Just In
- 2 hrs ago 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- 3 hrs ago ఈ 3 రాశుల వారు ఏప్రిల్ 23 నుండి అప్రమత్తంగా ఉండాలి, అంగారకుడి వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు
- 8 hrs ago అయోధ్య బాలరాముడిపై సూర్య తిలకం.. కిరణాలు నుదుటిపై పడేందుకు ఏమి చేసారంటే..!
- 8 hrs ago కొత్తగా పెళ్ళైన జంటలు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ లైఫ్ సేవ్ చేస్తుంది
చర్మ సౌందర్యాన్ని పెంచే 8 బెస్ట్ ఫేషియల్ మసాజ్ క్రీములు
బాడీ మసాజ్ లాగే ఫేషియల్ మసాజ్ యూడా చాలా అవసరం. చర్మం అందంగా.. ఆరోగ్యంగా మెరుస్తుండేందుకు బ్యూటీ పద్దతుల్లో చాలా రకాలను ప్రయత్నం చేసే ఉంటారు. అయితే ఫేషియల్ మసాజ్ అనేది చర్మ సంరక్షణలో చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వయస్సులో ఏదో ఒక చర్మ సమస్యను ఎదుర్కొని ఉంటారు. వయస్సు మీదపడినట్లు, ముడుతలు, ముఖంలో మొటిమలు, బ్లాక్ సర్కిల్స్, మొ..ఎన్నో..అలాంటి వారిలో మీరూ ఒక్కరైతే.. మీ ముఖం నిర్జీవంగా, కాంతిహీనంగా ఉందా? ముఖంలో కళ తప్పినట్లైతే మళ్లీ చర్మానికి కాంతి చేకూర్చాలని ఉందా. ఈ సమస్యలన్నింటీకి ఒకటే మార్గం అదే ఫేషియల్ మసాజ్.
ఫేషియల్ మసాజ్ వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మరియు ముఖలో స్కార్స్, స్కిన్ మార్క్స్ మరియు స్పాట్స్ నివారించబడుతుంది
ఫేషియల్ మసాజ్ వల్ల ముఖంలో నేచురల్ గ్లో వస్తుంది . ఫేషియల్ మసాజ్ కోసం ఉపయోగించే నేచురల్ ప్రొడక్ట్స్ మఖ చర్మంలోనికి షోషింపబడి లోపలి నుండి న్యూరిష్ చేస్తుంది.
READ MORE: ఫేషియల్ మసాజ్ తో సర్ఫ్రైజింగ్ బ్యూటి బెనిఫిట్స్
ఫేషియల్ మసాజ్ కోసం వివిధ రకాల క్రీమలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి కంటే మనం నేచురల్ గా హోం మేడ్ మసాజ్ క్రీమ్ లను తయారుచేసుకొని ఉపయోగించడం ద్వారా అవి సురక్షితమైనవి, చౌకనివి మరియు మరియు ప్రయోజనాలను అందిస్తాయి.
కాబట్టి ఫేషియల్ మసాజ్ కోసం కొన్ని ఎఫెక్టివ్ హోం మేడ్ క్రీములను మీకు పరిచయం చేస్తున్నాము. ఇవి మీ ముఖంలో ముడుతలు, మచ్చలు తొలగించి మిమ్మల్ని యంగ్ గా కనబడేలా చేయతాయి. ఈ మసాజ్ క్రీములను ముఖానికి పట్టించి సర్కులర్ మోషన్ లో మసాజ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముక్కు మెడ వద్ద కూడా 15-30 నిముషాలు మసాజ్ చేసుకోవాలి.
మరి ఇంట్లో తయారుచేసుకొనే బెస్ట్ మసాజ్ క్రీములు ఈ క్రింది విధంగా ...
అవొకాడో, గుడ్డు లేదా పెరుగు:
యాంటీఏజింగ్ మసాజ్ క్రీమ్ ఇది. అవొకాడోలో విటమిన్ ఎ, బి, సి, ఇ మరియు కె లు ఇంకా పొటాషియం, మెగ్నీషియం వంటి మినిరల్స్ పుష్కలంగా కలిగి ఉన్నాయి . ఒక బౌల్ తీసుకొని అందులో అవొకాడో వేసి బాగా మెత్తగా చేసి అందులో గుడ్డు బాగా మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మసాజ్ చేయాలి. వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
కోకబట్టర్, ఆలివ్ ఆయిల్ మరియు కొబ్బరి నూనె మసాజ్ క్రీమ్
ఇది మరో నేచురల్ హోం మేడ్ మసాజ్ క్రీమ్, ఇది డ్రై, డల్ మరియు పగిలిన చర్మానికి చాలా మేలు చేస్తుంది. కోకబట్టర్ గ్రేట్ గా పనిచేస్తుంది . ఈ క్రిమ్ ను ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మం సాఫ్ట్ గా మొటిమలు ముడుతలను లేకుండా చేస్తుంది. ఈ పదార్థాలన్నీ బాయిలర్ లో వేసి హీట్ చేయాలి. పదార్థాలు బాగా మిక్స్ అయ్యే వరకూ వేడి చేసి, పక్కన పెట్టి చల్లారిన తర్వాత మసాజ్ చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది
గ్లిజరిన్, రోజ్ వాటర్, కొబ్బరి నూనె మరియు బాదం ఆయిల్ క్రీమ్ః
ముందుగా బాదం మరియు కొబ్బరినూనె గిన్నెలో వేసి బాగా వేడి చేయాలి. తర్వాత క్రిందికి దింపుకొని, అందులో రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్ వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక క్రీమ్ ను ఒక డబ్బాలో వేసి నిల్వచేసుకొని, అవసరం అయినప్పుడు ముఖానికి మసాజ్ చేస్తుండాలి. గ్లిజరిన్ చర్మానికి తగిన తేమను అందిస్తుంది మరియు కొబ్బరి నూనె చర్మఆరోగ్యాన్ని పునరుద్దరిస్తుంది . యాంటీ ఫంగల్ లక్షనాలను నివారిస్తుంది. రోజ్ వాటర్ మరియు బాదం నూనె ముఖంలో ఫ్రెష్ అప్పీల్ ఇస్తుంది. చర్మం సాగకుండా కాపాడుతుంది.
మిక్క్ క్రీమ్, రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్ మరియు గ్లిజరిన్ మసాజ్
ముఖానికి ఇది మరో బెస్ట్ ఫేషియల్ మసాజ్ క్రీమ్. మిల్క్ క్రీమ్ లో క్లెన్సింగ్, మాయిశ్చరింగ్, మరియు న్యూరిషింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని పదార్థాలను మిక్స్ చేసి ఒక సారి బ్లడ్ చేసి ముఖానికి పట్టించి మసాజ్ చేయాలి.
ఆపిల్, రోజ్ వాటర్, మరియు ఆలివ్ ఆయిల్ మసాజ్ క్రీమ్
ఆపిల్ లో విటమిన్ ఎ, బి మరియు సి ఇంకా ఇతర యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మం మరింత యవ్వనంగా, సాప్ట్ గా మరియు స్మూత్ గా కనబడుటకు సహాయపడుతుంది. ఆపిల్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. తర్వాత దానికి ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి బాయిలర్ లో వేసి, తక్కువ మంట మీద హీట్ చేయాలి. తర్వాత క్రిందికి దింపుకొన, చల్లారిన తర్వాత రోజ్ వాటర్ మిక్స్ చేసి నిల్వచేసుకొని వారంలో రెండు సార్లు పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె, మరియు వీ వాక్స్, విటమిన్ ఇ మసాజ్ క్రీమ్
ఆలివ్ ఆయిల్ చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. ఇతర పదార్థాలు కొబ్బరి నూనె చర్మ ఆరోగ్యం మరియు సౌందర్యాన్ని కాపాడుతుంది. విటమిన్ ఇ చర్మాన్ని మరమ్మత్తు చేస్తుంది మరియు చర్మానికి రక్షణ కల్పిస్తుంది . ఈ మూడు పదార్థాలను మిక్స్ చేసి సాస్ పాన్ లో వేసి తక్కువ మంటలో హీట్ చేయాలి. కరిగేవరకూ వేడి చేయాలి. విటమిన్ ఇ ట్యాబ్లెట్ పొడి చేసి సాస్ పాన్ లో వేసి చల్లారిన తర్వాత ముఖానికి మసాజ్ చేయాలి.
గ్రీన్ టీ, బాదంనూనె, రోజ్ వాటర్, కలబంద, మరియు బీవాక్స్ మసాజ్ క్రీమ్
చర్మం కాలుష్యం వల్ల పాడైతే ఈ మసాజ్ క్రీమ్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. గ్రీన్ టీ మలినాలను తొలగిస్తుంది, అలోవెర చర్మ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బీవాక్స్ కు బాదం ఆయిల్ మిక్స్ చేసి బాయిల్ చేయాలి. తర్వాత అలోవెరా మిక్స్ చేసి గ్రీటీని, ఎసెన్షియల్ ఆయిల్ మరియు రోజ్ వాటర్ మిక్స్ చేసి నిల్వ చేసుకొని అవసరం అయినప్పుడు మసాజ్ చేసుకుంటుండాలి.
అలోవెర, ల్యావెండర్, ప్రైరోజ్ ఆయిల్ యాంటీ ఎన్స్ నైట్ క్రీమ్
అలోవెర మొటిమలు మచ్చలు తొలగించడంలో చాలా గ్రేట్ గా పనిచేస్తుంది. ఇది చర్మానికి పోషణను అందించి, చర్మాన్ని సాఫ్ట్ గా మరియు తేమగా మరియు యవ్వనంగా మార్చుతుంది. అలోవెర మొక్క నుండి గుజ్జుతీసి అందులో ప్రైమ్ రోజ్ ఆయిల్ మిక్స్ చేయాలి. వారంలో మూడు సార్లు ముఖానికి పట్టించి మసాజ్ చేయాలి.