For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుమ్మడిలో ఉన్నాయి ఆశ్చర్యం కలిగించే సౌందర్య రహస్యాలు

|

గుమ్మడి కాయే ఆంగ్లంలో ‘పంప్కిన్'అని అంటారు. దీని శాస్త్రీయ నామము "cucurbita pepo లేదా cucuebita mixta " , ఇది ప్రపంచము లో అన్ని దేశాలలో దొరుకు తుంది . గుమ్మడిలో అద్భుత ఔషధాలున్నాయి. గుమ్మడి కాయను మన ఇండియాలో సంప్రదాయక వంటకాలలో దీనికి మంచి స్థానమే ఉంది. ఇందులోని పదార్థాలు వివిధ రోగాలను నివారించే ఔషధగుణాలు కలిగి ఉండడం విశేషం. మలబద్ధకం మొదలుకుని మధుమేహం వరకూ అనేక విధాలుగా ఉపయోగపడే గుమ్మడి నిజంగా గమ్మత్తైనదే. చైనాలో చక్కెర వ్యాధి వలన సంక్రమించే సమస్యల పరిష్కారానికి తయారు చేసే మందుల్లో గుమ్మడిని వాడుతున్నారు.

ముఖ్యంగా గుమ్మడికాయలో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్, క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్స్, పొటాషియం, ఫాస్పరస్, మరియు విటమిన్స్ విటమిన్ ఎ, బి1,సి, డి మరియు బి 12వంటి ప్రధానమైన విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. మరియు ఇందులో ఫ్లెవనాయిడ్స్ మరియు కెరోటినాయిడ్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి.

ఆరోగ్యనాకి మాత్రమే కాదు కాదు, ఇందులో అనేక బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చర్మ మరియు కేశ సౌందర్యానికి సహాయపడే గుణగణాలు గుమ్మడి లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మ సమస్యలకు బాగా సహాయపడుతాయి. అన్ని రకాల చర్మ సమస్యలను నేచురల్ గా క్యూర్ చేస్తుంది. ఇది డ్రై మరియు ఆయిల్ స్కిన్ అన్ని రకాల చర్మ తత్వాలకు సహాయపడుతుంది.READ MORE:గుమ్మడి గింజలు తింటే జీవితకాలం పెరుగుతుందట!

చర్మంను హెల్తీగా మరియు ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడుతుంది. ఇది సన్ రాషెస్ ను మరియు స్కిన్ అలర్జీలను నివారిస్తుంది. గుమ్మడిలో ఉండే విటమిన్ ఇ చర్మంను సాఫ్ట్ గా మార్చడంతో పాటు పోషణను అందిస్తుంది.

గుమ్మడికాయ రసం చర్మానికి మంచిదా? ఈ రోజు బోల్డ్ స్కై కొన్ని బ్యూటీ బెనిఫిట్స్ ను మీతో పంచుకుంటున్నది. మరి చర్మానికి దీని వల్ల కలిగే లాభనష్టాలేంటో ఒక సారి చూద్దాం...

గుమ్మడిలోని కేశ మరియు చర్మ సౌందర్య రహస్యాలు

గుమ్మడిలోని కేశ మరియు చర్మ సౌందర్య రహస్యాలు

రేడియంట్ సాప్ట్ స్కిన్: గుమ్మడికాయలో ఉండే విటమిన్ సి మరియు ఇ లు రెండూ చర్మంను కాంతివంతంగా మరియు ప్రకాశవంతంగా మార్చుతుంది . గుమ్మడికాయ రసాన్ని ముఖానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. గుమ్మడి రసాన్ని కూడా నేరుగా త్రాగవచ్చు.

గుమ్మడిలోని కేశ మరియు చర్మ సౌందర్య రహస్యాలు

గుమ్మడిలోని కేశ మరియు చర్మ సౌందర్య రహస్యాలు

స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది : ఏవైనా కీటకాలు కుట్టినా మంటను నివారిస్తుంది.మరియు కాలిన గాయాలను మాన్పుతుంది . ఇన్ఫెక్షన్ మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది . గుమ్మడిలో ఉండే జింక్ మరియు విటమిన్ సి గాయాలను మాన్పుతుంది . గాయాలైన ప్రదేశంలో గుమ్మడి జ్యూస్ ను అప్లై చేయాలి. లేదా నేరుగా త్రాగవచ్చు.

గుమ్మడిలోని కేశ మరియు చర్మ సౌందర్య రహస్యాలు

గుమ్మడిలోని కేశ మరియు చర్మ సౌందర్య రహస్యాలు

ముడుతలను నివారిస్తుంది మరియు హైడ్రేషన్ అందిస్తుంది. గుమ్మడి జ్యూస్ లో కొద్దిగా తేనె, విటమిన్ ఇ ఆయిల్, పెరుగు మరియు నిమ్మరసం మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇది చర్మంను టైట్ చేస్తుంది మరియు ముడుతలను నివారిస్తుంది మరియు స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది . ముడుతలను నివారించడంలో ఒక గొప్ప ప్రయోజనం.

గుమ్మడిలోని కేశ మరియు చర్మ సౌందర్య రహస్యాలు

గుమ్మడిలోని కేశ మరియు చర్మ సౌందర్య రహస్యాలు

పిగ్మెంటేషన్ నివారిస్తుంది : గుమ్మడి జ్యూస్ లో క్యాల్షియం, ప్రోటన్స్, పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఇది చర్మంలో మచ్చలను, పిగ్మెంటేషన్ మరియు ఇతర సమస్యలను నివారిస్తుంది. చర్మంను తేలికపరిచి మచ్చలు లేకుండా చేస్తుంది. గుమ్మడి జ్యూస్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.

గుమ్మడిలోని కేశ మరియు చర్మ సౌందర్య రహస్యాలు

గుమ్మడిలోని కేశ మరియు చర్మ సౌందర్య రహస్యాలు

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది: గుమ్మడిలో విటమిన్ ఎ మరియు పొటాసియం అధికంగా ఉంటుంది . అందువల్ల ఇది జుట్టు పెరుగుదల ప్రోత్సహిస్తుంది. మీ గుమ్మడికాయ రసాన్ని తలకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

గుమ్మడిలోని కేశ మరియు చర్మ సౌందర్య రహస్యాలు

గుమ్మడిలోని కేశ మరియు చర్మ సౌందర్య రహస్యాలు

డ్రై మరియు డ్యామేజ్ జుట్టుకు మాయిశ్చరైజ్ చేస్తుంది: మీరు గుమ్మడికాయను హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది. అందుకు గుమ్మడి రసంలో తేనె, కొబ్బరినూనె మరియు పెరుగు మిక్స్ చేసి ఈ పేస్ట్ ను తలకు పట్టించాలి . అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. జుట్టుపెరుగుదలకు ఇది ఒక ఉత్తమ చిట్కా.

గుమ్మడిలోని కేశ మరియు చర్మ సౌందర్య రహస్యాలు

గుమ్మడిలోని కేశ మరియు చర్మ సౌందర్య రహస్యాలు

చుండ్రును నివారిస్తుంది: గుమ్మడికాయలో విటమిన్ సి మరియు ప్రోటీనులు అధికంగా ఉంటాయి . ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది. మరియు చుండ్రుకు కారణం అయ్యే ఇన్ఫెక్షన్స్ ను అరికడుతుంది . తలలో డ్రైనెస్ వల్ల చుండ్రు ఏర్పడకుండా తలకు తగినంత మాయిశ్చరైజర్ ను అందిస్తుంది . గుమ్మడి రసాన్ని పెరుగులో మిక్స్ చేసి తలకు పట్టించి 15నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

Story first published: Thursday, April 2, 2015, 12:35 [IST]
Desktop Bottom Promotion