Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అరటి తొక్కలో ఆశ్చర్యం కలిగించే బ్యూటీ బెనిఫిట్స్
అరటిపండ్లులోని ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అరటిలో అద్భుతమైన కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినిరల్స్, పొటాసియం మరియు మెగ్నీషియం ఉన్నాయి. అరటిపండులోనే కాదు, అరటి తొక్కలో కూడా ఇవి ఎక్కువే. అరటి తొక్కలో ఉండే అనేక బ్యూటిబెనిఫిట్స్ గురించి తెలుసుకోవాలంటే..ఈ ఆర్టికల్ చదవాల్సిందే..
అరటితోక్కతో చర్మం మీద రుద్దడం వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది . అరటిపండు గుజ్జుకంటే, అరటి తొక్కలో ప్రయోజనాలు ఎక్కువ. అరటి తొక్క, స్వచ్చమైన చర్మ సౌందర్యం పొందడానికి మరియు మచ్చలు మొటిమలు మాయం చేయడానికి మరియు వృద్యాప్యఛాయలను నివారించడానికి ఇది చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.READ MORE: తొక్కే కదా అని పారేయకు,అందులోని లాభాలు చూడు
చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవడానికి అరటి తొక్కను ఏవిధంగా ఉపయోగించుకోవాలి? అన్న విషయాన్ని మీకు కొన్ని చిట్కాల రూపంలో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుపడం జరిగింది.

అరటితొక్కలో ఆశ్చర్యం కలిగించే సౌందర్యగుణాలు
ముడుతలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది: అరటి తొక్క మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చర్మానికి కావల్సిన పోషణను అందిస్తుంది. అరటి తొక్కను మ్యాష్ చేసి అందులో గుడ్డు పచ్చసొన వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత శుభ్రం చేసేసుకోవాలి . ఈ ప్యాక్ ముడుతలను మరియు వృద్దాప్య ఛాయలను నివారిస్తుంది.

అరటితొక్కలో ఆశ్చర్యం కలిగించే సౌందర్యగుణాలు
మొటమలు మరియు మచ్చలు: మొటిమలను మచ్చలున్నప్పుడు అరటి తొక్కతో ముఖం మీద సున్నితమైన మసాజ్ చేయడం వల్ల . అరటితొక్కలో ఉండే ఎంజైమ్స్ మొటిమలు మరియు ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. అరటి తొక్క వల్ల ఇది ఒక ఉత్తమ స్కిన్ బెనిఫిట్.

అరటితొక్కలో ఆశ్చర్యం కలిగించే సౌందర్యగుణాలు
హానికరమైన సూర్య రశ్మి నుండి రక్షణ కల్పిస్తుంది: అరటి తొక్క లోపలి వైపు నుండి ముఖం మీద 10నిముషాల పాటు మసాజ్ చేయాలి . తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీన్ని సూర్య రశ్మిలోకి పోవడానికి ముందే చేయాలి. సూర్య రశ్మినుండి రక్షణ కల్పించడంలో ఇది గ్రేట్ గా సమాయపడుతుంది.

అరటితొక్కలో ఆశ్చర్యం కలిగించే సౌందర్యగుణాలు
చర్మ కాంతివంతం అవుతుంది: అరటి తొక్క లోపలి బాగంతో ముఖం మీద మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రెగ్యులర్ గా చేస్తుంటే మీ చర్మాన్ని మరింత బెటర్ గా మరియు ఫెయిర్ గా మార్చుతుంది. అరటి తొక్క వల్ల ఇది ఒక ఉత్తమ ప్రయోజనం.

అరటితొక్కలో ఆశ్చర్యం కలిగించే సౌందర్యగుణాలు
కళ్ళ ఉబ్బును తగ్గిస్తుంది: అరటి తొక్క లోపలి వైపు నుండి కళ్ళమీద సున్నితమైన మసాజ్ ఇవ్వడం వల్ల . ఇది మీ కళ్ళను ప్రశాతంగా మార్చుతుంది మరియు కళ్ళ క్రింది ఉబ్బును తగ్గిస్తుంది.

అరటితొక్కలో ఆశ్చర్యం కలిగించే సౌందర్యగుణాలు
దంతాలు తెల్లగా మార్చుతుంది: అరటితొక్క లోపలి వైపు నుండి దంతాలను రుద్దాలి. కొన్ని నిముషాలు క్రమం తప్పకుండా ఇలా చేస్తుంటే దంతాలు తెల్లగా మిళమిళ మెరుస్తుంటాయి.

అరటితొక్కలో ఆశ్చర్యం కలిగించే సౌందర్యగుణాలు
స్కిన్ వ్రాట్స్ : అరటి తొక్క లోపలి వైపు నుండి స్కిన్ వ్రాట్స్ (పులిపిర్ల)మీద అప్లై చేసి రుద్దాలి. ఇలా రాత్రి పడుకొనే ముందు రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. పులిపిర్లను నివారించడంతో పాటు అవి రాకుండా కాపాడుతుంది.

అరటితొక్కలో ఆశ్చర్యం కలిగించే సౌందర్యగుణాలు
చర్మ మీద దద్దుర్లు మరియు దురద: స్కిన్ రాషెష్ మరియు దురద ఉన్నటువంటి ప్రదేశంలో అరటితొక్కతో మసాజ్ చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఇంకా చర్మ సమస్యలైన పోరియోసిస్ మరియు ఇతర చర్మ సమస్యలను నివారిస్తుంది .

అరటితొక్కలో ఆశ్చర్యం కలిగించే సౌందర్యగుణాలు
ఆయిల్ స్కిన్ నివారిస్తుంది: అరటితొక్కను మెత్గా చేసి, అందులో నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ఆయిల్ స్కిన్ మీద అప్లై చేయాలి. ఈ మాస్క్ ముఖంలోని అదనపు నూనెను గ్రహిస్తాయి మరియు మీ చర్మంను ఫ్రెష్ గా మార్చుతాయి . అరటి తొక్క మొటిమలు మరియు మచ్చలు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

అరటితొక్కలో ఆశ్చర్యం కలిగించే సౌందర్యగుణాలు
స్కిన్ మాయిశ్చరైజర్: అరటి తొక్కను మీ ముఖం మీద నిధానంగా రుద్దడం వల్ల మీ చర్మానికి తగినంత హైడ్రేషన్ అందిస్తుంది. ఇది చర్మంలోకి చొచ్చుకొని పోతుంది . చర్మంను బిగుతుగా చేస్తుంది. స్కిన్ ఇరిటేషన్ మరియు డ్రై నెస్ తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications