Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
చర్మ సౌందర్యానికి వెజిటేబుల్ జ్యూస్ చేసే మ్యాజిక్...
ప్రపంచంలో సెలబ్రిటీల వలే మెరుపులా మెరిసిపోవాలంటూ ఎంతో వ్యయం చేస్తూంటారు. కొంతమంది సహజ ఉత్పత్తులు తినటం మరికొందరు ఖరీదైన కాస్మెటిక్స్ వాడటం చేసి తమ చర్మానికి రంగు తెప్పించుకుంటారు. అయితే, ఇటీవల చాలామంది యువత, మధ్య వయసువారు వారి చర్మ కాంతి కొరకు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ జ్యూసులు తీసుకోవడం మొదలైంది.
తాజా పండ్లు మరియు కూరగాయల్లో చాలా వాటికి మంచి పోషకాలుంటాయి. చర్మం మెరవాలంటే పండ్ల రసాలతో పాటు, వెజిటేబుల్ రసాలు కూడా మంచివే. ఇవి ఆరోగ్యంగా వుంచటమే కాక త్వరగా శరీర చర్మంపై ఫలితాలు చూపుతాయి. అంతేకాదు, ఈ రసాలను శరీరం అతి త్వరగా పీల్చేసుకుని జీర్ణ చేసుకుంటుంది. రోజువారీ జీవితంలో ఎవరెంత బిజీ షెడ్యూలు కలిగి వున్నా తప్పకుండా ఒక్క గ్లాసెడు వెజిటేబుల్ జ్యూసులు త్రాగడం వల్ల శరీరానికి మేలు చేస్తుందనేది గ్రహించి తాగుతూండాలి.
చర్మం కొరకు మంచి పోషకాలు కల తాజా పండ్ల రసాలు చెప్పాలంటే, ఆరెంజ్ పండ్ల రసం, యాపిల్ రసం, నిమ్మరసం, పుచ్చకాయ రసం తాగాలి. అయితే, బొప్పాస రసం కూడా బాగా పని చేస్తుంది. కూరగాయలైన బచ్చలి కూర, తోటకూర, కేబేజి వంటి రసాలు కూడా అద్భుత ఆరోగ్యాన్ని, చర్మకాంతులను తెచ్చిపెడతాయి. మరి మీకు ఏది అందుబాటులో వుంటే దానిని తాగి అందం, ఆరోగ్యం సంరక్షించుకోండి. మీకోసం కొన్ని పండ్ల రసాలు ఈ క్రింది విధంగా...

క్యారెట్ జ్యూస్:
గ్లోయింగ్ స్కిన్ కు ఒక ఉత్తమ వెజిటేబుల్ జ్యూస్ క్యారెట్ జ్యూస్. ఎందుకంటే ఈ క్యారెట్ జ్యూలస్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది . అంతే కాదు, ఫైబర్ అధికంగా ఉండే బౌల్ మూమెంట్ ను మెరుగుపరిచి, పొట్టను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంది. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది, వృద్ధాప్య ఛాయలను ధరిచేరనివ్వదు. ఇది మిమ్మల్ని యంగ్ గా మరియు రేడియంట్ గా మార్చేస్తుంది.

ఆకు కూరల రసం:
ఆకుకూరలతో సూప్స్ తయారుచేయడం ఒక ఉపాయం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రసాల్లో విటమిన్ కె పుష్కలంగా ఉండే బోన్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. మరో మూలకం ఐరన్ కూడా పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మసౌందర్యం పెంపొందించడంలో ఒక ఐడియల్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు . ఎందుకంటే ఇది శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ను పెంచుతుంది. విటమిన్ సి మరియు ఇ మరియు మినిరల్స్ మరియు మెగ్నీసియం గొప్ప యాంటీఆక్సిడెంట్స్ గా పనిచేసి శరీరంలో ఫ్రీరాడిక్ల్స్ నుండి దూరంగా ఉంచుతుంది. ఈ ఫ్రీరాడికల్స్ వల్ల చర్మం దెబ్బతింటుంది మరియు డల్ గా మారుతుంది.

టమోటోజ్యూస్ :
చాలా సహజంగా ప్రతి ఇంట్లోనే తయారుచేసుకొనే జ్యూస్ లలో కామన్ జ్యూస్ ఇది. టమోటోను ఫ్రూట్స్ గాను మరియు వెజిటేబుల్ గాను భావిస్తుంటారు. వీటిని వివిధ రకాల వంటలో ఉపయోగిస్తుంటారు . టమోటో జ్యూస్ మన శరీరానికి చాలా గ్రేట్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ ను వేరు చేసే మూలకం పొటాషియం అధికంగా ఉంటుంది. దీనితో పాటు లైకోపిన్ అనే లక్షణాలు కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీక్యాన్సేరియస్ లక్షణాలను నివారిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మానికి చాలా గ్రేట్ గా భావిస్తారు.

కీరదోస
గ్రీన్ కాలీఫ్లవర్ బాగా పాపులర్ వెజిటేబుల్ , ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద ఉన్నవారు దీన్ని ఎక్కువ గా తీసుకుంటుంటి . అన్ని రకాల వెజిటేబుల్స్ కంటే ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఎక్కువ పోషకాంశాలను అందిస్తుంది . ఇందులో ఫైబర్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది . ఇదిహెల్తీ స్కిన్ కోసం చాలా అవసరమైనటువంటివి. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువ మరియు న్యూట్రీషియన్స్ ఎక్కువ కాబట్టి, చర్మానికి మరియు శరీరానికి చాలా ఉపయోగకరమైనది.

క్యాబేజ్ జ్యూస్:
కీరదోసకాయ జ్యూస్ చర్మానికి ఒక బెస్ట్ జ్యూస్. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటు బీటాకెరోటిన్ మిమ్మల్ని మరింత యవ్వనంగా ఉంచుతుంది.

బ్రొకోలీ జ్యూస్ :
గ్రీన్ కాలీఫ్లవర్ బాగా పాపులర్ వెజిటేబుల్ , ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద ఉన్నవారు దీన్ని ఎక్కువ గా తీసుకుంటుంటి . అన్ని రకాల వెజిటేబుల్స్ కంటే ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఎక్కువ పోషకాంశాలను అందిస్తుంది . ఇందులో ఫైబర్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది . ఇదిహెల్తీ స్కిన్ కోసం చాలా అవసరమైనటువంటివి. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువ మరియు న్యూట్రీషియన్స్ ఎక్కువ కాబట్టి, చర్మానికి మరియు శరీరానికి చాలా ఉపయోగకరమైనది.



Click it and Unblock the Notifications
