For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్లక్రింద డార్క్ సర్కిల్స్ నివారించే అద్బుతమైన మాస్క్స్..

|

డార్క్ సర్కిల్స్, కళ్లక్రింద ఉబ్బు లేదా అలసిపోయినట్లు కనిపించే కళ్లు ఇవి ఏజ్ అయిపోయిన వారి లక్షణాలను చూపుతాయి. ఇది మొత్తం వ్యక్తి యొక్క పర్సనాలీటి మీద ప్రభావం చూపుతుంది. ఇది సైనస్ మరియు ఇన్ఫెక్షన్, స్ట్రెస్ , హెరిడిటీ, డ్రై స్కిన్ మరియు సన్ ఎక్స్ ఫ్లోజర్ , కోల్డ్ , హానికరమైన కెమికల్స్ ఉపయోగించడం, పోషకాల లోపం, నిద్రలేమి మరియు కొన్ని రకాల మందుల యొక్క దుష్ప్రభావాల వల్ల కూడా డార్క్ సర్కిల్స్ అధికంగా ఉంటాయి.

కళ్ళ క్రింద చర్మం రంగులో మార్పులు రావడం వల్ల డార్క్ సర్కిల్స్ ఏర్పడుతాయి. ఈ డార్క్ సర్కిల్స్ మరియు పఫీ ఐస్ ను తొలగించుకోవడానికి మహిళలు చేయని ప్రయత్నాలు, ఉపయోగించని హోం రెమెడీస్, వాడిన చిట్కాలంటూ లేవు. అయితే ఈ సమస్య నుండి సక్సీడ్ అయ్యారా లేదా అన్నదే సందేహం! ఖరీదైన హోం రెమెడీస్ కు ప్రత్యామ్నాయంగా చౌకైన హోం రెమెడీస్ మరియు చిట్కాలతో డార్క్ సర్కిల్స్ ను నివారించుకోవచ్చు.

కాస్మోటిక్స్ లో హానికరమైన కెమికల్స్ వినియోగించడం వల్ల కళ్ళ క్రింది చాలా సున్నితమైన ప్రదేశాన్ని డ్యామేజ్ చేస్తాయి. అందువల్ల, ఎప్పుడూ నేచురల్ పద్దతులకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది.

పఫీ ఐస్ మరియు డార్క్ సర్కిల్స్ ను తొలగించడంలో ఫేస్ మాస్క్ లు గ్రేట్ గా సహాయపడుతాయి . కంటి క్రింది భాగంలో చర్మం చాలా సెన్సిటివ్ గా ఉండటం వల్ల సరైనా...హాని కలిగించని మాస్కులను ఎంపిక చేసుకోవాలి.

అలాంటి హెల్తీ అండ్ కేర్ ఫుల్ మాస్క్ లను కొన్నింటిని లిస్ట్ అవుట్ చేసి ఈ క్రింది తెలపడం జరిగింది . ఈ క్రింది హోం మేడ్ పద్దతు వల్ల కంటి క్రింది భాగంలో డార్క్ సర్కిల్స్ ను నివారించుకోవచ్చు. మరి ఐ మాస్కులేంటో తెలుసుకుందాం...

1.ఓట్ మీల్:

1.ఓట్ మీల్:

ఓట్ మీల్ మాస్క్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కళ్ల క్రింద డార్క్ సర్కిల్స్ ను బ్రైట్ గా మార్చేస్తుంది. ఇది కళ్లకు చల్లని మరియు స్మూతింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది. ఓట్ మీల్లో కొద్దిగా పెరుగు మిక్స్ చేయాలి. ఈ మిశ్రమం యొక్క మాస్క్ ను కళ్ల క్రింది మాస్క్ లా అప్లై చేసి 15నిముషాలు ఆరే వరకూ ఉండి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

2.గ్రీన్ టీ:

2.గ్రీన్ టీ:

అలసట మరియు పఫీ ఐస్ ను నివారించే కళ్ళకు రిఫ్రెష్ నెస్ తీసుకొచ్చే బెస్ట్ రెమెడీ గ్రీన్ టీ . టీ బ్యాగ్స్ లో కెఫిన్ ఉంటుంది. ఇది బ్లడ్ వెజల్స్ ను ష్రింక్ చేస్తుంది మరియు కళ్ళ ఉబ్బును తగ్గిస్తుంది . ఆల్రెడీ ఉపయోగించిన టీ బ్యాగ్స్ ను చల్లటి నీటిలో డిప్ చేసి, వాటిని నేరుగా కళ్ల మీద నేరుగా అప్లై చేయాలి. తర్వాత 10-15నిముషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

3.నిమ్మరసం:

3.నిమ్మరసం:

నిమ్మరసంలో ఉండే అసిడిక్ లక్షనాలు కళ్ళ క్రింది ఉబ్బును మరియు డార్క్ సర్కిల్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కొద్దిగా నిమ్మరసంలో కాటన్ బాల్స్ డిప్ చేసి కళ్ల మీద అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 15 నిముషాలు అలాగే ఉండి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్రొసెస్ తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్ పెరుగుతుంది.

4.పార్ల్సే:

4.పార్ల్సే:

పార్ల్సే మాస్క్ ను కళ్ళ క్రింద అప్లై చేయడం వల్ల కళ్ళ క్రింద ఉబ్బు మరియు డార్క్ సర్కిల్స్ తొలగించుకోవచ్చు . ఇది స్కిన్ లైటనింగ్ ప్రొసెస్ ను తగ్గిస్తుంది. కళ్ళ క్రింద డిస్ కలర్ ను తగ్గిస్తుంది. అదే విధంగా కళ్ళ క్రింద చర్మకణాలకు పోషణనను అందిస్తుంది. మరింత ఉత్తమ ఫలితం కోసం తేనెను ఉపయోగించువచ్చు.

5.బాదం ఆయిల్:

5.బాదం ఆయిల్:

బాదం ఆయిల్ చర్మానికి బెస్ట్ హైడ్రేషన్ గా పనిచేస్తుంది. బాదం ఆయిల్ ను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ నివారించబడుతాయి . మరియు డార్క్ సర్కిల్స్ లైట్ షేడ్ అయ్యి, నిధానంగా నివారించబడుతాయి . బాదం ఆయిల్ ను తేనెతో పాటు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

6.పొటాటో మాస్క్:

6.పొటాటో మాస్క్:

పొటాటో మాస్క్ మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ . ఇది పఫ్పీ నెస్ మరియు డార్కిల్స్ ను నివారిస్తుంది . ఇది కళ్ల క్రింద లైట్ గా మార్చి డార్క్ కలర్ ను మాయం చేస్తుంది. మరియు ఇది వాటర్ రిటెన్షన్ తగ్గిస్తుంది. పొటాటో మరియు కీరదోసకాయ జ్యూస్ ను సమంగా మిక్స్ చేసి కళ్ల క్రింద అప్లై చేయాలి. కొద్ది సమయం అప్లై చేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

7.పైనాపిల్:

7.పైనాపిల్:

డార్క్ సర్కిల్స్ నివారించడంలో పైనాపిల్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . పైనాపిల్ జ్యూస్ ను టర్మరిక్ పౌడర్ తో మిక్స్ చేసి , కళ్ల క్రింద అప్లై చేయాలి. దీన్ని ఒక గంట అలాగే ఉంచి తర్వాత కడిగేసుకోవాలి . ఈ చిట్కాను కొద్ది రోజులు అనుసరిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Amazing Masks To Brighten Under Eyes..

Dark circles, tired eyes or puffy eyes tend to give you an aged appearance. It affects the overall appearance of a person. It can be caused by sinus infections, stress, heredity, ageing, dry skin, exposure to the sun, cold, usage of harsh chemicals, lack of nutrition, sleep deprivation and certain medications.
Story first published: Wednesday, December 23, 2015, 14:27 [IST]
Desktop Bottom Promotion