For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాల్ నట్ ఆయిల్ లోని అమేజింగ్ బ్యూటి బెనిఫిట్స్

|

వాల్ నట్(walnut) ని తెలుగు లో అక్రూట్ కాయ గింజలు అంటాము. వాల్ నట్స్ లో గొప్పగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. వీటిని అతి ప్రాచీనమైన కాలం నుండి ఈ గింజలను వినిగిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా మనం వాల్ నట్ ఆయిల్ ను చర్మం మరియు జుట్టు మరియు ఆరోగ్యానికి వినిగిస్తున్నాము.

కానీ మీరెవరైనా వాల్ నట్ ఆయిల్ ను చర్మ సంరక్షణకు ఉపయోగించారా? ఇప్పటి వరకూ వాల్ నట్ ఒక స్నాక్ ఐటమ్ గానే మీరు తింటుండవచ్చు. అయితే వాల్ నట్స్ నుండి తయారుచేసే ఆయిల్ ఒక బ్యూటీ ఫ్రొడక్ట్స్ అన్న విషయం తెలుసుకోవడానికి ఇది మీకు ఒక బెస్ట్ టైమ్.

ఎందుకంటే ఈ వాల్ నట్ ఆయిల్ ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అదెలా అంటే, వాట్ నట్ ఆయిల్లో అనేక న్యూట్రీషియన్స్ ఉన్నాయి. ఇంకా అందాన్నిపెంచడం సహాయపడే విటమిన్ ఇ, విటమిన్ బి 1,2,3,6 మరియు ఇ, మినరల్స్ అయిన కాపర్, జింక్, కాల్షియం, మేంగనీస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి.

READ MORE:వాల్ నట్స్ ప్రతి రోజూ తినడానికి గల విలువైన కారణాలు

వాల్ నట్స్ లో ఎన్ని ఆరోగ్యకరమైన లాభాలున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల ఇందులో అనేక స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయన్న విషయం కూడా తెలుసుకోవాలి. అంతే కాదు, చర్మం ప్రకాశవంతంగా మార్చుతుంది. మరి దీని వల్ల చర్మం మరియు జుట్టు పొందే అనేక ప్రయోజనాలను ఈ క్రింది విధంగా తెలుసుకుందాం...

మాయిశ్చరైజర్:

మాయిశ్చరైజర్:

వాల్ నట్ ఆయిల్ ను చర్మానికి అప్లై చేసినప్పుడు, ఇది మాయిశ్చరైజ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. మీరు డ్రై స్కిన్ తో బాధపడుతున్నట్లైతే, వాట్ నట్ ఆయిల్ ఉపయోగించే సమయం వచ్చిందని గ్రహించాలి . ఈ నూనె చర్మంలోనికి షోషింపబడి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది . ముఖ్యంగా చేతులు, మోచేతులు కు అప్లై చేసుకుంటే మంచి ప్రయోజన పొందుతారు.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

వాల్ నట్ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులో అధిక పొటాషియం ఉన్నందున ప్రతి రోజూ తలస్నానానికి ముందు తలకు పట్టించి మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ సెల్స్ రీజనరేషన్ మరియు హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది.

ముడుతలను నివారిస్తుంది:

ముడుతలను నివారిస్తుంది:

వాల్ నట్ ఆయిల్ ముడుతలను నివారించడంలో వాటితో పోరాడటంలో అద్భుతంగా సహాయపడుతుంది . ఇది గ్రీజీ టెక్చర్ ను కలిగి ఉంటుంది. కానీ దీన్ని రెగ్యులర్ గా చర్మానికి అప్లై చేస్తే, చర్మంలో చారలను, రూపు మార్పుతుంది మరియు అదే సమయంలో ముడుతలను కనబడకుండా చేస్తుంది.

సోరియోసిస్:

సోరియోసిస్:

సోరియస్ సమస్య భరించలేని చర్మ సమస్య. ఈ సమస్యకు ఒక ఉత్తమ హోం రెమెడీ వాల్ నట్ ఆయిల్. వాల్ నట్ ఆయిల్ ను స్నానం చేయడానికి ముందు చర్మానికి అప్లై చేసి స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మరియు సోరియోసిస్ లక్షణాలను కూడా నివారిస్తుంది . అప్పటికి తగ్గనట్లైతే, డాక్టర్ ను సంప్రదించాలి.

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారిస్తుంది:

వాల్ నట్ ఆయిల్ చుండ్రును వదిలించుటలో గొప్పగా సహాయపడుతుంది. ఇది తలను శుభ్రంగా, క్లీన్ గా ఉంచుతంది. దీన్ని రెగ్యులర్ గా తలకు పట్టించడం వల్ల, తలనుండి పొట్టుపొట్టుగా ఊడివచ్చు సమస్యను నివారిస్తుంది. దాంతో చుండ్రు నివారించబడుతుంది.

ఇన్ఫెక్షన్ నివారిస్తుంది:

ఇన్ఫెక్షన్ నివారిస్తుంది:

మనందరం ఏదో ఒక సందర్భంలో భయంకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురియైనప్పుడు, సమస్యను నివారించుకోలేక నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు. వాల్ నట్ ఆయిల్ ఈ ఇన్ఫెక్షన్ కు అద్భుతంగా జవాబిస్తుంది. ఇది అద్భుతంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ ను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

జుట్టు రాలడం నివారిస్తుంది:

జుట్టు రాలడం నివారిస్తుంది:

ఎవ్వరు కూడా జుట్టు రాలడాన్ని దువ్వనెకు కుప్పలు కుప్పలు, జుట్టు ఊడివచ్చుటను ఏఒక్కరూ ఇష్టపడరు . హెయిర్ లాస్ అనేది స్ట్రెస్ ఫుల్ గా మార్చుతుంది . హెయిర్ లాస్ తో బాధపడుతున్న వారికి వాల్ నట్ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉండి సెల్ డ్యామేజ్ ను నివారిస్తుంది.

English summary

Beauty Benefits Of Walnut Oil

Have you ever tried walnut oil for skin care? You must have enjoyed walnuts as a snack till now; it is time you try walnut oil as a beauty product. Well, it contains antioxidants as well as omega-3 fatty acids.
Story first published: Wednesday, April 29, 2015, 17:44 [IST]
Desktop Bottom Promotion