For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేబీ స్కిన్ పొందడానికి నేచురల్ హోం మేడ్ స్ర్కబ్సింగ్

|

సాధరణంగా మనం చేసుకొనే ఫేషియల్ స్ర్కబ్ వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. ముఖ్యంగా చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి, చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. స్కిన్ టోన్ మార్చుకోవడానికి ఫేషియల్ స్ర్కబ్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు, చర్మంలోని రంధ్రాలను తెరచుకొనేలా చేసి చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది మరియు చర్మంలోని బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది.

READ MORE: బేబీ ఆయిల్ పిల్లలకే కాదు..పెద్దలకు కూడా అద్భుతమైన ప్రయోజనం..!

ఫేషియల్ స్ర్కబ్ వల్ల చర్మ శుభ్రపడుతుంది మరియు చర్మం రిఫ్రెష్ గా తయారవుతుంది. స్కిన్ స్ర్కబ్బింగ్ వల్ల చర్మంలోని మురికిని మరియు ఆయిల్ ను తొలగిస్తుంది. దాంతో చర్మంలో మొటిమలు మరియు మచ్చలు ఏర్పడకుండా డీప్ గా శుభ్రం చేస్తుంది.

READ MORE: బేబీలోషన్ వల్ల పెద్దలకు ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్!

స్క్రబ్బింగ్ లో కూడా వివిధ రకాల కెమికల్ స్క్రబ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే మనం ఇంట్లో తయారుచేసుకొనే హోం మేడ్ స్ర్కబ్స్ చర్మానికి సురక్షితమైనవి మరియు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు..మరి బేబి స్కిన్ పొందాలంటే మనం ఇట్లో తయారుచేసుకొని హోం మేడ్ స్ర్కబ్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

కాఫీ:

కాఫీ:

కొన్ని కాఫీ గింజలను రఫ్ గా పొడి చేసి అందులో ఆలివ్ ఆయిల్ మరియు తేనె మిక్స్ చేసి ముఖానికి సున్నితంగా పట్టించి 15నిముషాల తర్వాత సున్నితంగా మసాజ్ చేయాలి. మొటిమలను నివారించడానికి ఇది ఒక నేచురల్ ఫేషియల్ స్ర్కబ్బర్.

చాక్లెట్ స్ర్కబ్:

చాక్లెట్ స్ర్కబ్:

కొద్దిగా బాదం నూనె మరియు పంచదారలో చాక్లెట్ వేసి మొత్తం వేడి చేసి, కరిగించాలి. ఈ స్ర్కబ్ చర్మానికి పోషణను అందిస్తుంది మరియు ఇది చర్మానికి నేచురల్ గ్లోను అందిస్తుంది.

గ్రీన్ టీ స్ర్కబ్:

గ్రీన్ టీ స్ర్కబ్:

గ్రీన్ టీని షుగర్ లేకుండా తయారుచేయాలి. తర్వాత దీన్ని చల్లార్చి అందులో కొద్దిగా పంచదార వేసి చిక్కగా చేయాలి. మరియు అందులోనే కొద్దిగా తేనె కూడా మిక్స్ చేయాలి. గట్టిగా స్ర్కబ్బింగ్ లా తయారుచేసుకనన తర్వాత ముఖానికి మరియు మెడకు పట్టించాలి. 20నిముషాల తర్వాత స్ర్కబ్ చేసి శుభ్రం చేసుకోవడం ద్వారా చర్మానికి నేచురల్ గ్లో వస్తుంది. ఇది ఒక బెస్ట్ హోం మేడ్ ఫేషియల్ స్ర్కబ్ .

బ్లూ బెర్రీ :

బ్లూ బెర్రీ :

బ్లూ బెర్రీస్ ను మెత్తగా చేసి అందులో కొద్దిగా నిమ్మరసం మరియు బ్రౌన్ షుగర్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి, సర్కులర్ మోసనల్ లో స్ర్కబ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బాదం స్ర్కబ్:

బాదం స్ర్కబ్:

కొన్ని బాదంలను తీసుకొని వాటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. రఫ్ గా చేసుకొన్న బాదం పౌడర్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి దీన్ని ముఖానికి పట్టించి నిధానంగా మర్ధన చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఓట్ మీల్:

ఓట్ మీల్:

మిల్క్ పౌడర్, కార్న్ మీల్ పౌడర్, ఒక గిన్నెలో తీసుకొని అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మరియు ఓట్ మీల్ పౌడర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయాలి. ముఖ్యంగా నుదురు మరయిు ముక్కు ప్రాంతంలో బాగా మసాజ్ చేయాలి. ఇది ఒక ఉత్తమ ఫేషియల్ స్ర్కబ్.

బొప్పాయి:

బొప్పాయి:

బాగా పండిన బొప్పాయిలో కొద్దిగా పంచదార వేసి మిక్స్ చేసి వెంటనే ముఖానికి పట్టించి బాగా మర్ధన చేయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

పెరుగు:

పెరుగు:

కొద్దిగా పెరుగు తీసుకొని అందులో పంచదార వేసి మిక్స్ చేసి వెంటనే ముఖానికి పట్టించి ముఖం మొత్తం స్ర్కబ్ చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం కాంతివంతంగా మెరుగుపడుతుంది.

టమోటో:

టమోటో:

టమోటోను మెత్తగా చేసి అందులో పంచదార మిక్స్ చేసి ముఖానికి పట్టించి 15నిముషాలు బాగా మర్ధన చేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం శుభ్రపడుతుంది మరియు రిఫ్రెష్ చేస్తుంది.

టూత్ పేస్ట్:

టూత్ పేస్ట్:

కొద్దిగా పేస్ట్ తీసుకొని దానికి కొద్దిగా సాల్ట్ మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయాలి . ఇది ముఖంలో మొటిమలు మరియు మచ్చలను తొలగిస్తుంది . ఇది చర్మానికి ఒక ఉత్తమ ఫేషియల్ స్ర్కబ్బర్.

English summary

Get Baby Skin At Home By These Scrubs: Beauty Tips in Telugu

Get Baby Skin At Home By These Scrubs, Beauty Tips in Telugu. Facial scrubs remove the dead cells from skin and improve complexion. They also open up the skin pores to remove black heads.
Story first published: Monday, July 20, 2015, 17:17 [IST]
Desktop Bottom Promotion