For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో సన్ టాన్ నివారిస్తుంది, చర్మం తెల్లగా మార్చుతుంది

|

వేసవి కాలంలో సరైన చర్మ సంరక్షణ చిట్కాలను పాటించకపోతే వాతావరణంలోని వేడి, దుమ్ము, ధూలి మరియు ఇతర పొల్యూషన్ వల్ల త్వరగా చర్మ సమస్యలకు దారితీస్తుంది. మార్కెట్లో మనకు లభ్యమయ్యే అనేక రసాయనిక ఉత్పత్తుల వల్ల సున్నితమైన చర్మం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.

కాబట్టి, చర్మ సంరక్షణ కోసం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని నేచురల్ హోం రెమెడీస్ ముఖ్యంగా కిచెన్ రెమెడీస్ ఉపయోగించడం చాలా ఉత్తమం. వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అలాంటి హోం రెమెడీస్ లో ఒకటి గ్రీన్ గ్రామ్ (పెసళ్ళు లేదా ముడి పెసళ్ళు). వేసవి కాలంలో చర్మ సంరక్షణ కోసం ఉపయోగించడం వల్ల సమ్మర్ హీట్ ను ఎదుర్కోవడంతో పాటు, చర్మంను టాన్ నుండి ఇతర సమస్యలను నుండి రక్షించుకోవచ్చు .

ఇవి అన్ని రకాల చర్మ తత్వాలకు సూట్ అవుతుంది . అంతే కాదు వేసవిలో గ్రీన్ గ్రామ్ చర్మాన్ని కూల్ గా ఉంచడం వల్ల మొటిమలు మరియు ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ గ్రీన్ గ్రామ్ ను చర్మ సంరక్షణలో ఉపయోగించాలంటే, గ్రీన్ గ్రామ్ పేస్ట్ లో పాలు, వాటర్ మరియు రోజ్ వాటర్ వంటివి మిక్స్ చేస్తే ఉత్తమ ఫలితం ఉంటుంది.

వేసవిలో ఈ గ్రీన్ గ్రామ్ (ముడి పెసళ్ళ)తో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల వివిధ రకాల సమస్యలను నివారించుకోవచ్చు. మరి ఈ గ్రీన్ గ్రామ్ చర్మ సంరక్షణలో ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం...

1. మొటిమలను నివారిస్తుంది:

1. మొటిమలను నివారిస్తుంది:

గ్రీన్ గ్రామ్ ను చర్మానికి ఉపయోగించడం వల్ల చాలా సహాయకారిగా పనిచేస్తుంది. గ్రీన్ గ్రామ్ ను పౌడర్ గా చేసి, అందులో కొద్దిగా పసుపు మిక్స్ చేసి ముటిమలున్న ప్రదేశంలో అప్లై చేసి డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

2. బ్లాక్ హెడ్స్:

2. బ్లాక్ హెడ్స్:

బ్లాక్ హెడ్స్ ను గ్రీన్ గ్రామ్ పేస్ట్ ను ఉపయోగించి తొలగించుకోవచ్చు . పెసళ్ళను మెత్తగా పేస్ట్ లా చేసి అందులో కొద్దిగా పంచదార మరియు బదాం పౌడర్ మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి . ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ నివారించబడుతుంది. మరియు బాదం చేర్చడం వల్ల ముఖానికి మంచి గ్లో వస్తుంది.

3. ముడుతలను నివారిస్తుంది:

3. ముడుతలను నివారిస్తుంది:

గ్రీన్ గ్రామ్ ఫేస్ ప్యాక్ వల్ల కళ్ళ క్రింద ముడుతలను నివారించుకోవచ్చు. ఇలా రాత్రుల్లో పడుకొనే ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

4. వైట్ హెడ్స్ :

4. వైట్ హెడ్స్ :

గ్రీన్ గ్రామ్ పొడిని పచ్చిపాలు మరియు కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి వైట్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల ఇది వైట్ హెడ్స ను నివారిస్తుంది.

5. స్కిన్ టైట్ చేస్తుంది:

5. స్కిన్ టైట్ చేస్తుంది:

పెసర పిండికి ఎగ్ వైట్ చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్ల చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం టైట్ గా మారుతుంది.

6. ఫేష్ వాష్:

6. ఫేష్ వాష్:

పెసరపిండిని ముఖానికి పట్టించి, ఫేస్ వాష్ చేయడం ద్వారా చర్మంలో ఉండే మలినాలన్నీ తొలగిపోతాయి. ఇది మీ చర్మంలో కాంతిని మెరుగుపరుస్తుంది.

7. ఫేషియల్ హెయిర్:

7. ఫేషియల్ హెయిర్:

ఫెషియల్ హెయిర్ నివారించడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ . మీ ముఖంలో అవాంఛిత రోమాలను నివారించాలంటే, పెసరపిండిలో కొద్దిగా టమోటో రసం మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి . బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

8. మచ్చలు:

8. మచ్చలు:

మొటిమల తాలుకు మచ్చలను తొలగించడం కొద్దిగా కష్టం అవుతుంది. కాబట్టి, ఇలాంటి అవాంచిత మచ్చలను తొలగించాలంటే ప్రతి రోజు పెసరపిండిని ప్యాక్ గా ఉపయోగిస్తుంటే మచ్చలు మాయం అవుతాయి.

9. ఆయిల్ స్కిన్:

9. ఆయిల్ స్కిన్:

మీ ఆయిల్ ఫేస్ తగ్గించుకోవడానికి పెసరపిండిని ముఖానికి అప్లై చేయాలి. కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసిన గ్రీన్ గ్రామ్ అప్లై చేయడం వల్ల ముఖంలో జిడ్డు తొలగిపోతుంది.

10. చర్మం తెల్లగా మార్చుతుంది:

10. చర్మం తెల్లగా మార్చుతుంది:

పెసరపిండితో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు . అందుకు మీరు రెండు చెంచాల పెసరపిండిలో ఒక చెంచా నిమ్మరసం మరియు నీరు కొద్దిగా మిక్స్ చేసి, పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ వల్ల స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.

English summary

Benefits Of Using Green Gram On Face In Summer

Summer is here to stay and making use of the natural ingredients for your skin is the best tip we can give you. There are a lot of chemical based products in the market which contain elements that are not good enough for your skin, especially your face since it is a delicate.
Story first published: Wednesday, April 8, 2015, 17:36 [IST]
Desktop Bottom Promotion