For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెప్పర్ మింట్ ఆయిల్లో అమేజింగ్ బ్యూటీ బెనిఫిట్స్

|

పెప్పర్ మింట్ నూనె అన్ని ముఖ్యమైన నూనెలన్నింటిలో ఎంతో వైవిధ్యమున్న, అత్యంత ఉపయోగకరమైన ఒక నూనె. దీనిలో విటమిన్ ఏ, సి; మాంగనీసు, ఇనుము, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్, పొటాషియం, రాగి వంటి ఖనిజాలు ఉన్నాయి. దీనిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నాయి.

మౌత్ ఫ్రెషనర్ గామరియు నోటి దుర్వాసనను పోగొట్టడానికి మన దగ్గర పెప్పర్ మింట్(పుదీనా) లీవ్స్ ఉన్నాయి. పెప్పర్ మింట్ లీవ్స్ లో స్కిన్ మరియు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అతి తక్కువ మంది మాత్రమే తెలుసు.

పెప్పర్ మింట్ టీ లో గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

పెప్పర్ మింట్ ఆయిల్లో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీమైక్రోబైల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఒక్క మౌత్ ఆడర్(నోటి దుర్వాసనను) పోగొట్టడమే కాదు జీర్ణక్రియ సమస్యలను మరియు తలనొప్పి నివారనకు అద్భుతంగా పనిచేస్తుంది. మెంతోల్లో పెప్పర్ మింట్ ఉండటం వల్లనే హెల్త్ మరియు స్కిన్ బెనిఫిట్స్ ను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు మెంతోల్ ను ఉపయోగించడం వల్ల కోల్డ్ ను నివారిస్తుంది. అంతే కాదు చర్మ మరియు కేశ సంరక్షణకు బాగా సహాయపడుతుంది. మరి చర్మ రక్షణకు పెప్పర్ మింట్ ఆయిల్ ఏవిధంగా ఉపయోగపడుతుంది. చర్మానికి ఎలా ఉపయోగించాలో ఒకసారి చూద్దాం...

ఆయిల్ స్కిన్ నివారణకు:

ఆయిల్ స్కిన్ నివారణకు:

పెప్పర్ మింట్ (పుదీనా ఆకుల్ని)పూర్వకాలం నుండినే ఉపయోగంలో ఉంది. ఇది ఆయిల్ స్కిన్ మరియు జీడ్డు చర్మానికి మంచి రక్షణ కల్పిస్తుంది. పెప్పర్ మెంట్ ఆయిల్లోని మెంథోల్ సెబాసియస్ గ్రంథుల నుండి ఆయిల్ సెక్రేసన్ ను తగ్గిస్తుంది . దాంతో ఆయిల్ ఫ్రీ చర్మాన్ని నేచురల్ గా పొందడానికి సహాయపడుతుంది.

స్కిన్ ఇరిటేషన్ ను తగ్గిస్తుంది:

స్కిన్ ఇరిటేషన్ ను తగ్గిస్తుంది:

పెప్పర్ మెంట్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల ఇది ఒక మంచి స్కిన్ బెనిఫిట్ పొందగలరు. పెప్పర్ మింట్ ఆయిల్ ముఖానికి అప్లై చేయడం వల్ల మిమ్మల్ని ఇరిటేషన్ కలిగిస్తున్న చర్మం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా పెప్పర్ మింట్ లీవ్స్ లో శాంత పరిచే లేదా చల్లబరిచే లక్షణాలు ఎక్కువగా ఉన్నందువల్ల స్కిన్ ఇన్ ఫ్లమేషన్, స్కిన్ బర్న్, మరియు స్కిన్ రాషెస్ ను తగ్గిస్తుంది. ఇంకా పెప్పర్ మింట్ ఆకలను తాజావి పేస్ట్ చేసి అందులో తేనె కలుపుకొని అప్లై చేయడం వల్ల మంచి ఫలితాను పొందవచ్చు. తేనెలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు మరియు యాంటీఆక్సిడెంట్స్ చిరాకు కలిగించే చర్మ రణకు చాలా మంచిది.

మొటిమల నివారణకు:

మొటిమల నివారణకు:

పెప్పర్ మింట్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల మరో ప్రధానమైన స్కిన్ బెనిఫిట్ ఏంటంటే మొటిమల నివారణకు బాగా సహాయపడుతుంది. మెంథోల్ చల్లదనాన్ని కలిగించడం మాత్రమే కాదు మొటిమలు మరియు మచ్చల నివారణకు బాగా సహాయపడుతుంది.

సన్ టాన్ తో పోరాడుతుంది:

సన్ టాన్ తో పోరాడుతుంది:

పెప్పెర్ మింట్ ఆయిల్లో విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. విటమిన్స్ మాత్రమే కాకుండా చర్మ రక్షణకు ఉపయోగపడే ఫొల్లెట్ మరియు ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. చర్మానికి చల్లదనాన్ని కలిగించడమే కాకుండా సన్ రిలేటెడ్ స్కిన్ ప్రాబ్లెమ్స్ ను (సన్ టాన్ మరియు సన్ బర్న్)వంటి సమస్యలను నుండి రక్షణ కల్పించబడుతుంది. కాబట్టి మీ ఆయిల్ మరియు డల్ స్కిన్ నుండి రక్షణ పొందడానికి పెప్పర్ మింట్ ఆయిల్ మరియు పెప్పెర్ మింట్ లీవ్స్ ను ఉపయోగించడం మొదలు పెట్టండి. పెప్పర్ మెంట్ ఆకులను పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి మంచి ఫలితాలను పొందవచ్చు.

టోపికల్ క్రీమ్స్:

టోపికల్ క్రీమ్స్:

పెప్పర్ మింట్ ఆయిల్ ను వివిధ రకాల టోపికల్ క్రీముల్లో ఉపయోగిస్తున్నారు. ఇవి వివిద రకాల స్కిన్ సమస్యలను నివారించడంలో కావల్సిన ఔషధగుణాలు పెప్పర్ మింట్ ఆయిల్లో పుష్కలంగా ఉన్నాయి. స్కిన్ రాషెస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

స్కిన్ పిహెచ్ లెవల్స్ పెంచుతుంది :

స్కిన్ పిహెచ్ లెవల్స్ పెంచుతుంది :

పెప్పర్ మింట్ ఆయిల్ ను రెగ్యులర్ గా స్కిన్ కు అప్లై చేయడం వల్ల స్కిన్ లో పిహెచ్ లెవల్స్ ను బ్యాలెప్స్ చేస్తుంది. ఎక్సెస్ ఆయిల్ ను నివారిస్తుంది. దాంతో ముఖంలో మొటిమలు ఏర్పడవు. ఆస్ట్రిజెంట్, యాంటీసెప్టిక్ మరియు ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది.

ఫేషియల్ స్ర్కబ్ర్:

ఫేషియల్ స్ర్కబ్ర్:

పెప్పర్ మింట్ ఆియల్ ను ఒక చెంచా, ఆలివ్ ఆయిల్ 3 చెంచడాలు, టేబుల్ సాల్ట్ మిక్స్ చేసి రెగ్యులర్ స్ర్కబ్ గా ఉపయోగించుకోవచ్చు. ఇది స్కిన్ ను కూల్ చేస్తుంది .

టోనర్ గా పనిచేస్తుంది:

టోనర్ గా పనిచేస్తుంది:

పెప్పర్ మింట్ ఆయిల్ ను స్కిన్ టోనర్ గా ఉపయోగించుకోవచ్చు . మింట్ ఆయిల్లో కొద్దిగా వెనిగర్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి స్క్రబ్ చేయడం వల్ల టోనర్ గా పనిచేస్తుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

పెప్పర్ మింట్ ఆయిల్లో స్టిములేటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది తలమాడులోకి డీప్ గా చొచ్చుకొని పోయి హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది . తలలో బ్లడ్ సర్కులేషన్ మెరగుపరిచి, హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మార్చుతుంది.

English summary

Beauty Benefits Of Peppermint Oil

Beauty Benefits Of Peppermint Oil,There are various benefits of essential oils, specially when it comes to skin care. In this article, we are here to share some of the beauty benefits of peppermint oil. This oil is also known as "pudina ka tel" in Hindi.
Story first published: Wednesday, December 9, 2015, 18:06 [IST]
Desktop Bottom Promotion