Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ముఖానికి ధీటుగా చేతులను మెరిపించాలంటే..
చూడగానే ఆకట్టుకోవాలంటే కేవలం ముఖం, జుట్టు మాత్రమే కాదు.. చేతులూ అందంగా ఉండాలి. ముఖానికి మేకప్ వేసుకున్నాం కదా అనుకోకూడదు.. ముఖంతోపాటు చేతులు మెరిసిపోవాలి. కానీ చేతుల రంగు, ముఖం రంగుకి చాలా తేడా ఉంటుంది. అలా కాకుండా ముఖంతో పాటు చేతులు తళతళలాడాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
READ MORE: మీ ఆరోగ్యం గురించి చేతులు చెప్పే ఆశ్చర్యకరమైన నిజాలు
ఎండకు ఎక్స్ పోజ్ అవడం, సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల చేతులు నల్లగా కమిలినట్లు కనిపిస్తాయి. విపరీతంగా ట్యాన్ ఏర్పడింటుంది. కొంతమందికి ఉంగరాలు, వాచ్ లు వంటి ఆర్నమెంట్స్ కారణంగా కూడా మచ్చలు ఏర్పడతాయి. ట్యాన్ పోగొట్టుకోవడానికి రకరకాల క్రీములు, వ్యాక్స్ లు ట్రై చేసి ఉంటారు. కానీ ఫలితం లేక ఢీలా పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ అద్భుతమైన హోం రెమిడీస్ ప్రయత్నించి చూడండి..

వేడి నీటితో
ఒక గిన్నెలో వేడిగా ఉన్న నీళ్లు తీసుకుని గాఢత తక్కువగా ఉన్న సోప్ వాష్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో చేతులను 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. అదే సమయంలో రెండు చేతులను ఒకదానితో మరొకటి సున్నితంగా మర్దనా చేసుకోవాలి. తర్వాత చేతులను చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల చేతులపై ట్యాన్ తగ్గుతుంది.

తేనె
రెండు చెంచాల పాలపొడికి చెంచా తేనె, కొద్దిగా బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు రాసుకుని 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ టిప్ అద్భుతంగా పనిచేస్తుంది. ట్యాన్ తగ్గడమే కాదు.. మీ చేతులు మెరిసిపోతాయి.

సెనగ పిండి
రాత్రి పడుకోబోయే ముందు చేతులకు నూనె రాసి కాసేపయ్యాక సెనగపిండితోగానీ, బియ్యం పిండితోగానీ, సున్నిపిండితో కానీ నలుగులా రుద్దుకుని చల్లటి నీటితో కడిగేసుకుంటే చేతులు స్మూత్ గా తయారవుతాయి.

పాలు, బాదం
రెండు బాదం పప్పులను రాత్రి నానబెట్టి.. ఉదయాన్నే వాటిని మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా కాచి చల్లార్చిన పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ఫలితం ఉంటుంది.

క్యాబేజ్ తో..
రెండు క్యాబేజీ ఆకులను కట్ చేసుకుని.. చేతులపై పెట్టుకోవాలి. అలాగే 20 నిమిషాలు పెట్టుకోవాలి. క్రమం తప్పకుండా రోజూ ఇలా చేయడం వల్ల వెంటనే ట్యాన్ తగ్గిపోతుంది.

పెరుగు
చల్లగా ఉన్న పెరుగుని తీసుకుని అందులో కాస్త పసుపు కలపాలి. ఈ పేస్ట్ ని చేతులకు అప్లై చేసి అరగంట ఆరనివ్వాలి. తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ స్నానానికి ముందు క్రమం తప్పకుండా వేయడం వల్ల ట్యాన్ కి గుడ్ బై చెప్పవచ్చు.

దోసకాయ
దోసకాయ గుజ్జు కొద్దిగా తీసుకుని అందులో రెండు స్పూన్ల పాలు, కాస్త నిమ్మరసం యాడ్ చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ట్యాన్ ఉన్నచోట అప్లై చేసి 15 తర్వాత కడిగేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుంటే చేతులు చూడచక్కగా మారిపోతాయి.

నిమ్మరసం
నిమ్మరసం ట్యాన్ తొలగించడానికి బాగా సహకరిస్తుంది. కాబట్టి కొద్దిగా నిమ్మరసం తీసుకుని అందులో చిటికెడు పసుపు కలిపి చేతులకు రాసుకోవాలి. కాసేపటి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బొప్పాయి
బాగా పండిన బొప్పాయి గుజ్జు తీసుకుని చేతులకు మర్దనా చేయాలి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే.. ట్యాన్ తగ్గిపోయి చేతులు నిగారింపు సంతరించుకుంటాయి.

బియ్యం పిండి
బియ్యం పిండిలో కొద్దిగా పచ్చిపాలు, కొద్దిగా రోజ్ వాటర్ వేసి పేస్ట్ లా చేసి చేతులకు ప్యాక్ లా వేసుకోవాలి. ఆరాక చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చేతులపై ఉండే ట్యాన్ పూర్తీగా తగ్గిపోతుంది.

సన్ ఫ్లవర్ ఆయిల్
ట్యాన్‌ను తొలగించాలంటే.. సన్‌ఫ్లవర్ ఆయిల్, నిమ్మరసం, పంచదార కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు పట్టించి, కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.

దాల్చిన చెక్క
దాల్చిన చెక్క సౌందర్యానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే డైరెక్ట్ అప్లై చేయకూడదు. కాబట్టి ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడికి కొద్దిగా తేనె కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు మసాజ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మంచిది.

వంటసోడా
రెండు స్పూన్ల నిమ్మరసం, తేనె, వంటసోడా తీసుకుని బాగా కలపాలి. చేతులను వేడినీళ్లతో కడిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆలివ్ ఆయిల్
ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, చక్కెర కలిపి చేతులకు రాసుకుని మర్దనా చేయాలి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే.. చేతులు తెల్లగా మారిపోతాయి.



Click it and Unblock the Notifications