Latest Updates
-
కార్మిక లోకానికి పాదాభివందనం..మే డే విషెస్ ను ఇలా అందంగా చెప్పుకోండి! -
బాడీలో అవయువాలన్నీ రిపేర్ చేసే అద్భుతమైన ఆకు కూర..ఎలా వండాలో చూడండి -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు! -
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు?
నోటి చుట్టూ..కళ్ళ చుట్టూ ముడుతలతో ఇబ్బంది పడుతున్నారా...?
ముఖంలో ముడుతలు కనబడటం సహజం. కానీ, చాలా వరకూ మూతి చుట్టు మరియు కళ్ళ చుట్టు ముడుతలు ఏర్పడుతాయి. ఇలాంటి ముడుతలు వయస్సైన వారిలో కనబడటం సహజం అయితే యంగ్ గా ఉండే వారిలో కూడా కనబడటం బాధాకరం. మూతి చుట్టూ మరియు కళ్ళ చుట్టూ చాలా సెన్సిటివ్ స్కిన్ కలిగి ఉంటుంది కాబట్టి, త్వరగా ముడుతలు ఏర్పడటానికి కారణం అవుతాయి. ఈ ముడుతలు నవ్వుతున్నప్పుడు మరియు మాట్లాడుతున్నప్పుడు ఈ ముడుతలు కొట్టించినట్లు కనబడుతూ నలుగురిలో ఇబ్బంది పెడుతుంటాయి.
ముఖ్యంగా సూర్య నుండి వెలువడే యూవీ రేస్ వల్ల కూడా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ముడుతలకు కారణం అవుతుంది . ముఖ్యంగా నోటి చుట్టూ, కళ్ళ చుట్టూ ముడుతలు ఎక్కువగా కనబడుతాయి . సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా ముడుతలకు కారణం అవుతుంది. ముడుతలను నివారించుకోవడానికి కొన్ని బేసిక్ చిట్కాలను ఉపయోగించాలి. మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం, నిద్రించే ముందు ఆలివ్ ఆయిల్ మరియు బాదం ఆయిల్స్)వంటివి అప్లై చేయాలి. అలాగే బయట వెళ్లడానికి ముందు సన్ స్క్రీన్ ను అప్లై చేయడం తప్పనిసరి.
మూతి చుట్టూ ముడుతలున్నాయని బెగ్గపడాల్సిన పనిలేదు. నోటి చుట్టూ ఏర్పడ్డ ముడుతలను నివారించుకోవడానికి కొన్ని బెస్ట్ నేచురల్ హోం రెమెడీస్ ను ఈ క్రింది లిస్ట్ తెలపడం జరిగింది . ఈ నేచురల్ రెమెడీస్ చర్మంలోని షోషింపబడి, చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ముడుతలను మాయం చేయడంతో పాటు, నోటి చుట్టు, కళ్ళ చుట్టూ తగినంత మాయిశ్చరైజర్ ను, పోషణను మరియు బ్లడ్ సర్క్యులేషన్ , స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది.
మరి ముడుతలను మాయం చేసే హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం....

బొప్పాయి మరియు తేనె:
పచ్చిబొప్పాయిను తురుముకొని అందులో రెండు చెంచాల తేనె మిక్స్ చేసి ముడతలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. నోటి చుట్టూ ఉన్న ముడుతలను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . చర్మంలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. దాంతో స్కిన్ ఎలాసిటి పెరుగుతుంది.

ఎగ్ వైట్ :
ఎగ్ వైట్ లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి మరియు ఇవి స్కిన్ ఎలాసిటిని పెంచుతాయి. ముడుతల పడిన చర్మం స్ట్రెచ్ అయి యంగ్ గా కనబడుటకు సహాయపడుతుంది. ముడుతల పడ్డ చర్మానికి ఎగ్ వైట్ ను అప్లై చేసి 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కలబంద:
అవోవెర బెస్ట్ నేచురల్ మాయిశ్చరైజర్. ఇది పగిలిన పెదాలకు మాయిశ్చరైజర్ ను అందిస్తుంది . కలబంద రసాన్ని ముఖానికి రోజూ రెండు సార్లు అప్లై చేయడం ద్వారా ముఖంలో ముడుతలను మాయం చేస్తుంది. అలాగే ఫ్రెష్ అలోవెర లీవ్ జెల్స్ ను అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ ముడుతలను చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది.

పైనాపిల్ జ్యూస్:
నోటి చుట్టూ ఏర్పడిన ముడుతలను నివారించుకోడానికి పైనాపిల్ జ్యూస్ కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. పైనాపిల్ రసాన్ని అప్లై చేసి 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. పైనాపిల్లో ఉండే బ్రొమైలిన్ మరియు ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ ముడుతలు ఏర్పడకుండా చేయడంతో పాటు ఉన్న మొటిమలను మాయం చేయడంలో చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

ఆముదం:
ఆముదంను నిద్రించే ముందు నోటి చుట్టూ అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసి నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ సాప్ట్ గా మరియు సపెల్ గా తయారవుతుంది. నోటి చుట్టూ ఏర్పడ్డ ముడతలను కూడా మాయం చేస్తుంది.

కొబ్బరి నూనెతో మసాజ్:
నిద్రించే ముందు ముడుతలున్న ప్రదేశంలో కొబ్బరి నూనెను అప్లై చేసి, మరుసటి రోజు ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముడుతలను నివారించడంతో పాటు, చర్మానికి డీప్ గా మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.. పెదాల చుట్టూ, కళ్ళ చుట్టూ ఏర్పడ్డ ముడుతలను నివారిస్తుంది.

సరిపడా నీరు త్రాగాలి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్
సరిపడా నీరు త్రాగాలి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి . చర్మానికి పుల్ హైడ్రేషన్ ను అందించి ముడుతలను నివారిస్తుంది . ప్రతి రోజూ తప్పనిసరిగా 8 గ్లాసుల నీరు త్రాగాలి . మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయాలను(టమోటో, స్ట్రాబెర్రీస్, చెర్రీస్, ఆపిల్స్) రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

సన్ స్క్రీన్:
ఇంట్లో నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ అప్లై చేయాలి . సూర్యరశ్మిలోని యూవీ కిరణాలు స్కిన్ సెల్స్ ను డ్యామేజ్ చేయడం మాత్రమే కాదు. ముడుతలకు దారి తీసి, త్వరగా వయస్సైనవారిలా కనబడేలా చేస్తాయి. చర్మంను పాడు చేయడం యూవీ కిరణాలు ముఖ్య పాత్రపోషిస్తాయి . కాబట్టి బయట వెళ్లే ముందు సన్ స్క్రీన్ తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి.



Click it and Unblock the Notifications