For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో అందానికి అందం..ఆరోగ్యానికి ఆరోగ్యం: సమ్మర్ ఫుడ్స్

|

వేసవిలో స్కిన్ డైట్ ఏంటి?అంటే చర్మం ఆరోగ్యంగా అందంగా ఉంచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి. వేసవి సీజన్ లో చర్మాన్ని సంరక్షించుకోవడానికి సన్ స్క్రీన్ మాత్రం ఉపయోగిస్తే సరిపోదు. చర్మ సరంక్షణకు సరైన ఆహారం కూడా అవసరం.

చర్మ సంరక్షణలో బహిర్గతంగా సన్ స్క్రీన్ ఉపయోగించడం మాత్రం మాత్రమే కాదు, అంతర్గతంగా తీసుకొనే ఆహార ప్రభావం కూడా చర్మ సౌందర్యం ఆధారపడి ఉంటుంది. అంతర్గతంగా తీసుకొనే ఆహారలు చర్మానికి తగిన రక్షణ కల్పిస్తాయి.

వేసవిలో సీజన్ కు తగిన విధంగా కొన్ని ప్రత్యేకమైన ఆహారలు తీసుకోవడం వల్ల శరీరానికి రక్షణ కల్పించడంతో పాటు, చర్మానికి తగినంత రక్తప్రసరణను అందిస్తుంది.

మనం తీసుకొనే ఆహారం ద్వారా మన శరీరానికి అందే పోషకాలు వల్ల శరరం రక్షణ మరియు జీవక్రియలు చురుగా పనిచేయడం వల్ల చర్మానికి తగిన రక్షణ అందివ్వబడుతుంది.

కాబట్టి వేసవి సీజన్ కేవలం యూవీకిరణాలు మాత్రమే ప్రభావం చూపుతాయనడం తప్పు, తీసుకొనే ఆహారం కూడా ప్రభావం చూపుతుందని గ్రహించి, చర్మానికి రక్షణ కల్పించే వేసవి ఆహారాలు తీసుకోవడం ఉత్తమం.

మరి ఆ వేసవి ఫుడ్స్ ఏంటో ఈ క్రింది స్లైడ్ ద్వార తెలుసుకుందాం...

1. బెర్రీస్:

1. బెర్రీస్:

బెర్రీస్లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల వీటిని తీసుకోవడం చాలా ఆరోగ్యానికి చాల మేలు జరుగుతుంది .యూవి కిరణాల వల్ల స్కిన్ డ్యామేజ్ నివారించడంలో ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి.

2. సిట్రస్ పండ్లు:

2. సిట్రస్ పండ్లు:

వేసవిలో చర్మాన్ని కాంతివతంగా, ప్రకాశవంతంగా మార్చే ఆహారాలేంటి? ఖచ్చితంగా సిట్రస్ పండ్లు అని చెప్పవచ్చు . ఖచ్చితంగా ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా మరియు ప్రకాశావంతంగా మార్చడంలో కొల్లాజెన్ ప్రముఖ పాత్రపోషిస్తుంది. సిట్రస్ ఫ్రూట్స్ లో ఉండే విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని మరియు రక్షణ కల్పిస్తుంది.

3. వాటర్ మెలోన్:

3. వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్ లో నీరు పుష్కలంగా ఉండటం వల్ల ఇది సమ్మర్ ఫుడ్స్ లో మొదటి సూపర్ ఫుడ్ . అంతే కాదు ఇందులో విటమిన్ సి కూడా అధికంగా ఉండటం వల్ల ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది.

4. టమోటోలు:

4. టమోటోలు:

టమోటోలలో ఉండే లైకోపిన్ అనే కంటెంట్ చర్మం సంరక్షణకు చాలా అవసరం. ఇది ముఖంలో ముడుతలు తగ్గించి చర్మానికి రక్షణ కల్పిస్తుంది.

5. చెర్రీస్:

5. చెర్రీస్:

వేసవి సీజన్ లో చెర్రీస్ తినడం వల్ల చర్మం ఫ్రెష్ గా ఉంటుంది. ఎందుకంటే చెర్రీస్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ పుష్కలంగా ఉండే చర్మానికి మేలు చేస్తాయి . కాబట్టి వీటిని సమ్మర్ స్కిన్ కేర్ ఫుడ్స్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

6. పైనాపిల్:

6. పైనాపిల్:

పైనాపిల్లో ఉండే విటిమిన్స్ మినిరల్స్ శరీరానికి తగిన పోషకాలను అందివ్వడం మాత్రమే కాదు, ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మరియు సన్ బర్న్ నివారిస్తుంది.

7. కొబ్బరి బొండాం:

7. కొబ్బరి బొండాం:

కొబ్బరి బోండాం నుండి మన శరీరానికి అవసరం అయ్యే ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా అందుతాయి. ముఖ్యంగా చర్మానికి రక్తప్రసరణ గ్రేట్ గా అందుతుంది. దాంతో చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది.

8. కీరదోసకాయ:

8. కీరదోసకాయ:

వేసవి సీజన్ లో ఎంత ఎక్కువ సలాడ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. కీరదోస చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. వేసవిలో మీరు ఫ్రెష్ గా కనిపించడానికి సహాయపడుతుంది.

9. ఫిష్:

9. ఫిష్:

సమ్మర్ స్పెషల్ ఫుడ్స్ లో సాల్మన్ ఒకటి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . హెల్తీ సమ్మర్ స్కిన్ పొందాలంటే సాల్మన్ ఫిస్ కూడా మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా ఉండాలి.

English summary

Foods For Good Skin In Summer

What is the best skin diet in summer? Using sunscreen is inevitable in summer but there is more to do than just smearing some cream on your skin. You have to work on your skin from inside too. How to do that? Well, by eating the right foods that protect your skin.
Desktop Bottom Promotion