For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు, పెద్దవారిలో గజ్జి, తామరను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

|

సాధారణంగా చర్మం మీద ఒక రింగ్ ఆకారలంలో ఎరుపు రంగులో దురదపెట్టినట్లు లేదా సాఫ్ట్ పేల్ గా ఉన్నట్లు కనిపిస్తే అప్పుడు దాన్ని రింగ్ వార్మ్ గా గుర్తించాలి. ఈ ఇన్ఫెక్షన్ ను మన చర్మంలో ఎక్కడైన కనుగొనవచ్చు . ఈ రింగ్ వార్మ్ నే తెలుగులో తామరగా చెబుతుంటారు. సాధారణంగా తామర గజ్జల్లోను, చంకల్లోను పిరుదలమీద, నడుముచుట్టూ వ్యాపించడం దురద కలిగించడం చూస్తాము. అయితే శరీరం మీద ఇతరచోట్ల తామర రాదనీ కాదు, కాని శరీరంలో ఎక్కడైతే ఎక్కువ చెమట పట్టుతుందో, గాలి, వెలుతురూ తగలకుండా ఉంటుందో అటువంటి చోట్ల తామరకి సంభందించిన ఫంగస్ ఏర్పడుతుంది

అలాగే శరీరంన్ మీద దెబ్బలు తగిలి గాయం ఎరాడినచోట, చర్మం అనారోగ్యంగా ఉన్నచోట ఫంగస్ తెలికిగా చోటు చేసుకుని పెరుగుతుంది. అలాగే శరీరం మీద దెబ్బలు తగిలి గాయం ఏర్పడినచోట, చర్మం అనారోగ్యంగా ఉన్నచోట ఫమ్గాసు తెలికిగా చోటు చేసుకుని పెరుగుతుంది. శారీరకంగా బలహీనంగా ఉన్నవారిలో కూడా ఈ తామర తెలికిగా వస్తుంది. అలాగే గాలి అడకుండా ఎప్పుడూ దుస్తులు వేసుకునే వారిలో తామర తెలికిగా వస్తుంది. సాధారణంగా ఒకరికి తామర ఉంటే వారితో కలసిమెలసి వుండే వారికి తామర తెలికిగా సంక్రమిస్తుంది. కాని మంచి అరోగ్యం ఉండి, శరీర శుభ్రతను జాగ్రత్తగా పాటిస్తూ, వదులుగా ఉండే దుస్తులు ధరిస్తూ, గాలి వెలుతురూ తగలేటట్లు చూసుకుంటూ ఉండే వారితో ఉన్న వారికి తామర సంక్రమించడం అరుదు.

తామరకి సంభందించిన ఒక రకమైన ఫంగస్ చర్మం పైపావురల్లోనే పెరగవచ్చు; మరొక రకమైన ఫంగస్ చర్మం పొరలను చేధించుకుని మరింత లోపలకి ప్రయానించవచ్చు. వ్యాధి లక్షణాలను కలిగించవచ్చు. తామర కేవలం చర్మానికి రావాడేమీకాదు, వేళ్ళకు, గోళ్ళకి, కళ్ళకు కూడా వస్తుంది. ముందే మనం తెలుసుకున్నట్లుగా ఫంగస్ అనేక రకాలు ఉన్నాయి. కునుక దాన్ని బట్టి అవి శరీరంలో పెరిగే స్థలాలు, కలిగించే వ్యాధి లక్షణాలు వేరు వేరుగా ఉంటాయి. అయితే ఈ ఫంగస్ ను నివారించడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి.

ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ కు ఎక్కువగా గురి అవుతుంటారు. పెద్దల్లో కూడా చర్మం చాలా సెన్సిటివ్ గా లేదా లేతగా ఉన్న వారిలో కూడా ఈ రింగ్ వార్మ్ వాప్తి చెందుతుంది. రింగ్ వార్మ్ అనే వార్మ్స్ (నులిపురుగులు కాదు)అయితే ఇది ఇక ఫంగస్. ఇన్ఫెక్షన్ కలిగించే ఒక ఫంగస్ . దీన్ని యాంటీ ఫంగల్ మెడికేషన్స్ తో చికిత్స చేసుకోవచ్చు . మందుల షాపుల్లో ఈ యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ మెడికేషన్స్ ఎలాంటి ప్రిస్క్రిప్షన్స్ అవసరం లేకుండానే అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు, వీటితో పాటు, ఆయిట్ మెంట్ మరియు సొల్యూషన్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటన్నింటికంటే చాలా ఎఫెక్టివ్ గా నేచురల్ హోం రెమెడీస్ చాలా గ్రేట్ గా పనిచేస్తాయి .

మరి రింగ్ వార్మ్ (తామర)వ్యాధి నివారించే నేచురల్ రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో ఉండే మెడిసినల్ విలువలు చాలా గ్రేట్ గా పనిచేస్తాయి. ముఖ్యంగా రింగ్ వార్మ్ నివారించడంలో ఇన్ఫెక్షన్స్ తో చాలా ఎఫెక్టివ్ గా పోరాడుతుంది.

కొబ్బరి నూనె :

కొబ్బరి నూనె :

కొబ్బరి నూనె మరో వండర్ ఫుల్ హోం రెమెడీ. రింగ్ వార్మ్ మూలాల నుండి ఇన్ఫెక్షన్ నివారించే గుణాలు కొబ్బరి నూనెలో ఎక్కువగా ఉన్నాయి. అంతే కాదు, ముందు ముందు ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి.

జోజోబ మరియు ల్యావెండర్ ఆయిల్

జోజోబ మరియు ల్యావెండర్ ఆయిల్

రింగ్ వార్మ్ నివారించడానికి ఒక గ్రేట్ ట్రీట్మెంట్ వంటిది. ముఖ్యంగా చిన్న పిల్లలు, పెరిగే పిల్లల్లో చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది . స్కిన్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఎదుర్కొంటుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ డ్రెస్సింగ్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇందులో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . రింగ్ వార్మ్ ను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కర్పూరం:

కర్పూరం:

రింగ్ వార్మ్ నివారించడంలో మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. కర్పూరం. కర్పూరం చాలా ఎఫెక్టివ్ గా అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ను చాలా గ్రేట్ గా నివారిస్తుంది .

ఆవనూనె

ఆవనూనె

ఆవాలు లేదా ఆవ నూనె రింగ్ వార్మ్ సమస్య ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం ద్వారా చాలా త్వరగా నివారించుకోవచ్చు.

సాల్ట్ వాటర్ -వెనిగర్

సాల్ట్ వాటర్ -వెనిగర్

ఉప్పును వెనిగర్ తో మిక్స్ చేసినప్పుడు ఇది ఒక గ్రేట్ యాంటీ ఫంగల్ మెడికేషన్ గా పనిచేస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తామర ఉన్న ప్రదేశంలో ఈ రెండింటి కాంబినేషన్ ద్రవాన్ని అప్లై చేసి ఫలితాన్ని గమనించండి.

ఆలివ్ ఆకు

ఆలివ్ ఆకు

ప్రాచీన కాలం నుండి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆలివ్ ఆకు నుండి తీసిన రసం రింగ్ వార్మ్ నివారిచండంలో చాలా గ్రేట్ గా పనిచేస్తుంది.

పసుపు

పసుపు

పసుపులో ఉండే ఔషధగుణగణాలు ఎలాంటి చర్మ ఇన్ఫెక్షన్స్ అయినా నివారిస్తుంది మరియు రింగ్ వార్మ్ ను కూడా నిర్మూలిస్తుంది.

లెమన్ గ్రాస్ టీ:

లెమన్ గ్రాస్ టీ:

లెమన్ గ్రాస్ యాంటీ ఫంగల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇన్ఫెక్షన్ నివారించడంలో మరియు ఎలా ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉండటంలో ఇది సహాయపడుతుంది.

బొప్పాయి:

బొప్పాయి:

బొప్పాయి చర్మంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా యాంటీ ఫంగల్ అయినా మరియు యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది బొప్పాయి. రింగ్ వార్మ్ నివారించడంలో పచ్చిబొప్పాయి చాలా గ్రేట్ గా సహాయపడే ఎఫెక్టివ్ హోం రెమెడీ.

ఓరిగానో ఆయిల్

ఓరిగానో ఆయిల్

ఓరిగానోలో ఉండే కెమికల్స్ , లినోలిక్ యాసిడ్, యూరోసిలిక్ యాసిడ్ మరియు ఫినోలిక్ గ్లైకోసైడ్స్ వంటి కెమికల్స్ రింగ్ వార్మ్ ను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

Home Remedies For Ringworm

If you notice a ring like structure on your skin with darker scaly edges and soft pale centre, then it might be Ringworm. The infection could be found anywhere on the skin but the most probable areas affected are skin, nails, scalp, palms or foot. This condition can be cured using few home remedies for ringworm. Read on, to find more.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more