For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైపర్ పిగ్మెంటేషన్ కు పర్మనెంట్ పరిష్కార మార్గం ఉంది....

|

హైపర్ పిగ్మెంటేషన్ అనేది ఈ రోజుల్లో ఎక్కువగా కనబడుతోంది. ముఖ్యంగా వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల , ఎక్కువగా ఎండలో కూడా రేడియేషన్ ఎక్కువ అవటం వలన చాలా మంది ఈ మంగు మచ్చలతో బాధపడుతున్నారు. వీటిని పూర్తిగా పోగొట్టటం అనేది జరగని పని. కానీ మచ్చలను కొంచెం లైట్ చేసుకోవచ్చు.

ఎసెన్సియల్ ఆయిల్స్ ను అనేక బ్యూటీ ట్రిక్స్ లో ఉపయోగిస్తుంటారు. ఈ ఎసెన్సియల్ ఆయిల్స్ హైపర్ పిగ్మెంటేషన్ ను తొలగించడానికి చాలా గొప్పగా సహాయపడుతాయి . ఈ ఎసెన్సియల్ ఆయిల్స్ ను మన చర్మానికి ఉపయోగించడానికి ముందు కొన్ని నియమాలను పాటించాలి. ఖచ్చితంగా వాటిని అర్ధం చేసుకొన్నాకే వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది.

హైపర్ పిగ్మేంటేషన్ వల్ల ఇది కేవలం ముఖం మీద మాత్రమే కాదు, శరీరం మొత్తం నల్లని లేదా తెల్లని మచ్చలు ఏర్పడుతాయి. హైపర్ పిగ్మేంటేషన్ సన్ బర్న్, మొటిమలు తర్వాత, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఈ హైపర్ పిగ్మేంటేషన్ స్కిన్ ను మరింత సెన్సిటివ్ గా మార్చుతుంది.

హైపర్ పిగ్మెంటేషన్ కు కారణం ఏదైనా అయ్యుండవచ్చు, దీన్ని నయం చేసుకోవడానికి ఎసెన్సియల్ ఆయిల్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. అయితే వీటిని డైరెక్ట్ గా ఉపయోగించుకోకూడదు . వీటిని డిల్ట్ చేసి అప్లై చేయాలి. హైపర్ పిగ్మేంటేషన్ నివారించే 8 ఎసెన్షియల్ ఆయిల్స్ హైపర్ పిగ్మెంటేషన్ నివారిస్తాయి. మరి ఎలా నివారిస్తాయో....ఆ ట్రిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం.....

టీ ట్రీ ఆయిల్ :

టీ ట్రీ ఆయిల్ :

సెన్సిటివ్ స్కిన్ కల వారికి టీట్రీ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది ముఖంలో మెటిమలను నివారిస్తుంది. టీట్రీ ఆయిల్లో ఉండే బెంజాల్ పెరాక్సైడ్ గ్రేట్ గా పనిచేస్తుంది. ఈ నూనె మొటిమలతో పాటు, ముఖంలో ఇతర ఫేషియల్ స్కార్స్ ను తొలగించి, స్కిన్ టోన్ ను మరింత లైట్ గా మార్చుతుంది. ఇది ఒక్క నూనె చాలు హైపర్ పిగ్మెంటేషన్ తొలగించడానికి .

లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ :

లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ :

స్కిన్ పిగ్మెంటేషన్ నివారించడంలో లెమన్ ఎసెన్షియల్ ఆయిల్లో ఉండే లక్షణాలు చాలు స్కిన్ టోన్ ను తేలికపరుస్తుంది. మొటిమల ద్వారా వచ్చిన మచ్చలను (హైపర్ పిగ్మేంటేషన్ )ను లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ తో తగ్గించుకోవచ్చు. ఈ నూనెను నిమ్మతొక్క నుండి తయారుచేస్తారు. కాబట్టి, ఈ నూనెలో సిట్రిక్ యాసిడ్ మరియు ఆల్ఫా హైడ్రాక్సి యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది స్కిన్ టోన్ ను బ్రైట్ గా మార్చుతుంది మరియు పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది.

క్యారెట్ ఎసెన్షియల్ ఆయిల్:

క్యారెట్ ఎసెన్షియల్ ఆయిల్:

పిగ్మెంటేషన్ నివారించుకోవడానికి ఒక బెస్ట్ ఆయిల్ ఇది . ఈ ఎన్సెన్సియల్ ఆయిల్లో ఉండే బీటా కెరోటిన్ పిగ్మెంటేషన్ నివారించడానికి సహాయపడుతుంది. అందుకు ఈ నూనెలో ఉండే హిండరింగ్ ట్రైయోసినేజ్(ఇది మెలనిన్ ఎంజైమ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నూనె హైపర్ పిగ్మేంటేషన్, డార్క్ స్పాట్స్ మరియు మెలసమాను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఫ్రాకిన్ సెన్స్ ఆయిల్:

ఫ్రాకిన్ సెన్స్ ఆయిల్:

నూనెను స్కార్ ట్రీట్మెంట్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇందులో చెక్క బెరడు నుండి తీసిన ఇన్సెన్సి స్టిక్ నుండి తయారు చేస్తారు. ఈ నూనెలో పవర్ ఫుల్ యాంటీ సెప్టిక్ , ఆరోమాటిక్ మరియు నయం చేసే గుణాలు అధికంగా ఉన్నాయి. ఫ్రాకిన్ సెన్స్ ఆయిల్ డార్క్ గా మరియు డల్ గా ఉండే స్కిన్ కు ఉపయోగిస్తుంటారు . ఇది చర్మాన్ని బ్రైట్ గా మార్చుతుంది మరియు మంచి గ్లోను అందిస్తుంది.ఈ నూనెను రెగ్యులర్ గా ఉపయోగిస్తే హైపర్ పిగ్మేంటేషన్ మరియు మెటిమలు మరియు మచ్చలను తొలగిస్తుంది .

 రోజ్ ఎసెన్షియల్ ఆయిల్:

రోజ్ ఎసెన్షియల్ ఆయిల్:

పురాతన కాలం నుండి ఈ నూనెను వివిధ రకాల బ్యూటీ రెమెడీస్ లో విరివిగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆ నూనెను చర్మంలో మొటిమలు, మచ్చలు, ఎక్జిమా మరియు ఇతర చర్మ సమస్యలను నివారించుకోవడం కోసం ఈ నూనెను ముఖ్యంగా ఉపయోగిస్తున్నారు . మరియు ఇది స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది . చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. బ్రైట్ నెస్ ను అందిస్తుంది . హైపర్ పిగ్మెంటేషన్ నయం చేస్తుంది.

సాండిల్ ఉడ్ ఆయిల్:

సాండిల్ ఉడ్ ఆయిల్:

సాండిల్ ఉడ్ ఆయిల్ వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తుంటారు. ఈ నూనె వల్ల అనేక ప్రయోజనాలున్నాయి . ఇది చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది మరియు చర్మంలోని స్కార్స్ ను మరియు రాషెష్ ను మరియు చర్మం దురద , ఎరుపు మచ్చలను నయం చేస్తుంది .అలాగే మొటిమల మచ్చలను మాయం చేసి మార్క్ కనబడకుండా చేస్తుంది. చర్మ రంగును మార్చుతుంది . దాంతో స్కిన్ డ్యామేజ్ కలగకుండా ఉంటుంది . హైపర్ పిగ్మెంటేషన్ కు ఇది ఒక ఉత్తమ నూనె.

యూకలిప్టస్ ఆయిల్:

యూకలిప్టస్ ఆయిల్:

ఈ నూనెలో నయం చేసే గుణాలు ఎక్కువ. ఇది తలనొప్పి, శ్వాససంబంధిత లక్షణాలను మరియు ఇతర స్కిన్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . మరియు ఇది స్కిన్ బర్న్, ఇన్ఫ్లమేషన్, మరియు స్కిన్ ఇరిటేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది . ఇది హైపర్ పిగ్మెంటేషన్ తో పాటు డార్క్ స్పాట్స్ ను నివారిస్తుంది .ఈ నూనెకు కొద్దిగా జోజోబా ఆయిల్ మిక్స్ చేసి స్కిన్ కు అప్లై చేయాలి.

జరేనియం ఆయిల్:

జరేనియం ఆయిల్:

ఈ నూనెలో స్మూతింగ్ మిరయు బ్యాలెన్సింగ్ ఎఫెక్ట్ ను కలిగించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నూనె పీరియడ్ సమస్యలను మరియు బ్రెస్ట్ టెండర్ నెస్ ను తగ్గించడానికి సహాయపడుతుంది . అలాగే ఆ సమయంలో వచ్చే మొటిమలు, మచ్చలను ను మాయం చేసి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది . స్కిన్ పిగ్మెంటేషన్ నునివారించడంలో గ్రేట్ ఆయిల్ .

English summary

8 Essential Oils To Get Rid Of Hyperpigmentation: Beauty Tips in Telugu

Essential oils is the secret that is used in many beauty tricks. Let us check out the list of some of the essential oils that help to get rid of hyper-pigmentation in this article. There are certain rules while we use essential oils for application. Make sure you understand them before using them.
Story first published:Tuesday, October 13, 2015, 7:56 [IST]
Desktop Bottom Promotion