For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లవర్ ఫేస్ ప్యాక్ తో.. అద్భుతమైన చర్మ సౌందర్యం

By Nutheti
|

పూలంటే.. తలలో పెట్టుకోవడానికి.. పూజ చేయడానికి.. ఇంటి అలంకరణకు వాడుతాం. మరి ఎప్పుడైనా.. ఫేస్ ప్యాక్ లాగా వాడారు. అవునండీ.. పూలతో ప్యాక్ లు తయారు చేసుకుని ట్రై చేయండి.. పూలలాంటి మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోండి.

చూడచక్కని అందమైన ముఖానికి రకరకాల ఫేస్ ప్యాక్ లు, క్రీములు, మసాజ్ లు, ఫేస్ వాష్ లు వాడుతుంటారు. అనేక పండ్లు, పౌడర్లతో.. ముఖ వర్చస్సు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కొన్ని సందర్భాల్లో అనుకున్నంత ఫలితం దక్కకపోవచ్చు. ఈ సారి కొత్తగా పూలతో ఫేస్ ప్యాక్ లను ప్రయత్నించి.. మీ ముఖానికి కొంగొత్త సొగసుని తీసుకురండి.

READ MORE : పాలు-కుంకుమ పువ్వు ఫేస్ ప్యాక్ తో చర్మం నిగనిగ..!

పూలతో వేసుకునే ప్యాక్ ల వల్ల ముఖ వర్చస్సే కాదు.. జిడ్డుతనం, మొటిమలు, మచ్చలు కూడా తొలగిపోతాయి. చర్మం జిడ్డుగా ఉంటే.. మొటిమల సమస్య పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి చర్మ సమస్యలన్నికి గుడ్ బై చెప్పడానికి ఫ్లవర్ ప్యాక్ లకు వెల్ కమ్ చెప్పేయండి.

చేమంతి ప్యాక్

చేమంతి ప్యాక్

చలికాలంలో ముఖంపై పగుళ్లు, గీతలు కనిపిస్తుంటాయి. ఎన్ని మాయిశ్చరైజర్లు అప్లై చేసినా కొద్దిసేపటికే ఇంకిపోతుంది. రోజంతా ముఖం మృదువుగా ఉండాలంటే చేమంతి ప్యాక్ మంచి ఆప్షన్. రెండు చేమంతి పూలను నీళ్లలో ఉడకపెట్టాలి. ఆ నీటిలో కాస్త తేనె, పాలు పోసి బాగా కలుపుకోవాలి. రోజూ ఉదయం బయటికి వెళ్లేటప్పుడు ఈ మిశ్రమంతో ముఖంపై బాగా మసాజ్ చేసుకొని రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే రోజంతా ముఖం తాజాగా, అందంగా ఉంటుంది.

మల్లెల ప్యాక్

మల్లెల ప్యాక్

మల్లె పూల అనగానే.. అందరికీ ఎక్కడ లేని సంతోషం. మంచి సువాసనతో.. ఆహ్లాదరపిచే ఈ పూలు సౌందర్యానికి ఎంతో ఉపయోగపడతాయి. 5-6 మల్లెపూలను పేస్ట్‌లా చేసుకుని, అందులో కొద్దిగా పెరుగు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో రోజూ ఉదయం లేచిన వెంటనే ముఖానికి ప్యాక్ వేసుకుంటే మంచి రంగుతో పాటు డ్రై స్కిన్ నుంచి బయటపడవచ్చు. పొడితనం కూడా తగ్గుతుంది. ఇలా చేయడానికి టైం సరిపోదు అని ఫీలయ్యే వాళ్లు.. మల్లెపూలను ఉడకపెట్టి, ఆ నీళ్లలో ఏదైనా ఫెయిర్‌నెస్ క్రీం కలిపి ముఖంపై ఓ నిమిషం మర్దన చేసుకొని గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చాలు కోమలమైన చర్మం మీ సొంతమవుతుంది.

తామరపూల ప్యాక్

తామరపూల ప్యాక్

అందంగా.. ఆకర్షణీయంగా ఉండే తామర పూలలో లినోనిక్ యాసిడ్‌తో పాటు అనేక రకాల మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటికి ముఖాన్ని తెల్లగా చేయటమే కాకుండా నల్లమచ్చలను పోగొట్టే గుణం కూడా ఉంది. ఒక పెద్ద తామరపువ్వును బాగా కడిగి రేకులను వేరుచేసి నీళ్లలో ఉడకబెట్టాలి. ఆ నీళ్లు చల్లారాక అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. తర్వాత వాటిని ఓ సీసాలో తీసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరి. రోజూ ముఖం కడుక్కోవడానికి ఆ నీటిని ఉపయోగించుకుంటే మీ చర్మం మిలమిలా మెరుస్తుంది.

కుంకుమ పువ్వు

కుంకుమ పువ్వు

కుంకుమ పువ్వు, పాలు కలిస్తే ముఖం లేతగులాబీలా మెరిసిపోవాల్సిందే. పాలను బాగా కాచి అందులో కుంకుమపువ్వు వేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

గులాబీల ప్యాక్

గులాబీల ప్యాక్

గులాబీకి ఫ్యాన్స్ లేనివారంటూ ఉండరు. సువాసనలు వెదజల్లే గులాబీలను అమ్మాయిలు చాలా ఇష్టపడతారు. అమ్మాయిలకు అందంతో పాటు, సౌందర్య సాధనంగా గులాబీలది టాప్ ప్లేస్. ముఖ తేజస్సు పెరగాలంటే.. పది గులాబీ రేక్కలను నీళ్లలో గంటపాటు నానబెట్టి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. దీనికి రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్, మూడు టీ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పావు గంట ప్రిజ్‌లో ఉంచాక వేళ్లతో ముఖంపై వలయాకారంగా పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. అంతే మిళ మిళ మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

మందారం

మందారం

మందారం ఆకులు, పువ్వులు సౌందర్యాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో తోడ్పడతాయి. ఈ మొక్క నుంచి నూనె తీస్తారు. ఈ నూనె చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. మందార నూనెలో తేమ ఉంటుంది కాబట్టి చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. స్నానానికి వెళ్లేముందు మందార నూనెను నీళ్లలో వేయటం వల్ల శరీరం అందంగా ఉండటమేకాక సుగంధభరితంగా ఉంటుంది.

బంతిపూల ప్యాక్

బంతిపూల ప్యాక్

రెండు పెద్ద బంతిపూలను పూర్తీగా రెక్కలు తీసి మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దానికి ఒక టీస్పూన్ ఉసిరి పొడి, ఒక టీస్పూన్ పెరుగు, రెండు టీ స్పూన్ల నిమ్మరసం వేసి బాగా మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని రోజూ ఉదయం ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెండు వారాలపాటు చేస్తే జిడ్డుతనం తగ్గి ముఖం నిగారిస్తుంది.

English summary

Face Packs With Flowers : beauty tips in telugu

Get Fair And Pinkish Glowing Face At Home. Beauty Tips in Telugu. A fair and pinkish glowing skin is a dream of every Indian girl. However fair skin only looks attractive if it is flawless, without any marks and spots.
Story first published: Thursday, October 15, 2015, 10:29 [IST]
Desktop Bottom Promotion