుణగణాలు

స్కిన్ టోన్: తులసి ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. దీనికి కొంచం నీరు కలిపి మొఖానికి రాసుకోవాలి. ఈ ప్యాకు చర్మ రంద్రాలను తెరుచుకోలాగా చేస్తుంది. దీంతో చర్మం ఫై పెరుకుపోయీన మురికి సులువుగా తొలగి పోవడమే కాకుండా చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది.

తులసిలోని సౌందర్య గుణగణాలు

తులసిలోని సౌందర్య గుణగణాలు

ఏజ్ ఫ్రూఫ్: చర్మాన్ని కాపాడుకోవడానికి తులసిని ఉపయోగించుకోవచ్చు . అందుకు మీరు చాలా సింపుల్ గా తయారుచేయవచ్చు . తులసిన ఆకులు పేస్ట్ చేసి అందులో గుడ్డు కలిపి, దీన్ని ముఖానికి పట్టించాలి. మసాజ్ చేసి 10నిముషాల తర్వాత శుభ్రంచేసుకుంటే, చర్మం తెల్లగా మరియు ఫ్రెష్ గా యంగ్ గా కనబడేలా చేస్తుంది .

తులసిలోని సౌందర్య గుణగణాలు

తులసిలోని సౌందర్య గుణగణాలు

దంతాలు తెల్లగా మెరిపిస్తుంది: తులసి అందానికే కాదు, దంతసంరక్షణకు కూడా బాగా సహాయపడుతుంది. ఎల్లో టీత్ ను నివారిస్తుంది . తెల్లగా మెరిసేలా చేస్తుంది , అందుకు ఎండి తులసిని పొడి చేసి రాత్రి పడుకొనేటప్పుడు, దంతాలకు పట్టించి దంతాలను రుద్ది కడగాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

తులసిలోని సౌందర్య గుణగణాలు

తులసిలోని సౌందర్య గుణగణాలు

శీరోజాలకు తులసి నూనె....

తల ఫై చర్మం దురద పెట్టడం , ఎక్కువగా చెమట రావటం , చిన్న చిన్న కురుపులు రావటం వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి తులసి నూనె చక్కటి పరిస్కారమంతున్నారు సౌందర్య నిపుణులు... మరి ఇంట్లోనే దానిని ఎలా తయారు చెయ్యవచ్చునో తెలుసుకుందాం....

ఈ నూనె తయారీకోసం తాజా ఆకులను ఎంచుకుంటే మంచిది. ఇవి అందుబాటులో లేకపోతె ఎండిన తులసాకు పొడిని కూడా ఉపయోగించవచ్చు. ఒకటి లేదా రెండు కొమ్మల తులసి ఆకులతో పది టేబుల్ స్పూన్ల పొడి తయారు చేసుకోవచ్చు. అర కప్పు కొబ్బరి నూనెలో ఈ పొడి వేసి వేడి చెయ్యాలి. తాజా ఆకులను ఉపయోగిస్తున్నట్లు ఐతే ఆకులను బాగా నలిపి నూనెలో వెయ్యాలి. నూనె వేడెక్కడం మొదలయ్యాక కొన్ని మెంతులు వెయ్యాలి. మెంతులు నూనెలో ఉడికి నట్లవుతాయి. అప్పుడు స్టవ్ ఆపేయాలి. ఈ నూనె చల్లార్చి పొడిగా ఉన్నా శుభ్రమైన సీసాలో నిల్వ చేసుకోవాలి. వారానికి రెండు సార్లు దీనిని తలకు పట్టించి మృదువుగా మర్దన చేసుకోవాలి. అరగంట ఆగి షాంపు తో తల స్నానం చేస్తే సరిపోతుంది

English summary

5 Fantastic Reasons To Add Tulsi In Your Bridal Beauty Routine

Considered as a sacred plant in the Hindu culture, tulsi or basil, is found in almost every house in India. In addition to the religious significance, it also has amazing medicinal properties. That is why, this ‘queen of herbs’ has been used in Ayurveda as well as Indian cooking for thousands of years. And now, it is an important ingredient in many international cuisines as well.
Story first published: Friday, January 30, 2015, 23:23 [IST]
Desktop Bottom Promotion