Latest Updates
-
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.!
కాబోయే పెళ్ళికూతురుకి గంధం ఫేస్ ప్యాక్స్ ఇస్తుంది అమేజింగ్ లుక్
పెళ్ళికూతురుకు ప్రతి రోజు ఒక ఖరీదైన సెలూన్లో బ్యూటి చికిత్స చేయించటం సాధ్యం కాకపోవచ్చు. అయితే వీలైనంత వరకు ఇంటిలోనే మంచి ప్రయోజనాలను సాదించవచ్చు. గందంను చందన్ అని కూడా పిలుస్తారు. ఇది మీ చర్మ సమస్యలన్నింటికి పరిష్కారం చూపుతుంది.
దీనిని వివిధ పద్ధతులలో ఉపయోగిస్తున్నారు. ఆయిల్ సెక్రెషన్,పొడి చర్మం,మొటిమలు,డార్క్ వృత్తాలు వంటి సమస్యలను నియంత్రించటంలో సహాయపడుతుంది. అంతేకాక మీరు ప్రకాశించే చర్మాన్ని సాధించడంలో సహాయపడుతుంది. ఇది మొత్తం వధువుల యొక్క అత్యంత వాంఛనీయ లక్షణాలలో ఒకటి.
కాబట్టి, ఇక్కడ మీరు ప్రయత్నించటానికి కొన్ని అద్భుతమైన గంధం ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. కాబట్టి మీ వివాహ సమయంలో సహజమైన అందమైన మరియు దోషరహిత చర్మం మీ సొంతం అవుతుంది.

1. పొడి చర్మానికి వీడ్కోలు చెప్పండి
మీ చర్మం పొడిగా ఉంటే, అప్పుడు మీ చర్మం సహజ pH స్థాయి సమతుల్యం కొరకు ఈ ఫేస్ ప్యాక్ ను ప్రయత్నించండి. మూడు స్పూన్ల గందం నూనె, మూడు స్పూన్ల పాలపొడి మరియు ఒక స్పూన్ రోజ్ వాటర్ ను కలిపి మృదువైన పేస్ట్ గా తయారుచేయాలి.
మీ ముఖం మీద ఈ పేస్ట్ ను రాసి 10 నుంచి 15 నిముషాలు తర్వాత సాధారణ నీటితో కడగాలి. గందం నూనె, పాలపొడి చర్మానికి అవసరమైన తేమను, పోషణను అందిస్తాయి. రోజ్ వాటర్ చర్మానికి టోనర్ గా పనిచేస్తుంది. హైడ్రేట్ మరియు ప్రకాశించే చర్మం కొరకు ప్రతి రోజు ఈ ప్యాక్ ని ఉపయోగించండి.

2. డార్క్ సర్కిల్స్ మాయం
వధువుకు పెళ్లి సమయం దగ్గరకు వచ్చే సరికి డార్క్ సర్కిల్స్ మరింత భయానకంగా ఉంటాయి. గంధం పొడిలో రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేసి,పడుకొనే ముందు కళ్ళ కింద రాసి,మరుసటి రోజు ఉదయం కడగాలి.

3. నూనె నియంత్రణ
గందం పొడి పొడి చర్మం కోసమే కాకుండా జిడ్డు చర్మం కొరకు కూడా సహాయపడుతుంది. కాబట్టి, మీ చర్మం నుండి అదనపు నూనె సెక్రెషన్ అరికట్టేందుకు,ఇక్కడ మీకు ఒక అద్భుతమైన గంధం ఫేస్ ప్యాక్ ఉంది.
ఒక స్పూన్ ముల్తాన మట్టి,ఒక స్పూన్ గందం పొడిని రోజ్ వాటర్ లో కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ మందంగా లేదా పలుచగా లేకుండా మధ్యస్తంగా ఉండాలి. ఈ పేస్ట్ ను మీ ముఖానికి రాసి 15 - 20 నిముషాలు అయిన తరవాత సాదారణ నీటితో కడగాలి. కనీసం వారానికి మూడుసార్లు ఈ ఫేస్ ప్యాక్ ను వేస్తే జిడ్డు చర్మం తాజాగా మరియు మృదువుగా మారుతుంది.

4. మొటిమలు తగ్గుతాయి
ఇది మొటిమలు నయం కావటానికి చాలా సమర్ధవంతమైన పరిష్కారం. ఒక స్పూన్ గందం పొడి, ఒక స్పూన్ పసుపు,మూడు స్పూన్ల రోజ్ వాటర్ కలిపి మృదువైన పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ను మీ ముఖానికి రాయాలి.
ఈ పేస్ట్ రాసిన 20 నిమిషాల తర్వాత ముఖాన్ని కడగాలి. ఈ ప్యాక్ మీ ముఖం మీద మొటిమలను తొలగిస్తుంది. అంతేకాక భవిష్యత్ లో మొటిమలు రాకుండా నిరోధిస్తుంది. ప్రతి రోజు ప్రకాశవంతమైన మచ్చ లేని చర్మం పొందడానికి ఈ ప్యాక్ ను వేయండి.

5. యాంటీ టానింగ్ ఏజెంట్
నాలుగు స్పూన్ల గందం పొడి, అర నిమ్మకాయ రసంలో కలిపి పేస్ట్ చేయాలి. ఇది మీ టానింగ్ సమస్యలకు పరిపూర్ణ పరిష్కారంగా ఉంటుంది.
ఇది చర్మం ఉపశమనానికి మరియు కాంతివంతంగా చేస్తుంది. అయితే చర్మం చికాకు లేదా వాపు కలిగి ఉన్న వధువులకు సిఫార్సు లేదు. ఎందుకంటే నిమ్మరసం సమస్యను మరింత పెంచుతుంది.

6. ఫెయిర్ లుక్ కొరకు
అన్ని రకాల చర్మాల వారికీ సహాయపడుతుంది. ఇది ఫెయిర్ చర్మం టోన్ కోసం ఆశపడే వారికి ఒక అద్భుతమైన నివారణ మార్గంగా చెప్పవచ్చు. మీరు పొడి చర్మం కలిగి ఉంటే గందం ఆయిల్, జిడ్డు చర్మం కలవారు అయితే గందం పొడిని ఉపయోగించాలి. ఒక స్పూన్ శనగపిండి,ఒక స్పూన్ గందం ఆయిల్/పొడి, ఒక స్పూన్ పసుపును రోజ్ వాటర్ లో కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.
మీ ముఖం మీద ఈ పేస్ట్ రాసి ఆరనివ్వాలి. మీ ముఖంను15-20 నిమిషాల తర్వాత కడగాలి. ప్రకాశించే మరియు ఫెయిర్ ఛాయను సాధించడానికి క్రమం తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించండి.

7. యాంటీ ఏజింగ్ ప్యాక్
ఈ ఫేస్ ప్యాక్ లో గందం వివాహం తర్వాత కూడా మీ అందాన్ని కాపాడుతుంది. గంధం లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ మరియు శోథ నిరోధక ఏజెంట్లు రక్త ప్రసరణ మెరుగుపరచటానికి సహాయపడతాయి. ఇది చర్మంనకు హాని కలిగించే వాటిని తొలగించటానికి సహాయపడుతుంది. అలాగే ముడుతలకు కారణం అయిన స్వేచ్ఛారాశులను నిరోధిస్తుంది. అందువల్ల, గందం సహజమైన యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది.
రెండు స్పూన్ల గందం పొడి, రెండు స్పూన్ల ముల్టానా మట్టి, ఒక స్పూన్ రోజ్ వాటర్, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి మృదువైన పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ను మీ ముఖం మీద రాసి బాగా ఆరనివ్వాలి. ఈ ప్యాక్ ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. చర్మం యవన్నంగా ఉండాలంటే వారంలో రెండు సార్లు ఈ ప్యాక్ ను వేయాలి.



Click it and Unblock the Notifications