For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చౌకైన గ్లిజరిన్ తో ఎఫెక్టివ్ బ్యూటి బెనిఫిట్స్

|

సౌందర్యం విషయంలో చాలా మందిలో ఒక అపోహ ఉంది. అదేంటంటే ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అందాన్ని మరియు చర్మసౌందర్యాన్ని మెరుగుపరుస్తుందని నమ్ముతారు . అయితే ఒక నేచరల్ ప్రొడక్ట్ అయినటువంటి గ్లిజరిన్ ఒక మ్యాజిలకల్ హీలింగ్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. సహజ చర్మ సంరక్షణలో గ్లిజరిన్ అద్భుతంగా పనిచేస్తుంది. చర్మ సమస్యలకు ఉత్తమమైన నివారినిగా పనిచేస్తుంది గ్లిజరిన్. చర్మ సంరక్షణలో గ్లిజరిన్ మాయిశ్చరైజర్ గా అద్భుతంగా పనిచేస్తుంది. గ్లిజరిన్ ను చాలా కాస్మోటిక్స్ లో వినియోగిస్తారు. మరియు చర్మ సమస్యలకు వినియోగించే మెడిసినల్ ప్రొడక్ట్స్ లోనూ గ్టిజరిన్ ను విరివిగా ఉపయోగిస్తున్నారు.

పెట్రోలియం నుండి గ్రహించే ఒక నేచురల్ ప్రొడక్ట్స్ గ్లిజరిన్ . ఇది చిక్కగా ఉంటుంది. స్వీట్ టేస్ట్ కలిగి ఉంటుంది. ఇది చౌకైన ఒక బ్యూటి ప్రొడక్ట్ మరియు ఇది చాలా సులభంగా అందుబాటులో ఉండే ఒక మాయిశ్చరైజింగ్ ప్రొడక్ట్. అంతే కాదు ఇది క్లెన్సింగ్, టోనింగ్ మరియు చర్మంలో ముడుతలను నివారిస్తుంది.

READ MORE: చేతులు మరియు కాళ్ళు నేచురల్ గా ఫెయిర్ గా మార్చే 18 హోం రెమెడీస్

గ్లిజరిన్ మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మరియు ఇది స్కిన్ కంప్లెక్షన్ ను మెరుగుపరుస్తుంది మరియు దీన్ని సన్ స్క్రీన్ లోషన్ గాను ఉపయోగిస్తుంటారు. అదే విధంగా ఇది స్కార్స్ మరియు మొటిమల యొక్క మచ్చలను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. READ MORE:చర్మ సంరక్షణలో గ్లిజరిన్ ఫేస్ మాస్క్ తో అత్యద్భుతమైన మార్పు...

అంతే కాదు గ్లిజరిన్ వల్ల మరికొన్ని బ్యూటీ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా...

ముడతలను నివారిస్తుంది:

ముడతలను నివారిస్తుంది:

ముడుతలను నివారిస్తుంది. ఒక చెంచా గ్లిజరిన్ లో ఒక చెంచా తేనె మరియు ఎగ్ వైట్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. సర్కులర్ మోషన్ లో అప్లై చేసి శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది:

స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది:

1/4కప్పు గ్లిజరిన్ లో ఒక కప్పు రోజ్ వాటర్ మిక్స్ చేసి, దీన్ని స్ప్రే బాటిల్లో పోసి, ఈ మిశ్రామిన్ని ముఖం మీద స్ప్రే చేయాలి. కొద్ది సేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంది ముఖం కాంతివంతంగా మరియు సాప్ట్ గా మారుతుంది.

మాయిశ్చరైజింగ్ స్కిన్:

మాయిశ్చరైజింగ్ స్కిన్:

గ్లిజరిన్ చర్మంలోకి షోషింపబడుతుంది. కాబట్టి, గ్లిజరిన్ ను ముఖానికి అప్లై చేసినప్పుడు ఇది చర్మంలో కోల్పోయిన తేమను తిరిగి పొందుతుంది. స్కిన్ కండీషన్ మెరుగుపడుతుంది.

క్లెన్సర్:

క్లెన్సర్:

ఒక చెంచా గ్లిసరిన్ కు ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. మిల్కీగా కనిపించే ఈ ద్రవాన్ని కాటన్ బాల్స్ తో అప్లై చేసి తొలగించాలి. ఇది చర్మంలోని అన్ని రకాల మలినాలను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

మొటిమలను నివారిస్తుంది:

మొటిమలను నివారిస్తుంది:

ఒక చెంచా బోరిక్ యాసిడ్ పౌడర్ లో అరచెంచా గ్లిజరిన్ మిక్స్ చేసి అందులో ఒక చెంచా కర్పూరం పౌడర్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15-20నిముషాలు తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బ్లాక్ హెడ్స్ నివారిస్తుంది:

బ్లాక్ హెడ్స్ నివారిస్తుంది:

ఒక చెంచా గ్లిజరిన్ మరియు ఒక చెంచా బాదం పౌడర్ మరియు ఒక చెంచా ఫుల్లర్స్ ఎర్త్ ను పేస్ట్ లా చేసి ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

లిప్ మాయిశ్చరైజర్:

లిప్ మాయిశ్చరైజర్:

పెదాలకు గ్లిజరిన్ అప్లై చేయడం వల్ల ఇది పెదాలను సాఫ్ట్ గా మరియు తేమగా ఉంచుతుంది. కాబట్టి నిద్రించే ముందు గ్లిజరిన్ ను పెదాలకు అప్లై చేసి పడుకోవడం వల్ల పెదాలు సాఫ్ట్ గా మరియు తేమగా మార్పు చెందుతాయి.

హెయిర్ కండీషనర్:

హెయిర్ కండీషనర్:

గ్లిజరిన్ ను హెయిర్ కు హెయిర్ కండీషనర్ గా అప్లై చేయడం వల్ల ఇది జుట్టు సాప్ట్ గా మరియు ఒత్తుగా కనబడుతుంది.

English summary

Beauty Benefits Of Glycerin in Telugu

Beauty Benefits Of Glycerin in Telugu. Glycerin is an ultimate solution for acne and blackheads. It will also lighten your complexion and can be used as a sunscreen. Glycerin helps to remove spots and pimple scars as well. Let's have a look at some unknown beauty uses of glycerin.
Desktop Bottom Promotion